Monday 20 June 2022

 

ముస్లిం యువతుల వివాహ వయసుకు సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు (High Court) కీలక వ్యాఖ్యలు చేసింది

 

 

ముస్లిం యువతుల వివాహ వయసుకు సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు (High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. యువకుడికి 21 ఏళ్లు, యువతికి 16 ఏళ్లు ఉన్నాయి. ముస్లిం (Muslim) పర్సనల్‌ లా ప్రకారం తమకు వివాహ వయసు (Marriage Age)

ముస్లిం యువతుల వివాహ వయసుకు సంబంధించి పంజాబ్హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకరినొకరు ఇష్టపడిన ముస్లిం యువతి, యువకుడు గత వారం వివాహం చేసుకున్నారు. యువకుడికి 21 ఏళ్లు, యువతికి 16 ఏళ్లు ఉన్నాయి. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం తమకు వివాహ వయసు ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. వారికి పంజాబ్, హర్యానా హైకోర్టు రక్షణ కల్పించింది. ముస్లిం ఆచారాల ప్రకారం తమ వివాహం సరైనదేనని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ కొత్త జంట దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ బెంచ్ విచారిస్తోంది.

ముస్లిం చట్టంలో యుక్తవయసు, మేజర్‌ అవడం ఒకటేనని, ఒక వ్యక్తి 15 సంవత్సరాలకు మేజర్‌ అవుతారని ఈ జంట కోర్టుకు తెలిపింది. యుక్తవయసు వచ్చిన ముస్లిం అబ్బాయి లేదా ముస్లిం అమ్మాయి.. వారు ఇష్టపడే వారిని వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉందని, సంరక్షకుడికి జోక్యం చేసుకునే హక్కు లేదని కూడా తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది.. యూనస్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అండ్‌ ఓర్స్ కేసులో తీర్పుతో సహా ఈ విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు వివిధ తీర్పులను ఉదహరించారు. ప్రతివాదులు నెం.5 నుంచి 7 వరకు ఉన్న వారి నుంచి తమ ప్రాణాలకు, స్వేచ్ఛకు తీవ్రమైన ప్రమాదం ఉందని, పఠాన్‌కోట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కి ఫిర్యాదు చేసినా, ఎటువంటి చర్య తీసుకోలేదని నూతన జంట కోర్టుకు తెలిపారు. చట్టం ప్రకారం నిర్ణీత గడువులోగా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేలా ఆదేశాలు జారీ చేస్తే తాము సంతృప్తి చెందుతామని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. యూనస్ ఖాన్ కేసు విషయంలో, ముస్లిం అమ్మాయి వివాహం ముస్లింల పర్సనల్‌ లా ద్వారా నిర్వహిస్తారని కోర్టు అంగీకరించినట్లు గుర్తు చేశారు. వివిధ తీర్పులలో పేర్కొన్న విధంగా.. ముస్లిం యువతి వివాహం ముస్లిం వ్యక్తిగత చట్టం ద్వారా నిర్వహిస్తారని స్పష్టంగా ఉంది. ప్రిన్సిపుల్స్ ఆఫ్ మొహమ్మదీన్ లా బై సర్ దిన్షా ఫర్దుంజీ ముల్లా అనే పుస్తకంలోని ఆర్టికల్ 195 ప్రకారం, పిటిషనర్ నెం.2 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండటంతో ఆమెకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అర్హత ఉంది. పిటిషనర్ నం.1 వయసు 21 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటంతో వివాహం చెల్లుతుందని, పిటిషనర్లు ఇద్దరూ వివాహ వయసు కలిగి ఉన్నారని ముస్లిం పర్సనల్ లా చెబుతుంది. సర్ దిన్షా ఫర్దుంజీ ముల్లా రచించిన ప్రిన్సిపల్స్ ఆఫ్ మొహమ్మదీన్ లా అనే పుస్తకంలోని ఆర్టికల్ 195 ప్రకారం.. యుక్తవయసు వచ్చిన ప్రతి ముస్లిం యువకుడు, యువతి వివాహ ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు. ఇందుకు 15 సంవత్సరాలు పూర్తవ్వాలని పేర్కొంటుంది.

కోర్టు స్పందన ఇలా..

పిటిషనర్ల ఆందోళనను పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి కోర్టు కళ్ళు మూసుకోదు. పిటిషనర్లు వారి కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందున, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను వారు హరించలేరు. చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలిఅని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పఠాన్‌కోట్‌ను ఆదేశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. భారతదేశంలో ప్రత్యేక వివాహ చట్టం, 1954, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 మేరకు.. చట్టబద్ధమైన వివాహ వయసు అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు.

ముస్లిం చట్టం ప్రకారం, వివాహం లేదా నిఖా అనేది ఒక ఒప్పందం. వివాహ వయసు ఉన్న వారు సొంత నిర్ణయాల మేరకు వివాహం చేసుకునే హక్కును ముస్లిం చట్టం కల్పిస్తుంది. చెల్లుబాటు అయ్యే ముస్లిం వివాహానికి షరతులు ఇవే..

ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా ముస్లింలు అయి ఉండాలి.

- ఇద్దరూ యుక్తవయసులో ఉండాలి.

- ఇద్దరికీ అంగీకారం ఉండాలి. ఇద్దరు సాక్షులు ఉండాలి.

- మెహర్, నిషేధించిన బంధాలతో వివాహం చేసుకోకూడదు (Absence of a prohibited degree of relationship).

2021 డిసెంబర్ 15న మహిళల చట్టబద్ధమైన వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో మహిళల వివాహ వయసు 21 సంవత్సరాలకు చేరుతుంది. అన్ని మతాలకు అతీతంగా మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన "బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు, 2021"ను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

 

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...