Tuesday 26 July 2022

 నాటి సైనికుల పోరాట స్పూర్తి చిరస్మరణీయం

1999లో లడఖ్‌లోని కార్గిల్‌లోకి అక్రమంగా ప్రవేశించి దాన్ని ఆక్రమించుకోవాలకున్న పాక్ సైన్యం, ఉగ్రవాదులకు  ఇండియన్ ఆర్మీహడల్ పుట్టించింది. ఆపరేషన్‌ విజయ్‌పేరుతో సైనిక చర్య ప్రారంభించి పాకిస్థాన్ సైనికులు ఆక్రమించుకున్న అన్ని ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది. మే 8, 1999న ప్రారంభమైన ఈ యుద్ధంలో మన సైన్యం ధైర్యసాహసాలతో పాటు అద్భుతమైన యుద్ధ వ్యూహాలు ప్రదర్శించింది. ఈ సమయంలో 527 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందారు. కార్గిల్‌లో దాదాపు మూడు నెలల పాటు యుద్ధం జరిగిన తర్వాత జులై 26, 1999న భారత సైనికులు పాకిస్థాన్ సైన్యంపై తమ విజయాన్ని ప్రకటించారు. శత్రు సైనికులు వాస్తవాధీన రేఖ వెంబడి ఆక్రమించిన పర్వతాలన్నిటినీ మళ్లీ స్వాధీనం చేసుకుని అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జులై 26న విజయ్ దివస్ మనమందరం జరుపుకుంటున్నాం.

కాగా ఈ యుద్ధంలో పాక్‌పై విజయం సాధించి నేటికి 23 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా భారతీయులందరూ ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకుంటూ.. యుద్ధంలో అసువులు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. భారత సైనికుల పరాక్రమానికి సెల్యూట్ చెబుతున్నారు. తాజాగా రాష్ట్రపతి ముర్ము, రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. మంగళవారం అంటే ఈ రోజు ఉదయం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పించారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద త్రివిధ దళాధిపతులు పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు. త్రివిధ దళాధిపతులైన  ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ప్రస్తుతం అప్పటి కార్గిల్ వార్‌కి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. మంగళవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఈ విజయ్ దివస్ మన సైనిక దళాల అసాధారణ పరాక్రమానికి, సంకల్పానికి ప్రతీక అని, భారతమాతను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన వీర సైనికులందరికీ నమస్కరిస్తున్నానని, దేశప్రజలందరూ వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడూ రుణపడి ఉంటారని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి

 భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము

 

10 comments:

  1. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి
    భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము

    ReplyDelete
  2. జైహింద్

    ReplyDelete
  3. కార్గిల్‌ వీరులారా వందనం.

    ReplyDelete
  4. వారం రోజుల పాటు హోరాహోరీ పోరు జరిగింది. జులై 4వ తేదిన కీలకమైన టైగర్‌ హిల్స్‌ని భారత్‌ స్వాధీనం చేసుకుంది. దీంతో పాక్‌ ఆర్మీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. తెలుగు వాడైన మేజర్‌ పద్మఫణి ఆచార్య ఈ యుద్ధ క్షేత్రంలోనే అమరులయ్యారు.

    ReplyDelete
  5. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన దేశం కోసం కన్నుమూసిన మన హీరోలు (సైనికులు)కు సెల్యూట్

    ReplyDelete
  6. దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని సూచిన పాక్ సైనికులకు భారత ఆర్మీ తమ పరాక్రమాన్నిరుచి చూపించింది.'ఆపరేషన్ విజయ్' తో కార్గిల్ నుండి పాకిస్తాన్ చొరబాటుదారులపై యుద్ధ భేరీ మ్రోగించింది

    ReplyDelete
  7. ఈ విజయం వెనుక ఎంతో మంది సైనికుల ప్రాణ త్యాగం ఉంది. తమ ప్రాణాలను అడ్డుపెట్టి మన దేశాన్ని రక్షించడమే కాదు.. పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. పాకిస్థాన్‌ను ఏకాకి చేశారు.
    పాకిస్థాన్ వక్రబుద్ధిని భారత వీరులు విజయవంతంగా తిప్పి కొట్టారు. దాయాది దేశం పాకిస్తాన్‌ కన్ను ఎప్పుడూ భారత్ పైనే.. ముఖ్యంగా కశ్మీర్ మీదే ఉంటుంది. ఏదో ఒక వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా చేసింది.
    నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి మన ఆర్మీపై దాడికి తెగబడింది. ఇండియన్‌ ఆర్మీ ధీటుగా స్పందించింది. ఆపరేషన్‌ విజయ్‌ పేరుతో పాక్‌కు బుద్ధి చెప్పింది.

    ReplyDelete
  8. దేశసేవకై అంకితమైన ఓ సైనీకుడా
    సరిహద్దుల్లో మెరిసేటి ఓసూర్యుడ

    ReplyDelete
  9. అమ్మఒడిలోనపవళించె ఓ అమర వీరుడ
    నేలతల్లియె నీసేవలకు ఋణపడిఉంటదిర"2"
    జననీ జన్మభూమిఅన్న నినాదాలతో
    నింగినంటిన స్వార్థంలేని ఓ..వీరుడ
    ఓ....సైనిక సూర్యుడా.......

    ReplyDelete
  10. మాతృభూమిపై మమకారంతో
    మరణమృదంగంమ్రోగీంచిన వీరుడ "2"
    దేశసేవకై దేహాన్నర్పించె ధీరుడ
    ఓ సైనిక సూర్యుడా

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...