Friday 22 July 2022

 

*వసంతాన్ని వీడి విప్లవాన్ని పెనవేసుకున్న విప్లవ   కవి దాశరథి….!!



'దాశరథి'గా పిలువబడే..దాశరథి కృష్ణమాచార్యులు

మొదట్లో భావకవిత్వం విరివిగా రాసినా,విప్లవాల పురిటి గడ్డలో పుట్టాడు కాబట్టి , ఆ తర్వాత కలాన్ని కత్తి చేసు

కున్నాడు.అవసరమైతే గన్నెత్తాడు. తన  బాధంతా. తెలంగాణా గురించే.!!

ఈ కవితలో వసంతం ప్రస్తావన తెచ్చినా..ఈయన శోక

సంద్రుడే కానీ..ఈయన శోకం తనకోసం కాదు.ప్రేయసి

రాలేదని, తనకు దక్కలేదని కాదు.తాను పుట్టిన గడ్డలో దొరల దౌర్జన్యానికి,నిజాము ముష్కర మూకతో పీడింప

బడుతున్న సోదరుల్లాంటి... తన జనంకోసమే.!!

నాటి తెలంగాణ సామాజిక, రాజకీయ పరిస్థితులు జనం

సామాన్యానికి ఓ సవాలుగా మారాయి.కాలం కట్టిన కత్తు

ల వంతెనను దాటాల్సిన క్లిష్ట సమయం అది.ఈ పరిస్థితు

ల్లో రాసిక్యం,ప్రేయసి అంటే కుదరదు.ప్రతి ఒక్కరూ ఒక్కో అగ్నికణమై విజృంభించాలి.నిజాము.  పైశాచికత్వాన్ని తునుమాడాలి.ఇది చావుబతుకుల సంకుల సమరం.ఇక్క

డ తలెత్తి  నిలిచినవాడే వీరుడు.ధైర్యంతో మొలకెత్తిన వాడే శూరుడు.

అగ్ని  గుండంలా మారిన తెలంగాణంలోఆవేశంకట్టలు

తెంచుకోవాలి.ముష్కరులు ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాలి. ఇప్పుడిక్కడ వసంతం లేదు.సహింపరాని వేసవి వడ

గాలులు మాత్రమే వున్నాయి.తెలంగాణమంతా చీకటితో కొట్టు మిట్టాడుతుంటే ఇక ఉషస్సులు ఎక్కడినుంచి వస్తా

యి? నెలవంకలేదు.  వెన్నెల జాడలేదు. పున్నమి కన్నెల ఊసే లేదు.

 

భావకవిలా ప్రియురాల్నిసృష్టించుకొని,గాల్లో ప్రణయసౌధా

లు నిర్మించుకునే సమయంకాదది.అగ్నిగుండంగా మారిన తెలంగాణలో విప్లవాన్ని రగిల్చి,పోరాటయోధుల్ని తయా

రు చేసే కాలమది.పోరు తెలంగాణకు ఉద్యమించాల్సిన సమయం. అభ్యుదయ భావ వీచికలతో అక్షరాలతో అగ్గి

సెగలు పుట్టించాల్సిన సమయం. కవిగా... దాశరథి ఆపనే చేశారు.' జనం మనం...మనం జనం‌ ' అని దాశరథి కవితాశరాలను సంధించారు.!

పోరు బాటలో కవికి  ఆకాశం,చుక్కలతో పనిలేదు.అన్యా

యం,దౌర్జన్యాన్ని ఎదిరించగల దమ్ము,ధైర్యం వుండాలి.

ఇప్పుడు ఆకాశం పుట్టెడు శోకంతో వుంది.రణ భూమిలో తన బిడ్డల బాధను చూడలేక కుమిలిపోతోంది ఆకాశవీధి వీధంతా పొగచూరి నల్లగా తయారైంది.ఇప్పుడది దుఃఖ సంగ్రామ భూమి‌నితలపిస్తోంది.అక్కడ పైడి వెన్నెల లేదు.

చుక్కలు లేవు.చంద్రుడు లేడు.ఉన్నదల్లా శోకం.ఆకాశం శోక భూమిలా వుందట.

'ఉలితో పాషాణంలో పీయూషాన్ని చిప్పిలజేసే శిల్పిలాంటి

వాడు కావాలి కవి ' అంటారు  దాశరథి. ఎందుకంటే?

ఆయన కూడా అలాంటివారే కాబట్టి

*భావకవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వానికి

మళ్ళిన దాశరథి!!

*ఇట వసంతము లేదు:సహింపరాని

గ్రీష్మ హేమంత కాల కాళికలె గాని

ఇట ఉషస్సులు లేవు:భరింపరాని  అంబువాహ సందోహ నిశాళి కాని

*వెన్నెలలు లేవు,పున్నమ కన్నెలేదు  పైడి వన్నెల నెలవంక జాడలేదు

చుక్కలే లేవు,ఆకాశ శోక వీథి  ధూమధామమ్ము ,దుఃఖ సంగ్రామభూమి “!!

 

 

3 comments:

  1. అగ్ని పిడుగు దాశరథి
    ప్రజా కోటి దాశరథి
    గాలిబ్ గీతాల మాంత్రికుడు
    బాల గేయాల పిల్లవాడు
    కళామతల్లికు ముద్దు బిడ్డ
    పీడిత ప్రజల వాణికి
    తన కవిత్వాన్ని మైక్గా
    అమర్చిన ప్రజా కవి

    ReplyDelete
  2. తెలంగాణలో కోటి
    ధీరుల గళ ధ్వనినీ మోగించిన వీరుడు
    నాపేరు ప్రజాకోటి
    నా ఊరు ప్రజావాటి అని
    శంఖం మోగించిన ధీరుడు
    నా తెలంగాణ కోటి రత్నాల విణ
    చెప్పిన మహానుభావుడు దాశరథి..

    ReplyDelete
  3. *భావకవిత్వం నుంచి అభ్యుదయ కవిత్వానికి
    మళ్ళిన దాశరథి…

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...