Friday 22 July 2022

 

75 యేండ్ల దేశం

దేశ సంపద పెరుగుతోంది. నేడు మెూటార్ సైకిల్ లేని ఇల్లే కనపడదు.జాతీయెూధ్యమ కాలంలో సైకిళ్ళే లేవు. పరిశ్రమలు,ఆనకట్టలు,ఆస్పత్రులు, పార్మా కంపెనీలు, రహధారులు,ప్రభుత్వ రంగ సంస్ధలు, ఇంటింటికీ కరెంటు, నీరు,నాడు ఉండటానికి గూడు కావాలనే వారు,నేడు సౌకర్యవంతంగా జీవిస్తున్నారు.

లెక్కకు మించి విద్యా సంస్ధలు, కప్యూటర్ రంగం విజృంభన, ఆమెరికా ,ఆస్ట్రేలియా,కెనడా,ఇంగ్లండు దేశాలకు వలసలు.విద్యార్ధులకు నూటికి నూరు మార్కులు,ఐఐటిలు,ఐఐయంలు, నిట్లు, ప్రతిభా వంతులకు ఆన్నీ ఆవకాశాలే.నాడు జొన్నలు, రాగులు,సజ్జలు ,వరిగలే మన ఆహారం.ఏక్కడికి పోవాలన్నా నడవాల్సిందే. నాడు చిరిగిన చొక్కాలు, చిరిగిన నిక్కర్లు,కాళ్ళకూ చెప్పులే ఉండేవి కావు. సెల్ పోన్ లు పెరిగాయి.నాడు ఆయుః ప్రమాణం 57 సం. వత్సరాలు.నేడు 70 సంవత్సరాలు.ఇదంతా  ఓక వైపు.

వేరొకవైపు.ప్రభుత్వ ఆదుపు లేని ఆభివృద్ది, మితి మీరిన ఆర్ధిక వ్యత్యాసాలు, సంపద పెరిగినా వర్గాలు బలపడ్డాయి.సామ్యవాద వీడి పెట్టుబడిదారీ విధానం వైపు ఆడుగులు,ఆవే వర్గాలు, కోటీశ్వరులు,కూలీలు, పరిశ్రామిక వేత్తలూ, శ్రామికులు,భూస్వాములు, కూలీలు.దిశానిర్ధేశం లేని నాయకత్వం,ప్రజాస్వామ్యం పోయి ధనస్వామ్యం, నాయకులు పోయి రౌడీలు, గూండాలు,75 సంవత్సరాల తరువాత మత రాజ్యం వైపు పయనం,ధనికులు నాయకులు ఓటర్లు పేదలు, ఓటర్లనూ,శాసన సభ్యులను కొనటం, వృత్తి నాయకు లు లేరు,సిధ్ధాంతాలు లేవు, ఆంతా గెలుపు, ఓటమి.

గెలిస్తే కోటీశ్వరులు, శత కోటీశ్వరులు ఆవుతారు. ప్రతిభ లేదు, నిభద్ధత లేదు.ప్రభుత్వరంగ సంస్ధల మాయం, మత,కుల ,ఘర్షణలు తారా స్ధాయిలో, మనిషిని మనిషిగా చూసే ధోరణి లేదు.ప్రభుత్వ ఉధ్యోగాలు లేవు. ఆన్నీ ప్రవేటు ఉధ్యోగాలే,8 గంటల పని 12 గంట లైంది.యువత నిర్వీర్య మైంది.ధన మనస్తత్వం పెరిగింది,సామాజక సంభందాలు లేవు, నలుగులు కూర్చొని మాట్లాడే వారే లేరు,ప్రతివాడికీ సెల్ పోన్ కాలక్షేపాలే.  కార్లు,మెూటార్ సైకిళ్ళు, టాక్సీలు వచ్చి జనానికి వలసలు పెరిగాయి.ఏక్కడో ఏదో దేశంలో వారి పని. ఇక ముసలి వారు, పిల్లలు, చదువు లేని వారు నిలయమైంది గ్రామీణం.

సౌకర్యాలు పెరిగినా,జీవన ప్రమాణం పెరిగినా జీవన వ్యయం పెరిగింది.ప్రతిరోజూ పని చేస్తేనే తిండి. మనుషుల మధ్య సయెూధ్య లేదు.మనీ సంస్కృతి పెరిగి మనుషులు దూరమవుతున్నారు.సంపద పెరిగినా మనుషులు నేటికీ మత,కుల భావాలనే పాటిస్తున్నారు.మత సంఘాలు,కుల సంఘాలు,వృత్తి సంఘాలు పెరిగాయి. నేడు మనుషులు లేరు. కులాలు,మతాలు మాత్రమే జీవిస్తున్నాయి.రాజకీయ పదవులను కులాల ఆధారంగా పంపిణీ చేస్తున్నారు. కులాల ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తున్నాయి.

 శాస్త్రం పెరిగింది.సాంకేతికత పెరిగింది.పెరిగిన సాంకేతికతను వినియెూగిస్తున్నాడే గాని,దాని మూల తత్వం విలువగా మారలేదు.మెుదటి నుండి సామా జక సంభందాలు లేక వత్తిడి పెరిగి యువత ఆత్మ హత్యలకు దారితీస్తోంది.తన చుట్టూ తప్ప లోక జ్ణానమే లేదు పిల్లలకు. ఆదీ మన దేశ పరిస్ధితి.నాయకత్వం మనలను క్షాళన చేయాలి గాని వారే మనలను తప్పు దారిలో నడుపుతున్నారు. హేతు త్వం లేదు,వివేచన లేదు,వికాసం లేదు. చదువులు యాంత్రిక మయ్యాయి.ఇది కాదు మనం కోరే సమాజం.సామాజక సంభందాలు, ఆనురాగాలూ ఆప్యాయతలు,ఆనుభందాలు ,సోదర బావం, కలగలిచిన యువత పెరగాలి. కుల సంఘాలు,మత సంఘాలు,వర్గ సంఘాల ప్రాధాన్యత తగ్గాలి. ఆభివృద్ధి వాంచితంగా ఉండాలి. సమానత్వం పెరగాలి.ఆపుడే దేశం సరైన దిశలో నడుస్తుంది.

2 comments:

  1. అంతేగా పాలించేవాళ్లు పాలిస్తున్నారు, నలిగే వాళ్ళు నాలుగుతున్నారు, బతికే వాళ్ళు, ఉతికే వాళ్ళు అబ్బో ఒకటేమిటి అంత వెలిగి పోతుంది

    ReplyDelete
  2. వంద యేండ్లు వచ్చిన ఈ అసమాన తత్వం ఉంటదేమో

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...