Friday 22 July 2022

 

హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన.



 

తెలంగాణ ను మరోసారి భారీ వర్ష సూచన భయపెడుతోంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గత మూడ్రోజులుగా అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిశాయి. వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చాడని ఊపిరిపీల్చుకునేలోపే వెదర్ అప్‌డేట్ ప్రజల్లో కొత్త టెన్షన్‌ పుట్టిస్తోంది. వర్షాలు, వరదలతో బురదలోంచి జనం బయటపడక ముందే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తునే ఉన్నాయి. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ భారీ వర్షాల రూపంలో విరుచుకుపడటంతో సాగు పనులు మొదలుపెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, నేడు, రేపు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష  సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు  వాహనదారులకు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్ల మీదికి రాకుండా గంట తరువాత రావాలని సూచించారు. భారీ వర్షాలతో నగరంలోని రోడ్ మీదికి చేరిన నీరు బైటికి వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాధికారులు సూచిస్తున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు నీటి వరదను క్లీన్ చేస్తున్నారు

 

1 comment:

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...