Friday 22 July 2022

 

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలలో బాలికలదే హవా!

 



విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న  సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌. శుక్రవారం మధ్యాహ్నం బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు https://cbseresults.nic.in, https://cbse.digitallocker.gov.in/, https://cbse.gov.in

 ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, స్కూల్‌ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. కాగా.. ఈ ఉదయమే సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

అయితే, సీబీఎస్‌ఈ ఒకేరోజు పది, 12 తరగతుల ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ ఏడాది 94.40శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు బోర్డు వెల్లడించింది. బాలికల ఉత్తీర్ణతా శాతం 95.21శాతంగా ఉండగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 93.80శాతంగా ఉన్నట్టు తెలిపింది. బాలురతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణతా 1.41శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, ట్రాన్స్‌జెండర్‌ల ఉత్తీర్ణతా శాతం 90శాతంగా ఉందని బోర్డు వెల్లడించింది.

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి మే 24 వరకు జరగాయి. దేశవ్యాప్తంగా 7,046 సెంటర్లలో జరిగిన సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు 21,16,209 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 8,94,993 మంది బాలికలు కాగా.. 12,21,195మంది బాలురు.

గత ఐదేళ్లలో ఉత్తీర్ణత ఇలా..

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో 2017 ఉత్తీర్ణతా శాతం 93.12% గా ఉండగా.. 2018లో 86.7%, 2019లో 91.10%, 2020లో 91.46%,  2021లో 99.04%గా నమోదైంది.

కాగా తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్టాలలో కూడా విద్యార్థి విద్యార్థినిలు మంచి ఫలితాలు వచ్చాయి అని తెలిపారు, హైదరాబాద్ నగరంలో కూడా చాల పాఠశాలలో మంచి ఫలితాలు వచ్చునట్టు తెలిపారు, సనత్ నగర్ లోని హిందూ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ మా పాఠశాలలోని పరీక్షకు హాజరైన అందరూ మంచి పలితాలు సాధించారని తెలిపారు, కొంత మంది  విద్యార్థులు మాట్లాడుతూ అనేకంటే గణిత పేపర్ కొంచం కష్టంగా ఉంది అని తెలిపారు... ఇందు సహస్ర, ఈషా, వర్ష, స్నేహ, తదితరులు మాట్లాడటం జరిగింది

1 comment:

  1. సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో 2017 ఉత్తీర్ణతా శాతం 93.12% గా ఉండగా.. 2018లో 86.7%, 2019లో 91.10%, 2020లో 91.46%, 2021లో 99.04%గా నమోదైంది.

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...