Thursday 25 August 2022

 

ఢిల్లీలో బేరాలు!!??

 

తమ ఎమ్మెల్యేల‌ను కొనడానికి ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తోందని పార్టీ సీనియర్ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం ఉదయం ఢిల్లీలో తమ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనుంది.

ఇవాళ ఉదయం 11 గంటలకు అత్య‌వ‌స‌ర‌ స‌మావేశం కానుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఆప్ తన కొంతమంది ఎమ్మెల్యేలను సంప్ర‌దించినా అందుబాటులోకి రావ‌డం లేద‌ని తెలుస్తోంది. వారు మీటింగుల‌కు వ‌స్తారా రారా లేకపోతే బీజేపీకి అందుబాటులోకి వెళ్లారా అనేది అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

కాషాయ పార్టీలో చేరేందుకు బీజేపీ తమకు రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని గతంలో నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.

బుధవారం ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. త‌మ‌ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల నగదుతో కొనడానికి ఆప్ త‌ప్పుబ‌డుతోంది

 

6 comments:

  1. ఎన్నిక‌ల ఖ‌ర్చు దండిగా ఉన్న రాష్ట్రాల్లో.. ఇలా ప్ర‌భుత్వాల‌ను కూల్చే త‌రుణంలో ప్ర‌స్తుతం ఎమ్మెల్యేల‌కు 50 కోట్ల రూపాయ‌ల ఆఫ‌ర్ ఉంద‌ని వినికిడి! క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌ల్లో.. ఎమ్మెల్యేలు ఇదే రేటు ప‌లికార‌ని అక్క‌డ ఆ స‌మ‌యాల్లో టాక్ వినిపించింది. వారితో పోలిస్తే ఢిల్లీలో ఎమ్మెల్యేల రేటు కాస్త త‌క్కువే అయినా, ఎన్నిక‌ల ఖ‌ర్చు త‌క్కువ కాబ‌ట్టి.. గిట్టుబాటు ధ‌రేనేమో అది కూడా!

    ReplyDelete
  2. ఒక్కో ఎమ్మెల్యేపై 20 నుంచి 25 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్టేందుకు క‌మ‌లం పార్టీ వెనుకాడం లేద‌ని ఆప్ ఆరోపిస్తోంది.

    ReplyDelete
  3. మ‌రి రాజ‌కీయంగా చూస్తే.. రాష్ట్రానికి త‌క్కువ‌, కేంద్ర పాలిత ప్రాంతానికి ఎక్కువ అన్న‌ట్టుగా ఉండే ఢిల్లీలోనే ఒక్కో ఎమ్మెల్యే పై 20 నుంచి 25 కోట్ల రూపాయ‌ల రేటు అంటే రాజ‌కీయంగా ఇదంతా గొప్ప ప్ర‌గ‌తేనేమో! ధ‌నిక రాష్ట్రాలు, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలు, ఎన్నిక‌ల ఖ‌ర్చులు ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల‌తో పోల్చినా 25 కోట్ల రూపాయ‌లంటే మంచి ధ‌రే!

    ReplyDelete
  4. ఎన్నిక‌ల ఖ‌ర్చు దండిగా ఉన్న రాష్ట్రాల్లో.. ఇలా ప్ర‌భుత్వాల‌ను కూల్చే త‌రుణంలో ప్ర‌స్తుతం ఎమ్మెల్యేల‌కు 50 కోట్ల రూపాయ‌ల ఆఫ‌ర్ ఉంద‌ని వినికిడి

    ReplyDelete
  5. ఎవ‌రైనా ఎమ్మెల్యే త‌నే వెళ్లి బీజేపీ వైపు మొగ్గితే 20 కోట్ల రూపాయ‌ల‌ట‌, అదే త‌న‌తో పాటు మ‌రో ఎమ్మెల్యేను తీసుకు వ‌స్తే.. 20 ప్ల‌స్ రెండో ఎమ్మెల్యేను తెచ్చినందుకు బోన‌స్ గా ఐదు కోట్ల రూపాయ‌ల‌ను బీజేపీ ఆఫ‌ర్ చేస్తోంద‌ని ఆప్ నేత‌లు అంటున్నారు.

    ReplyDelete
  6. అంత డబ్బే

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...