Sunday 21 August 2022

బిజెపి ఆర్ వ్యూహాన్ని అనుసరిస్తుందా రాజాసింగ్, రాజేందర్, రఘునందన్, రామారావు (జూనియర్ ఎన్టీఆర్ ) రామోజీ రావు!!



 తెలంగాణ‌లో భ‌విష్య‌త్ రాజ‌కీయ మార్పున‌కు వాళ్లిద్ద‌రి క‌ల‌యిక సంకేత‌మా? అనే చ‌ర్చ‌కు దారి తీసింది. మునుగోడు స‌భ అనంత‌రం రామోజీగ్రూపు సంస్థ‌ల చైర్మ‌న్ రామోజీరావును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క‌లుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు పేరు తెలియ‌ని వారుండ‌రు. ఆయ‌న్ను కేవ‌లం మీడియా య‌జ‌మానిగా మాత్ర‌మే భావించ‌లేం. అనేక వ్యాపార సంస్థ‌ల అధినేత కూడా.

ఈ నేప‌థ్యంలో రామోజీకి రాజ‌కీయ అవ‌స‌రాలు మెండు. గ‌త 8 ఏళ్లుగా కేసీఆర్ అధికార ప‌ల్లకీని రామోజీరావు మోస్తున్నారు. కేసీఆర్ స‌ర్కార్ త‌ప్పిదాల‌ను క‌ప్పి పుచ్చ‌డం త‌న మీడియా బాధ్య‌త‌గా ఆయ‌న వ్య‌వ‌హరిస్తూ వ‌చ్చారు. కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త రాకుండా జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌నే త‌ప‌న ఆయ‌న మీడియాలో క‌నిపించింది. ఇదంతా రామోజీ ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తిబింబమ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతూ వ‌చ్చాయి.

తాజాగా అమిత్‌షాతో భేటీ నేప‌థ్యంలో రామోజీలో వ‌చ్చిన మార్పా? లేక తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌కు మార్పున‌కు సంకేత‌మా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దో బ‌ల‌మైన నెట్‌వ‌ర్క్ క‌లిగిన రామోజీరావు క‌నుక్కోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. 2023లో తెలంగాణ‌లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని బీజేపీ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో వుంది. దీంతో ఆ పార్టీకి మీడియా అవ‌స‌రం ఎంతైనా వుంది. ఈనాడు లాంటి మీడియా సంస్థ అండ బీజేపీకి రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇటు రామోజీకి వ్యాపార ప్ర‌యోజ‌నాలు, అటు బీజేపీకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు... ప‌ర‌స్ప‌ర అవ‌స‌రాలే అమిత్‌షా, రామోజీని క‌లిపాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. మునుగోడు స‌భ‌పై "ఈనాడు" ప్ర‌త్యేక క‌థ‌నం రాయ‌డాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. "ల‌క్ష్యం 2023 ఎన్నిక‌లు" అనే శీర్షిక‌తో బీజేపీకి సానుకూల క‌థ‌నాన్ని రామోజీ ప‌త్రిక వండింది. మునుగోడు స‌భ విజ‌య‌వంతం కావ‌డంతో క‌మ‌ల‌ద‌ళంలో కొత్త ఉత్సాహం నెల‌కుంద‌ని ఆ క‌థ‌నం సారాంశం.

ఒక‌వైపు అమిత్‌షాతో క‌రచాల‌నం చేయ‌గానే, ఈనాడు ప‌త్రిక బీజేపీ ప‌ల్ల‌కి మోయ‌డానికి సిద్ధ‌మ‌నే సంకేతాల్ని ఈ క‌థ‌నం ద్వారా ఇచ్చింది. ఇంత కాలం కేసీఆర్ పాల‌న‌ను కీర్తిస్తూ రాసిన రామోజీరావు, తెలంగాణ‌లో రాజ‌కీయం మారుతోంద‌ని ప‌సిగ‌ట్టి వెంట‌నే అటువైపు మార‌డానికి సిద్ధమైన ఆయ‌న‌లోని వ్యాపార ద‌క్ష‌త‌ను మెచ్చుకోవాల్సిందే. 

రామోజీలో వ‌చ్చిన మార్పును కేసీఆర్ ఎలా తీసుకుంటార‌నేది ఆస‌క్తిక‌ర ప‌రిణామం. నిన్న జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ ఇలా అన్ని గమనిస్తే తేరా వెనుక ఎదో జరుగుతున్నదనేది వాస్తవం చూడాలి అది ఎప్పుడు బయట పడనుందో!!

6 comments:

  1. ఒక‌వేళ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను తీసుకొస్తే లోకేశ్‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నే భ‌యం చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌ల‌లో ఉంది. అంతేకాదు, భువ‌నేశ్వ‌రిపై వైసీపీ ఎమ్మెల్యేలు ఏవో అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌నే దుమారం చెల‌రేగిన‌ప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పంద‌న స‌రిగా లేద‌ని టీడీపీ నేత‌లు వ‌ర్ల రామ‌య్య‌, బోండా ఉమా, బుద్ధా వెంక‌న్న త‌దిత‌రులు తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు మెహ‌ర్బానీ కోసం నాయ‌కులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నా, టీడీపీ శ్రేణుల్లో మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కం ఉంద‌నేది నిజం. దీంతో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ కావ‌డం టీడీపీ నాయ‌క‌త్వం జీర్ణించుకోలేని విష‌యం.

    ReplyDelete
  2. ఏమో ఇది ఆంత తెరవెనక ఉండి చంద్రబాబు ఆడించే అట కూడా అవ్వొచ్చు

    ReplyDelete
  3. తెలంగాణ‌లో భ‌విష్య‌త్ రాజ‌కీయ మార్పున‌కు వాళ్లిద్ద‌రి క‌ల‌యిక సంకేత‌మా?

    ReplyDelete
  4. చంద్ర‌బాబు మెహ‌ర్బానీ కోసం నాయ‌కులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నా, టీడీపీ శ్రేణుల్లో మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కం ఉంద‌నేది నిజం. దీంతో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ కావ‌డం టీడీపీ నాయ‌క‌త్వం జీర్ణించుకోలేని విష‌యం.

    ReplyDelete
  5. టీడీపీ శ్రేణుల్లో మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కం ఉంద‌నేది నిజం.

    ReplyDelete
    Replies
    1. ఒక విషయం మాత్రం నిస్సందేహం -
      తెలుగు దేశాన్ని ఇకపై ఎవరు నడిపించాలనేది మీ కోరిక అన్న ఆప్షన్ గనుక శ్రేణులకిస్తే 90 శాతం మంది - చంద్రబాబు, లోకేష్, జై బాలయ్య, jr ఎన్టీఆర్ లలో jr ఎన్టీఆర్ కి జై కొడతారనేది వాస్తవం - ఇప్పుడున్న నాయకత్వం అస్సలు జీర్ణించుకోలేని పచ్చి నిజం. అది చంద్రబాబు సహా అందరికీ తెలుసు. అందుకే jr ఎన్టీఆర్ కి చంద్రబాబున్నంత వరకు దేశం లోకి "NO ENTRY". ఆ తర్వాత గేట్లు బార్లా తీసి, శ్రేణులన్నీ, jr ఎన్టీఆర్ ని భుజాన్న మోయడాన్ని ఎవరూ ఆపలేరు, బుల్బుల్ బాలయ్య. సహా ఇది సత్యం.

      Delete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...