Thursday 22 December 2022


 ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు 

న్యూ మిలీనియం హైస్కూల్, జమ్మికుంట 







భారతదేశం గర్వించే దగ్గ శాస్త్రవేత్త గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ అని న్యూ మిలీనియం స్కూల్స్ చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని న్యూ మిలీనియం హైస్కూల్లో గణిత దినోత్సవ వేడుకలను పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి ప్రారంభించారు, అనంతరం విద్యార్థులు తయారు చేసిన గణిత నమూనాలు పజిల్స్ ప్రముఖ శాస్త్రవేత్తలు సాధించిన విషయాలను చార్టుల ద్వారా ఉపాధ్యాయులకు సాటి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారని కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు సులభంగా లెక్కలు నేర్చుకోవడానికి వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్  తో అతిపెద్ద గుణకారం,కూడికలు, తీసివేతలు, రూట్స్, స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అతి తక్కువ సమయంలో సులువుగా విద్యార్థులు చెప్పడం జరిగిందని వారు అన్నారు, అనంతరం పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం న్యూ మిలీనియం స్కూల్స్లో గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని విద్యార్థులకు గణిత సబ్జెక్టు పై అవగాహన కల్పిస్తూ ఆ సబ్జెక్టు పై భయం అనేది లేకుండా లెక్కలను సులువైన పద్ధతిలో ఎలా నేర్చుకోవాలి అనే దానిపై వారికి చక్కటి అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు, బహుముఖ ప్రజ్ఞాశాలి గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకమైన నివాళులర్పించామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ విశ్వనాథరెడ్డి వరుణ్ రెడ్డి ఇన్చార్జి తిరుపతిరెడ్డి గణిత అధ్యాపకులు శంకర్ కిరణ్ రమేష్ నవీన్ సారయ్య రాజు రాధిక పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...