Thursday 22 December 2022

 

పెళ్లి చేసుకుందామంటే మాకు పిల్ల దొరకడం లేదు మహారాష్ట్రలో వినూత్న నిరసన.

 



వాళ్లందరూ బాగా చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతో ఇంతో కూడా ఆస్తులు ఉన్నాయి. కానీ పెళ్లి చేసుకోవాడానికి పిల్ల దొరక్కపోవడంతో తెగ ఇబ్బంది పడిపోతున్నారు. పెళ్లి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి, వధువుల కోసం వెతికి వెతికి విసిగిపోయారు. ఒక పక్క వయుస్సు అయిపోతున్నా..వివాహం కాకపోవడంతో మానక్షిక క్షోభకు గురవుతున్నారు. పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి దొరకడం లేదేంటి అని బాధపడే అబ్బాయిల సంఖ్య రోజురోజుకి ఎక్కవయిపోయింది. దీంతో తమకు పెళ్లి కావడం లేదని యువకులందరూ రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

 గుర్రాలపై వచ్చి నిరసన

తమకు పెళ్ళీడు వచ్చినా.. పెళ్లికావడం లేదంటూ చాలామంది యువకులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమకు పెళ్లికాకపోవడాన్ని ప్రభుత్వానిదే తప్పు అని ఎత్తి చూపుతూ గుర్రాలపై కలెక్టరేట్ కార్యాలయంకు ఊరేగింపుగా వచ్చి నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో పెళ్లికొడుకు వేషాధారణలో గుర్రాలపై వచ్చి కలెక్టరేట్ కార్యాలయం వద్ద బైఠాయించారు. రాష్ట్రంలో లింగనిర్ధారణ చట్టం కట్టుదిట్టంగా అమలు కాకపోవడంతో లింగనిష్పత్తి దారుణంగా పడిపోతోందని ఆరోపించారు. ఈ కారణంతోనే తమకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదని విమర్శించారు. ఆడపిల్లల నిష్పత్తి పెరుగుదలకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చేద్దామంటే అబ్బాయిలు దొరికేవారు కాదు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...