Wednesday 14 December 2022

 

 మానవత్వం వికసిస్తుంది మంచితనం పరిమళిస్తుంది 



అవును, మూగజీవాలు ఒకదానికొకటి సాయం చేసుకున్నప్పుడు చూడటానికి మన రెండు కళ్ళు చాలవు.

తాజాగా అలాంటి ఘటనకు సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది.

దాంతో దానిని నెటిజన్లు తేరిపారా చేస్తున్నారు.ఇక్కడ ఒక కోతి జింకకు తినేందుకు ఆకులు అందిస్తూ సాయం చేస్తున్న వీడియోని గమనించవచ్చు.

IFS అధికారి సుశాంత నంద కోతి, జింక స్నేహాన్ని తెలిపే వీడియోని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.ఇక ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, ఒక కోతి.

జింకకు అందని చెట్టు ఆకులను తినేందుకు సహకరిస్తోంది.ఈ అద్భుతమైన ఈ వీడియోలో రెండు జింకలు చెట్టు కింద నిలబడి, ఆకులను తినడానికి యత్నిస్తుండటం మనం చూడవచ్చు

కాగా ఆ చెట్టుయొక్క కొమ్మ బాగా ఎత్తులో ఉండడంతో జింకలు తినలేకపోతున్నాయి.వాటి ఇబ్బందిని గమనించి ఓ కోతి.కొమ్మపై కూర్చొని దాన్ని కిందకు వంగేలా వాటికి సాయం చేస్తుంది.దీంతో కింద ఉన్న రెండు జింకలకు కొమ్మలు అందడంతో.హాయిగా ఆ ఆకులు ఆరగిస్తున్నాయి.కాగా ఈ వీడియోలో కోతి, జింకలకు గల స్నేహం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

ఇక వీటిని చూసిన నెటిజన్లు ఇలాంటి గుణం కలిగిన జంతువులు మనుషుల కంటే వందరెట్లు నయం అని చెబుతున్నారు.కాగా ఈ వీడియో ఇప్పటి వరకు 55 వేలకు పైగా వ్యూస్ ను సాధించడం విశేషం..మీరు ఓ లుక్కేయండి 

 <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...