Wednesday 14 December 2022

 <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

సర్కారు బడుల్లో పిల్లలకు ఏది రక్షణ-- మురళి ఆకునూరి

 రిటైర్డ్ ఐ .. ఎస్

 

రంగారెడ్డి జిల్లా చౌదరి గూడ మండలం పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో

3వ తరగతి విద్యార్థిని పాము కాటు గురైన సంఘటన కలకలం రేపింది. టాయిలెట్ కు వెళ్లిన

విద్యార్థినిని పాము మూడు కాట్లు వేసింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు, విద్యార్థుల

తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.  ఆ పాఠశాలలో అపరిశుభ్ర

వాతావరణం,  టాయిలెట్లు చెత్తతో నిండిపోయాయని అంటున్నారు. టాయిలె

ట్లు దుర్గంధం, దుర్వాసన కొడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చికిత్స

కోసం విద్యార్థిని అక్షితను  ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు పామును కొట్టిచంపారు.

ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలంటే భయంగా ఉందని తల్లిదండ్రులు

అంటున్నారు.

 

ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థిని పాము కాటుకు గురైంది.  దీంతో తోటి విద్యార్థులు

భయాందోళన చెందుతున్నారు. పాఠశాలలో అపరిశుభ్ర పరిసరాల కారణంగా ఇలాంటి

ఘటనలు తరచూ జరుగుతున్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల

పరిసరాలు, మరుగుదొడ్లు చెత్త చెదరంతో నిండి పోయాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

బడులల్ల పాములు కరుస్తయి ఆస్పత్రులల్ల ఎలుకలు కరుస్తయి హాస్టళ్ల అన్నం లో

పురుగులు సాంబార్ల బల్లులు బడులల్ల ఆడపిల్లలకు మరుగుదొడ్లు కరువు

రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు కౌలు రైతులకు మొండి చెయ్యి

పోలీస్ స్టేషన్లల్ల /ప్రభుత్వ ఆఫీసులల్ల లంచాలు ఇగ ఈయన దేశాన్ని ఎలగ

పెడతాడట


No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...