Wednesday, 24 August 2022

అరవింద్ కేజ్రీవాల్ భావి ప్రధాని అవ్వగలరా!!?

 




2014లో ప్రధాన మంత్రి పదవికి పోటీ చేసేనప్పుడు, ‘‘హిందూ హృదయ సామ్రాట్’’గా, గుజరాత్‌లో మూడుసార్లు వరుసగా ఎన్నికల్లో విజయం సాధించిన నాయకుడిగా మోదీని ముందుకు తీసుకొచ్చారు.

అయితే, ఇప్పుడు ఆప్ నాయకుడు కేజ్రీవాల్ కూడా మూడుసార్లు దిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా పంజాబ్‌ ఎన్నికల్లోనూ ఆయన పార్టీ విజయం సాధించింది.

దిల్లీలోని స్కూళ్లు, హాస్పిటళ్ల పరిస్థితులను మెరుగుపరిచినట్లు కేజ్రీవాల్‌కు పేరుంది.

అయితే, ఈ అనుభవంతోపాటు దిల్లీ మోడల్‌ను ఆధారంగా తీసుకొని 2021 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యామ్నాయంగా మారుతారని చెప్పొచ్చా?

 వరుసగా మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ప్రధాన మంత్రి పదవికి 2014లో నరేంద్ర మోదీ పోటీచేశారు. మరోవైపు మూడుసార్లు దిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఓడించి అప్పటికే ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చరిత్ర సృష్టించారు.

ఇద్దరు నాయకులూ వారణాసి వేదికగా నేరుగా కూడా లోక్‌సభ ఎన్నికల్లో తలపడ్డారు. అయితే, ఇక్కడ మోదీ పైచేయి సాధించారు.

సరిగ్గా పదేళ్ల తర్వాత, అంటే 2024లో మరోసారి నరేంద్ర మోదీకి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసురుతున్నారు. 2014లో మోదీ మిషన్ తరహాలోనే భారత్‌ను మరోసారి గొప్ప దేశంగా మారుస్తానని కేజ్రీవాల్ అంటున్నారు.

‘‘ప్రపంచంలో భారత్‌ను అగ్రదేశంగా మార్చేవరకూ మేం ప్రశాంతంగా కూర్చోలేం. దీని కోసం దేశంలోని మూలమూలకు వెళ్లి 130 కోట్ల మందినీ మాతో కలుపుకుంటాం’’అని కేజ్రీవాల్ అన్నారు.

ఇదివరకటి ప్రభుత్వాలను విమర్శిస్తూ.. ‘‘ఈ నాయకులు, పార్టీలకు అధికారాన్ని అప్పగిస్తే, దేశం ముందుకు వెళ్లడం కష్టం అవుతుంది. అందుకే అందరమూ కలిసి పనిచేయాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆప్ నాయకులు మనీష్ సిసోదియా నుంచి రాఘవ్ చడ్ఢా, సంజయ్ సింగ్‌ల వరకు.. ‘‘ఇదివరకు మోదీ వర్సెస్ ఎవరు? అనే చర్చ జరిగేది.. కానీ నేడు ఈ చర్చ మోదీ వర్సెస్ కేజ్రీవాల్‌కు మారింది’’అని చాలాసార్లు చెబుతున్నారు.

2014లో నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆయనకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవముంది.

తన దగ్గర గుజరాత్ మోడల్ ఉందని, అక్కడ అమలుచేసిన కార్యక్రమాలు, వాణిజ్య విధానాలు, వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లాంటి సదస్సులను జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు.

ఈ రాజకీయేతర కార్యక్రమాల్లో పారిశ్రామిక దిగ్గజాలు ముఖేశ్ అంబానీ నుంచి గౌతమ్ అదానీల వరకు పాల్గొనేవారు. దీనిపై దేశ వ్యాప్తంగా మీడియాలో వార్తలు వచ్చేవి.

 ‘‘నేడు ఎవరైనా బీజేపీకి సవాల్ విసురుతున్నారంటే.. అది కచ్చితంగా కేజ్రీవాలే. ప్రస్తుతం మమతా బెనర్జీకి అంత ఉత్సాహం ఉన్నట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్‌ను బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. మరోవైపు ప్రాంతీయ పార్టీలకు కూడా బీజేపీ అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇప్పుడు మోదీకి పోటీ ఇచ్చే వారి రేసులో అరవింద్ కేజ్రీవాల్ ముందు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ

‘‘ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలను అలానే కొనసాగిస్తే, ప్రధాన మంత్రి పదవిని చేరుకునేందుకు ఆయనకు 15ఏళ్లు పడుతుంది. ఎందుకంటే ఆయన కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటుచేసుకుంటూ వస్తున్నారు. దీనికి కాస్త సమయం పడుతుంది’’

‘‘అయితే, ఆయనకు రాజకీయంగా మంచి అనుభవముంది. దేశ ప్రజల నాడి ఎలా పట్టుకోవాలో ఆయనకు తెలుసు. ఇదివరకటి సెక్యులర్ నిర్వచనాలకు కట్టుబడి ఉంటే పని జరగదని ఆయనకు అవగాహన ఉంది. ఇప్పుడు ఆయన హిందూ అనుకూల ఇమేజ్ (ప్రో-హిందూ ఇమేజ్) కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ముస్లిం వ్యతిరేకి అనే ముద్ర కూడా పడకుండా చూసుకుంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి వారు అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్లి హిందువుల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రజలను ఎలా తనవైపు తిప్పుకోవాలో కేజ్రీవాల్‌కు తెలుసు. బీజేపీకి కూడా భవిష్యత్‌లో తమను ఢీకొట్టబోయేది కేజ్రీవాలేనని అవగాహన ఉంది

అయితే, కొన్నిసార్లు తన వైఖరి వల్ల అరవింద్ కేజ్రీవాల్ కూడా విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా దిల్లీ ఘర్షణలు, ఎన్‌ఆర్‌సీ-సీఏఏ లాంటి అంశాలపై కేజ్రీవాల్ మౌనాన్ని విపక్షాలు తప్పుపట్టాయి.

 ‘‘తాజాగా ఆగస్టులో రెండు సర్వేల ఫలితాలు బయటకు వచ్చాయి. ఇదివరకు జాతీయ స్థాయిలో ఆప్ సభ్యత్వం ఒకటి నుంచి 1.5 శాతం చొప్పున పెరిగేదని.. కానీ, ఇప్పుడు అది 6.5 నుంచి 8 శాతానికి వెళ్లిందని వీటిలో పేర్కొన్నారు’’

‘‘దీని ప్రకారం, వచ్చే రెండేళ్లలో ఆప్ ప్రజాదారణ మరింత పెరగొచ్చు. అదే సమయంలో మోదీ ప్రజాదారణ కాస్త తగ్గొచ్చు. కానీ, ప్రస్తుతానికి అయితే, ఇద్దరు నాయకుల మధ్య అంతరం చాలా ఎక్కువే ఉంది. మరోవైపు ఈ రెండు పార్టీలను ఒకరికి మరొకరు పోటీ అని కూడా చెప్పలేం’’

అటల్ బిహారీ వాజ్‌పేయీ, నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్ లాంటి వారు దశాబ్దాల రాజకీయ అనుభంతో ప్రజలపై తమదైన ముద్ర వేశారు.

అయితే, అరవింద్ కేజ్రీవాల్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి కేవలం పదేళ్లు మాత్రమే గడిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో మోదీకి పోటీగా ఇమేజ్‌ను సృష్టించుకోవడం ఆయనకు ఎంత కష్టం? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

 ‘‘రెండు రాష్ట్రాల్లో అనుభవం ఆధారంగా జాతీయ స్థాయిలో ఇమేజ్ సృష్టించుకోవడం కాస్త పెద్ద లక్ష్యమే. ఇప్పుడు కేజ్రీవాల్‌ను పక్కన పెడితే, గతంలో పెద్దపెద్ద రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన సందర్భాలు చాలానే ప్రజలపై చెరగని ముద్ర వేయాలంటే తప్పకుండా కొత్త విధానాలతో ముందుకు రావాలలి

‘‘ఇప్పుడు కేజ్రీవాల్ నడిపిస్తున్న కార్యక్రమాల్లో చాలావరకు ఆయన సొంతంగా సృష్టించినవి లేవు. కాబట్టి ఆయన కొత్తగా ఏదైనా చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో భారత్‌ను మోదీ మెరుగ్గా నడిపిస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’

‘‘ఉదాహరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇది ఒక రాజకీయేతర కార్యక్రమం. ఇలాంటి ఆలోచన ఇదివరకు ఏ పార్టీకి రాలేదు. కేజ్రీవాల్ కూడా ఇలాంటి కొత్త కార్యక్రమాలతో ముందుకు రావాలి. ముఖ్యంగా దిల్లీ లేదా పంజాబ్ ప్రజలను ఆయన పూర్తిగా ఆకట్టుకోవాలి’’

బీజేపీ తరహాలో వనరులు లేదా వ్యవస్థ ఆప్‌కు లేవని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి కేజ్రీవాల్‌ను తమ అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

అయితే,‘‘విపక్షాలు దానికి సిద్ధంగా లేవు. మరోవైపు తాను ఒంటరిగానే బరిలోకి దిగుతానని కేజ్రీవాల్ కూడా స్పష్టం చేశారు. కొన్ని విపక్షాలు కూడా ఆయన్ను ముప్పుగానే పరిగణిస్తున్నాయి’’

ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్షాల అభ్యర్థి కాకపోతే.. మరి ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.

బహుశా నితీశ్ కుమార్ అవుతారేమో.. ఆయన వైపే విపక్షాలు మొగ్గుచూపొచ్చు. మోదీ ఎదగడంలో ఆరెస్సెస్ క్రియాశీల పాత్ర పోషించినట్లే.. ప్రతిపక్షాలన్నీ కలిసి ఆయన్ను ముందుకు తీసుకురావొచ్చు. ఇక మమతా బెనర్జీ విషయానికి వస్తే, ఆమె సొంత పార్టీలో చాలా తలనొప్పులు ఉన్నాయి’’.

‘‘నితీశ్‌కు కొన్ని అంశాలు కలిసి రావొచ్చు. ముఖ్యంగా ఆయన అనుభవం, హిందీ మాట్లాడే రాష్ట్రం నుంచి రావడం, మంచి పాలకుడిగా గుర్తింపు.. ఇవన్నీ కలిసొచ్చే అంశాలు. ఎందుకంటే ముందుగా హిందీ రాష్ట్రాల నుంచి బీజేపీని కూకటివేళ్లతో పెకలించాలి. మరోవైపు నితీశ్ వయసు కూడా 70ఏళ్లు దాటింది. దీంతో విపక్షాల్లోని యువ నేతలు ఆయనకు ఎంత మద్దతు ప్రకటిస్తారో చూడాలి’’

‘‘నితీశ్‌కు కాంగ్రెస్ మద్దతు పలకొచ్చు. ఎందుకంటే రాహుల్‌కు విపక్షాలు సిద్ధంగా లేవని కాంగ్రెస్‌కు కూడా తెలుసు. మరోవైపు రాహుల్ గాంధీకి పోటీగా తమ పార్టీలోని మరొకరిని ముందుకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. దీంతో కచ్చితంగా కాంగ్రెస్ బయటి వ్యక్తులనే ముందుకు తేవాలి. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి బయటకువెళ్లి పార్టీలు పెట్టిన శరద్ పవార్, జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ లాంటి వారికి కూడా పార్టీ మద్దతు ఇవ్వకపోవచ్చు.


  

Sunday, 21 August 2022

బిజెపి ఆర్ వ్యూహాన్ని అనుసరిస్తుందా రాజాసింగ్, రాజేందర్, రఘునందన్, రామారావు (జూనియర్ ఎన్టీఆర్ ) రామోజీ రావు!!



 తెలంగాణ‌లో భ‌విష్య‌త్ రాజ‌కీయ మార్పున‌కు వాళ్లిద్ద‌రి క‌ల‌యిక సంకేత‌మా? అనే చ‌ర్చ‌కు దారి తీసింది. మునుగోడు స‌భ అనంత‌రం రామోజీగ్రూపు సంస్థ‌ల చైర్మ‌న్ రామోజీరావును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క‌లుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు పేరు తెలియ‌ని వారుండ‌రు. ఆయ‌న్ను కేవ‌లం మీడియా య‌జ‌మానిగా మాత్ర‌మే భావించ‌లేం. అనేక వ్యాపార సంస్థ‌ల అధినేత కూడా.

ఈ నేప‌థ్యంలో రామోజీకి రాజ‌కీయ అవ‌స‌రాలు మెండు. గ‌త 8 ఏళ్లుగా కేసీఆర్ అధికార ప‌ల్లకీని రామోజీరావు మోస్తున్నారు. కేసీఆర్ స‌ర్కార్ త‌ప్పిదాల‌ను క‌ప్పి పుచ్చ‌డం త‌న మీడియా బాధ్య‌త‌గా ఆయ‌న వ్య‌వ‌హరిస్తూ వ‌చ్చారు. కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త రాకుండా జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌నే త‌ప‌న ఆయ‌న మీడియాలో క‌నిపించింది. ఇదంతా రామోజీ ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తిబింబమ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతూ వ‌చ్చాయి.

తాజాగా అమిత్‌షాతో భేటీ నేప‌థ్యంలో రామోజీలో వ‌చ్చిన మార్పా? లేక తెలంగాణ‌లో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌కు మార్పున‌కు సంకేత‌మా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దో బ‌ల‌మైన నెట్‌వ‌ర్క్ క‌లిగిన రామోజీరావు క‌నుక్కోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. 2023లో తెలంగాణ‌లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని బీజేపీ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో వుంది. దీంతో ఆ పార్టీకి మీడియా అవ‌స‌రం ఎంతైనా వుంది. ఈనాడు లాంటి మీడియా సంస్థ అండ బీజేపీకి రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇటు రామోజీకి వ్యాపార ప్ర‌యోజ‌నాలు, అటు బీజేపీకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు... ప‌ర‌స్ప‌ర అవ‌స‌రాలే అమిత్‌షా, రామోజీని క‌లిపాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. మునుగోడు స‌భ‌పై "ఈనాడు" ప్ర‌త్యేక క‌థ‌నం రాయ‌డాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు. "ల‌క్ష్యం 2023 ఎన్నిక‌లు" అనే శీర్షిక‌తో బీజేపీకి సానుకూల క‌థ‌నాన్ని రామోజీ ప‌త్రిక వండింది. మునుగోడు స‌భ విజ‌య‌వంతం కావ‌డంతో క‌మ‌ల‌ద‌ళంలో కొత్త ఉత్సాహం నెల‌కుంద‌ని ఆ క‌థ‌నం సారాంశం.

ఒక‌వైపు అమిత్‌షాతో క‌రచాల‌నం చేయ‌గానే, ఈనాడు ప‌త్రిక బీజేపీ ప‌ల్ల‌కి మోయ‌డానికి సిద్ధ‌మ‌నే సంకేతాల్ని ఈ క‌థ‌నం ద్వారా ఇచ్చింది. ఇంత కాలం కేసీఆర్ పాల‌న‌ను కీర్తిస్తూ రాసిన రామోజీరావు, తెలంగాణ‌లో రాజ‌కీయం మారుతోంద‌ని ప‌సిగ‌ట్టి వెంట‌నే అటువైపు మార‌డానికి సిద్ధమైన ఆయ‌న‌లోని వ్యాపార ద‌క్ష‌త‌ను మెచ్చుకోవాల్సిందే. 

రామోజీలో వ‌చ్చిన మార్పును కేసీఆర్ ఎలా తీసుకుంటార‌నేది ఆస‌క్తిక‌ర ప‌రిణామం. నిన్న జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ ఇలా అన్ని గమనిస్తే తేరా వెనుక ఎదో జరుగుతున్నదనేది వాస్తవం చూడాలి అది ఎప్పుడు బయట పడనుందో!!

ఎన్టీఆర్ అమిత్ షా.. భేటి.. రాజకీయ కోణం?!


మునుగోడులో స‌మ‌ర‌భేరి స‌భ‌కు ముఖ్య అతిథిగా వ‌స్తున్న అమిత్ షా... ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిన‌ట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం నోవాటెల్ లో ఆమిత్ షా తో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున‌ట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ సైడ్ నుండి ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన త‌ర్వాత అమిత్ షా ఎన్టీఆర్ న‌ట‌న న‌చ్చి ప్ర‌తేక్యంగా డిన్న‌ర్ మీట్ కు అహ్వానించిన‌ట్లు చెప్పుతున్నారు. మ‌రోవైపు పొలిటికల్ లో స‌ర్కిల్ లో మాత్రం బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో భాగంగా స‌మావేశం అవుతున్న‌ట్లు చ‌ర్చించుకుంటున్నారు.

ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న చందంగా బీజేపీ వ్యూహానికి టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ గిల‌గిలా త‌న్నుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షాను టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో, దివంగ‌త ఎన్టీఆర్ వార‌సుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌ల‌వ‌నున్నారు. ఈ భేటీకి రాజ‌కీయంగా విశేష ప్రాధాన్యం ఏర్ప‌డింది. ప్ర‌ధాని మోదీ, కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షా ఎవ‌రినీ ఊరికే క‌ల‌వ‌రు.

ఎవ‌రితోనైనా వారు భేటీ అయ్యారంటే మ‌రెవ‌రికో స్పాట్ పెట్టార‌ని అర్థం చేసుకోవల‌సి వుంటుంది. అపాయింట్‌మెంట్ ఇవ్వండ‌య్యా అని రెండేళ్లుగా మోదీ, అమిత్‌షాల‌ను జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వేడుకుంటున్నారు. పైగా బీజేపీకి ఆయ‌న మిత్ర‌ప‌క్షం కూడా. ఎందుక‌నో ప‌వ‌న్‌ను క‌ల‌వ‌డానికి వారు అఇష్టంగా ఉన్న‌ట్టు, నిరాద‌ర‌ణే చెబుతోంది.

ఒక‌వేళ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను తీసుకొస్తే లోకేశ్‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నే భ‌యం చంద్ర‌బాబు, బాల‌కృష్ణ‌ల‌లో ఉంది. అంతేకాదు, భువ‌నేశ్వ‌రిపై వైసీపీ ఎమ్మెల్యేలు ఏవో అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశార‌నే దుమారం చెల‌రేగిన‌ప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పంద‌న స‌రిగా లేద‌ని టీడీపీ నేత‌లు వ‌ర్ల రామ‌య్య‌, బోండా ఉమా, బుద్ధా వెంక‌న్న త‌దిత‌రులు తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు మెహ‌ర్బానీ కోసం నాయ‌కులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నా, టీడీపీ శ్రేణుల్లో మాత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కం ఉంద‌నేది నిజం. దీంతో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ కావ‌డం టీడీపీ నాయ‌క‌త్వం జీర్ణించుకోలేని విష‌యం.

ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే... మిత్ర‌ప‌క్షంగా ఉంటూనే చంద్ర‌బాబు ప్ర‌యోజ‌నాల కోసం డ్రామాలాడుతున్నార‌నే ఆరోప‌ణ‌ల‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎదుర్కొంటున్నారు. మ‌రీ ముఖ్యంగా త‌మ‌తో పొత్తులో ఉంటూ చంద్ర‌బాబుతో అంట‌కాగ‌డాన్ని బీజేపీ సీరియ‌స్‌గా తీసుకుంది. న‌మ్మ‌క‌స్తుడైన భాగ‌స్వామి కాద‌నే పేరు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెచ్చుకున్నారు. దీంతో ప‌వ‌న్‌కు క్ర‌మంగా ప్రాధాన్యం త‌గ్గిస్తూ, ప్ర‌త్యామ్నాయంగా విశేష ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సినీ హీరోని తెచ్చుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు గ‌త కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి పేరును ప్ర‌ముఖంగా ప‌రిశీలిస్తున్న అంశాన్ని కొట్టి పారేయ‌లేం. ఈ నేప‌థ్యంలో మునుగోడుకు వ‌స్తున్న అమిత్‌షా... తిరుగు ప్ర‌యాణంలో ఎన్టీఆర్‌ను క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎన్టీఆర్‌ను క‌ల‌వ‌డం మాత్రం ఇటు చంద్ర‌బాబు, అటు ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం త‌ట్టుకోలేక‌పోతున్నార‌నేది వాస్త‌వం. ఇదే బీజేపీ కోరుకుంటున్న‌ది కూడా.  

ఈ అనూహ్య ప‌రిణామంతో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎన్టీఆర్- షా బేటి జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌త కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌తేక్య దృష్టి పెట్టింద‌ని అంద‌రికి తెలిసిందే. 

ఈ భేటి త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప‌రిణామాలు చాల జ‌ర‌గ‌వ‌చ్చ‌ని బీజేపీ వ‌ర్గాల నుండి వ‌స్తున్నా మాట‌లు. ఈ భేటి అయితే నిజంగా పెద్ద స‌స్పెస్స్ గా క‌నిపిస్తోంది

Thursday, 18 August 2022

 

 కేజ్రీవాల్ లేటెస్ట్ ఫోకస్ యావత్ దేశం మీద పడింది



ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు తనను జాతీయ నేతగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఢిల్లీ సీఎంగా ప్రజలనుంచి మంచి మార్కులు కొట్టేసిన తర్వాత, ఇటీవలే పంజాబ్ ప్రజల నమ్మకాన్ని కూడా చూరగొని పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత.. కేజ్రీవాల్ లేటెస్ట్ ఫోకస్ యావత్ దేశం మీద పడింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికి తాజాగా కేజ్రీవాల్ భారత యాత్ర చేపట్టడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 

కేజ్రీవాల్ తన భారతయాత్రకు ఒక మంచి నినాదం కూడా తయారు చేసుకున్నారు. ‘‘మేక్ ఇండియా నెంబర్ 1’’ అనేదే ఆ నినాదం. దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలని కేజ్రీవాల్ స్వప్నం నిజమే కావొచ్చు. కానీ ఆ ప్రయత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్త పార్టీగా తీర్చిదిద్దడం, యావత్ దేశంలో అస్తిత్వాన్ని చాటుకునేలా సీట్లు గెలవడం కేజ్రీవాల్ లక్ష్యం. వీటన్నింటి పర్యవసానం.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి.. నరేంద్రమోడీని రీప్లేస్ చేయడానికి విపక్షాలు అన్నీ జట్టు కడితే.. ప్రధాన పదవికి ప్రధాన పోటీదారుగా తనను తాను ఆవిష్కరించుకోవడం అనే లక్ష్యం బై డిఫాల్ట్ గా ఉంటుంది. 

ఆ ప్రయత్నంలో భాగంగానేనా అన్నట్లు కేజ్రీవాల్.. మోడీ స్వరాష్ట్రం గుజరాత్ మీద నెక్ట్స్ ఫోకస్ పెట్టారు.. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఎన్నికల్లో ఆప్ పోటీచేస్తుందని, 2023 తెలంగాణ ఎన్నికల్లో కొంత సీరియస్ గానే బరిలో ఉండవచ్చునని కూడా పుకార్లు ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే.. ఆప్ సారథి స్వయంగా గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగేశారు. అక్కడ తన ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. 

దేశవ్యాప్తంగా ప్రజలను ఆప్ వైపు ఆకట్టుకోవడానికి అయిదు హామీలతో ప్రణాళికను రూపొందించారు కేజ్రీవాల్. ఆ అయిదు అంశాలే.. దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ కూడా చేస్తాయని అంటున్నారు.

 1) నాణ్యమైన ఉచిత విద్య,

2) ఉచిత వైద్యం- మందులు,

3) యువత అందరికీ ఉద్యోగాలు,

4)మహిళలకు సమానహక్కులతో కూడిన జీవితం,

5) రైతులకు గిట్టుబాటు ధరల హామీ

అనేవే ఈ పంచసూత్రాలు. ఒక రకంగా చెప్పాలంటే.. అద్భుతమైన హామీలు. యావత్తు దేశ మనుగడ మొత్తం ఈ పంచసూత్రాల్లోనే ఇమిడిపోయి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ అంశాల విషయంలో తాను సమర్థుడైన నాయకుడినే అని కేజ్రీవాల్ ఢిల్లీ పరిపాలనతోనే నిరూపిపించుకున్నారు కూడా.

కానీ.. ఫ్రీబీస్ కు అలవాటు పడిన, పార్టీలు విసిరే బిస్కట్లకు ఆశపడే ప్రజలు వీటిని నమ్మి ఆప్ కు కిరీటం పెడతారా అనేది సందేహం. వారిలో చైతన్యం తీసుకురావడానికి అనేకంటే.. వారిలో నమ్మకం కలిగించడానికి కేజ్రీవాల్ 2024 ఎన్నికల్లోగా ఎంత కృషి చేస్తారనేది గమనించాలి.

 

Tuesday, 16 August 2022

  

ఉప ఎన్నిక పుణ్యమా అని మునుగోడు ప్రజల చిరకాల డిమాండ్లు నెరవేరేనా !!

 


భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను జారీ చేయకముందే ముఖ్యమంత్రి ఉపఎన్నికలో పార్టీ తరపున ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. మునుగోడు ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే మునుగోడు పై ఫోకస్ చేశారు. ఇది మునుగోడు ఉప ఎన్నికకు అధికార పార్టీ ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగస్టు 20న రానున్న ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి రానున్న సందర్భంగా మునుగోడు ప్రజల చిరకాల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. మునుగోడు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించనున్నారని పార్టీ శ్రేణులలో ఆసక్తికర చర్చ జరుగుతోంది

2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న తర్వాత, రాష్ట్రంలో హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ మరియు హుజూరాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌లలో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించారు. కానీ దుబ్బాక, హుజూరాబాద్‌లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేయలేదు. హుజూర్నగర్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా, నాగార్జున సాగర్ ను సైతం టిఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుంది. ఇక దుబ్బాక, హుజురాబాద్ లను బిజెపి కైవసం చేసుకుంది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ మరియు శాసనసభకు రాజీనామా చేయగా తాజాగా సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడానికి ప్రత్యేక దృష్టి పెట్టారు. మునుగోడు ప్రజల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లను యుద్దప్రాతిపదికన ఉపఎన్నికకు ముందు నెరవేర్చేందుకు నివేదికలు ఇవ్వాలని నల్గొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జి. జగదీష్‌రెడ్డిని, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడంతో మునుగోడు ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారని నల్గొండ జిల్లా నాయకులు సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, దశాబ్దాలుగా అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్నప్పటికీ 100 పడకల ప్రభుత్వాసుపత్రి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా పేదవర్గాలు ప్రభుత్వ కళాశాలలు లేక ప్రైవేటు కళాశాలలో డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నత విద్యను పొందలేకపోతున్నారు అని, ఇక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోలేక పోతున్నారని ప్రజల ప్రధాన సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు నేతలు
దీంతో సీఎం కేసీఆర్ ఆగస్టు 20న బహిరంగ సభలో ఈ రెండు డిమాండ్లను నెరవేరుస్తామని, అదే రోజు కళాశాలలు, ఆసుపత్రి మంజూరుకు సంబంధించిన జిఓ (ప్రభుత్వ ఉత్తర్వులు) విడుదల చేస్తామని నల్గొండ పార్టీ నేతలకు హామీ ఇచ్చారని సమాచారం. అంతేకాదు మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్లు తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి మరిన్ని వరాల జల్లు కురిపించాలని భావిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తే వారు టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని భావిస్తున్నారు.


Monday, 15 August 2022

 ఒక్క పొలిసు కేసు కూడా లేని గ్రామం

                                    ఆ కేసును కూడా కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. 


ఈరోజుల్లో పోలీసు కేసు అనేది చాలా సర్వసాధారణమైంది. చీటికిమాటికి కూడా కేసులు పెట్టుకుండే కాలంలో ఆ ఊర్లో ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదంట. నమ్మరా..? ఒక కేసు అయిందిలే అది కూడా రాజీ అయిపోంది అనుకోండి. ఇప్పుడయితే ఒక్క కేసు కూడా లేని గ్రామంగా ఆ ఊరు రికార్డులోకి ఎక్కింది. ఆ ఊరి చరిత్ర తెలుసుకున్న జడ్జి నేరుగా ఆ ఊరికే వెళ్లి అక్కడి గ్రామ పెద్దతో పాటు.. గ్రామస్తులు అందర్నీ అభినందించారు.

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఒక్క కేసు

 కూడా లేని గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ మాటలను నేరుగా కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు.

 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆ గ్రామానికి వచ్చిన ఆమె జాతీయ జెండా ఆవిష్కరించారు. కేసులు లేని

 గ్రామంగా ర్యాగట్లపల్లి నిలిచిందని అభినందించారు.


గ్రామానికి చెందిన ఏకైన కేసుకు సంబంధించి ఇరువర్గాల వారు రాజీపడటంతో.. ఆ కేసును కూడా

 కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. రోడ్డు ప్రమాదం కేసులో ఇరువర్గాలు రాజీపడి తమకు తామే తీర్పు

 ఇచ్చుకోవడం సంతోషకరమన్నారు. దీన్ని రికార్డులో నమోదు చేసి భద్రపరుస్తామన్నారు. 40 ఏళ్లుగా గ్రామంలో

 ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తున్న గ్రామ పెద్ద నాగన్నగారి సిద్ధరాంరెడ్డిని జడ్జి ఈ సందర్భంగా

 సన్మానించారు.

 

 

      యువ కళాకారుడి  ప్రతిభ.

 

ప్రతి ఒక్కరిలో దేశభక్తి పొంగిపొర్లింది.  స్వాతంత్ర్య సమర యోధుల జీవితాలను గుర్తుకు చేసుకుంటూ.. సలామ్ చేశాం.  భారత దేశ గొప్పతనం ప్రపంచ నలుమూలలా తెలిసేలా సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకుంటున్నాం. పూర్ణ స్వరాజ్యం కల నెరవేరి 75 ఏళ్లు కావొస్తుంది. దీనికి గుర్తింపుగా `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` జరుపుకున్నాం. హర్ ఘర్ మే తిరంగా వెలిగిపోయింది. ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు.

భారతదేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని  ఎర్రకోటపై ప్రధాన మంత్రి  జాతీయ జండాను ఆవిష్కరించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మువ్వన్నెలు రెప రెపలు మిరమిట్లు గొలుపుతున్నాయి. కళాకారులు అయితే ఎవరికి తోచిన రీతిలో వారు తమ ప్రతిభను చూపెడుతూ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువ కళాకారుడు చేసిన ప్రయత్నం అందరి మన్ననలు అందుకునే లా చేస్తోంది. కేవలం ఉప్పుతో గ్లోబ్ పై భారత మాత బొమ్మ గీసి.. రంగులద్దాడు.. ఈ చిత్ర చూసినవారంతా ఆ కళాకారుడి ప్రతిభకు సలామ్ అంటున్నారు.

ఇలాంటి బొమ్మలు గీయడం అతడికి ఇదే తొలిసారి కాదు.. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు. చిత్తూరు జిల్లాలోని కుప్పానిక ిచెందిన ఈ కళాకారుడు.. పూరి  ఆర్ట్స్ పేరుతో.. సమాజాన్ని చైతన్య పరిచేలా ఆయన పెయింట్స్ ఉంటున్నాయి. ఇటీవల ఉప్పుతోనే తిరుమల వెంకటేశ్వరుడి బొమ్మ గీసి.. దానికి రంగులు అద్ది.. గోవిందుడి రూపాన్ని ఆవిష్కరించారు.. అతడు గీసిని శ్రీనివాసుడి

 ముఖ చిత్రం అద్భుతంగా ఉంది. పూరి ఆర్ట్స్ పేరుతో యువకుడు పలు చిత్రాలు రూపొందిస్తూ..

 పలువురి మన్ననలు పొందుతున్నాడు. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ తో సత్తా చాటిన పీవీ సింధు బొమ్మను సైతం అట్టముక్కలతో అద్భుతంగా రూపొందించాడు. భారత దేశానికి సంబంధించి ఏ ఘనత వెలుగులోకి వచ్చినా... వెంటనే తన మైండ్ కు పదును పెట్టి.. అద్భుతాలు చేస్తున్నాడు మన పెయింటర్.. గతంలోనూ పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...