Wednesday, 7 December 2022

 కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో.. ఎర్రగడ్డ మానసిక వైద్య శాలలో అన్నదాన కార్యక్రమం




అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు.  

అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతులేదు... కామధేనువు సేవా సమితి ఆధ్వర్యంలో ఎర్రగడ్డలోని మానసిక వైద్య శాలలో కరోన తరువాత రోజు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్కడ తెలంగాణ రాష్ట్రం కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు,కర్ణాటక రాష్టాల నుండి పెద్ద సంఖ్యలో వస్తున్నారు.. అక్కడ ఉచిత భోజన సదుపాయాలు లేకపోవటం వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు.. అది గమనించి కామధేనువు సేవాసమితి అద్వర్యంలో మూడువందల మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయటం జరిగింది.. ఇందులో సమితి సభ్యులు.. దేవేందర్ కొన్నే, పూజ శర్మ, విగ్నేష్, తులసి కుమార్, రవి,రుక్మిణి, సూర్య ప్రకాష్, వెంకటేష్, బాల మురళి కృష్ణ, కేశవ్, మల్లికార్జున్, సూర్య ప్రకాష్... తదితరులు పాల్గొన్నారు






Friday, 2 December 2022

 తలసాని శ్రీనివాస్ గారు, Minister for Animal Husbandry, Fisheries & Cinematography  ఈ నెల 5వ తేదీన గౌరవ మంత్రి శ్రీ కేటీఆర్ గారు ప్రారంభించనున్న బన్సీలాల్ పేట మెట్ల బావి వద్ద మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ గారితో కలిసి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది





<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"
     crossorigin="anonymous"></script>

Tuesday, 8 November 2022

 

              సాయి కృష్ణజ హిల్స్ ను సందర్శించిన ఎమ్మెల్యే వివేకానంద!

 




 

మియాపూర్ బొల్లారం రోడ్డులో ఉన్న కాలనిలో దాదాపు 2000 జనాభా ఉన్న కాలనీ , ఇంకా అక్కడ నూతన కట్టడాలు జరుగుతున్నాయి అయితే ఆ కాలనీలోకి వెళ్ళటానికి ఒకే రోడ్డు అది కూడా 40 ఫీట్స్ రోడ్డు మాత్రమే ఉంది, అయితే అదే కాలనిలో వికాస్ కాన్సెప్ట్ స్కూల్ దాదాపు 4500 పిల్లలు ఉండటం 100 బస్సులు ఉండటం వలన మిగతావాళ్ళు వెళ్ళటానికి రోడ్డు లేని పరిస్థితి , మరి ముఖ్యముగా ఉదయం, సాయంత్రం పాఠశాల వేళల్లో కనీసం అత్యవసర సర్వీసులు కూడా వెళ్లలేని పరిస్థితి, దీనికోసం స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గారిని కలవటం జరిగింది  దానిపై వారు సానుకూలంగా స్పందించి  కాలనీకి వచ్చి పరిశీలించటం జరిగింది, రెండు వారాల్లోగా ప్రధాన రహదారి వరకు ప్రాజెక్టును పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు వారాల తర్వాత మళ్లీ సందర్శిస్తానని  చెప్పారు, అదేవిదంగా కాలనీకి ప్రత్యామ్నాయ రహదారి ఆమోదం దశలో ఉందని, పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు, అది కనుక పూర్తయితే ఆ రోడ్డుకు ప్రత్యామ్నాయ 60 ఫీట్ల రోడ్డు రానుంది.

మా ఎమ్మెల్యే శ్రీ వివేకానంద్ గారితో కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లిన కాలనీ వాసులందరికి, మరియు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు..


Tuesday, 1 November 2022

 

సీనియ‌ర్ హీరోయిన్,  రంభ కారుకు ప్రమాదం



సీనియ‌ర్ హీరోయిన్, అంద‌గ‌త్తె రంభ కారుకు ప్ర‌మాదం జ‌రిగింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. రంభ కుటుంబం కెన‌డాలో వుంటోంది. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ చిత్రాల్లో రంభ న‌టించి ప్రేక్ష‌కుల్ని మెప్పించారు.

కెన‌డాలో స్థిర‌ప‌డిన ఇంద్ర‌కుమార్‌ను రంభ‌ పెళ్లి చేసుకున్నారు. రంభ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇదిలా వుండ‌గా త‌న కారుకు ప్ర‌మాదం జ‌రిగిన విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. పిల్ల‌ల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండ‌గా మ‌రో కారు వ‌చ్చి ఢీకొట్టిన‌ట్టు ఆమె తెలిపారు. ఆ స‌మ‌యంలో కారులో త‌న‌తో పాటు పిల్ల‌లు, ఆయా ఉన్నార‌ని ఆమె వెల్ల‌డించారు. చిన్న‌చిన్న గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డామ‌న్నారు.  ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవ‌డంతో ప్ర‌మాద తీవ్ర‌వ త‌గ్గింద‌ని స‌మాచారం.  

కూతురు సాషాకు స్వ‌ల్ప గాయాలు కావ‌డంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు రంభ వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించి ఫొటోల‌ను ఆమె షేర్ చేశారు. అలాగే దెబ్బ‌తిన్న కారు ఫొటోల‌ను కూడా అభిమానుల‌తో పంచుకున్నారామె. బ్యాడ్ టైమ్ న‌డుస్తోంద‌ని ఆమె వాపోయారు. త‌మ కోసం ప్రార్థ‌న‌లు చేయాల‌ని అభిమానుల్ని వేడుకున్నారు. 

 

Tuesday, 18 October 2022

 

హైదరాబాద్ లో దారుణం..4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి!




హైదరాబాద్ నగరంలో DAV  స్కూల్ లో ప్రిన్సిపాల్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న రజిని కుమార్ అనే దుర్మార్గుడు స్కూల్ లో ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్ లోకి వెళ్లి గత రెండునెలలుగా   ఎల్కేజీ చదువుతున్న విద్యార్థిని (4) పై లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు బాధితురాలి బంధువులు తెలిపారు. ఈ మధ్య కాలంలో పాపా ప్రవర్తన లో తేడా గమనించి తల్లి తండ్రులు ఆరా తీయగా దారుణం వెలుగు వెలుగుచూసింది. ఇలాంటి దుర్మార్గులను వెంటనే కఠినంగా శిక్షించాలని తల్లితండ్రులు కోరుతున్నారు

Friday, 14 October 2022

 

ప్రొ.​ సాయిబాబా నిర్దోషి!

యూఏపీఏ ను రద్దు చేయాలని డిమాండ్!

 


 

మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్  తీర్పు నిచ్చింది. 

ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయన్ను వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు.

తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జీఎన్ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచార‌ణ చేప్ప‌టి నిర్దోషిలుగా ప్ర‌క‌టించింది. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌లో ఉన్న జీఎన్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు?

దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు. 2017 మార్చిలో యూఏపీఏ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆయనను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో నిర్బంధించారు.

వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. 2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

 

దీనిపై డా తోట శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ..

సాయిబాబాపై మోపిన అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)ను రద్దు చేయాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీ ఎమ్మెల్యే సుప్రియా సూలే, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు గతంలో డిమాండ్ చేశారు.

''పౌర హక్కులు, ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిపై ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి''అని హేమంత్ సోరెన్ అప్పట్లో వ్యాఖ్యానించారు.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

Tuesday, 11 October 2022

 

తెలంగాణ తొలి గ్రూప్-1 పరీక్ష--

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ నెల 16న నిర్వహించనున్న మొదటి గ్రూప్ 1 పరీక్షకు అధికారులు అన్ని

 ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 503 ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న ఈ పరీక్షకు 3,80,202 లక్షల మంది

 అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇంత భారీనియామకాలు జరుగుతున్నఈ తరుణంలో ఎలాంటి

 అవకతవకలు జరగకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అనేక కొత్త

 నిబంధనలను సైతం తీసుకువచ్చారు. తొలిసారిగా గ్రూప్-1 నిర్వహణలో పరీక్షా కేంద్రాల్లో సీసీ

 కెమెరాలను ఏర్పాటు చేస్తోంది పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఈ సీసీ కెమెరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్

 ప్రధాన కార్యాలయానికి.. ఇంకా పోలీస్ కమాండ్ కంట్రోల్ కు సైతం అనుసంధానం చేయనున్నారు.

 బయో మెట్రిక్ విధానాన్ని సైతం తొలిసారిగా తీసుకువస్తోంది టీఎస్పీఎస్సీ

అభ్యర్థులు హాల్ టికెట్ ఉంటేనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడుతారు. ఇంకా హాల్ టికెట్ తో పాటు పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్ , ప్రభుత్వ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లో ఏదో ఒకటి గుర్తింపు కార్డుగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

-హాల్ టికెట్ మీద ఫొటో, సిగ్నేచర్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఇందుకోసం హాల్ టికెట్ ను A4 షీట్ పైన ప్రింట్ తీసుకోవాలి. లేజర్ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచించారు. కలర్ ప్రింట్ అయితే ఇంకా బెటర్.

-ఒకవేళ హాల్ టికెట్ పై ఫొటో/సిగ్నేచర్ స్పష్టంగా కనిపించకపోతే అభ్యర్థులు 3 పాస్ పోర్ట్ ఫొటోలు వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ఫొటోలను గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్ట్ చేయించాల్సి ఉంటుంది. వీటితో పాటు అండర్ టేకింగ్ ను సైతం ఇన్విజిలేటర్ కు అందించాల్సి ఉంటుంది. పరీక్ష 10.30 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అభ్యర్థులను రెండు గంటల ముందు నుంచే అంటే 8.30 గంటల నుంచే ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించనున్నారు. పరీక్షా కేంద్రం గేట్ ను 10.15 గంటల నుంచే మూయనున్నారు. ఒక్క సారి గేట్ మూస్తే పరీక్ష ముగిసే వరకు తెరిచేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు.

- క్యాలుకులేటర్స్, మాథ్స్ టేబుల్స్, లాగ్ బుక్స్, పేపర్స్, సెల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాంగ్స్, రైటింగ్ ప్యాడ్స్, చార్ట్స్ లాంటివి ఏవీ ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించరు

బూట్లు వేసుకుని ఎగ్జామ్ కు రావొద్దు. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని టీఎస్సీఎస్సీ స్పష్టం చేసింది.

- ఎగ్జామ్ సెంటర్ వద్ద మీ వస్తువులను దాచడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవు.

-ఎగ్జామ్ సెంటర్ వద్ద అభ్యర్థుల థంబ్ ప్రింట్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మెహందీ, ఇంక్, టాటూలు వేసుకోవద్దని టీఎస్పీఎస్సీ సూచించింది.

- హాజరైన అభ్యర్థితో అభ్యర్థి హాల్ టికెట్ పై ఉన్న ఫొటో తో వెంట తీసుకువచ్చిన ఐడెంటిటీ కార్డుపై ఉన్న ఫొటోను చెక్ చేస్తారు. తప్పు అని తేలితే చర్యలు ఉంటాయి.

- ఓఎంఆర్ షీట్ పై హాల్ టికెట్ నంబర్, టెస్ట్ బుక్ లెట్ నంబర్, వెన్యూ కోడ్ ను నమోదు చేయడానికి అభ్యర్థి బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇంక్ పెన్ ను వాడినా.. సూచించిన ప్రదేశాల్లో కాకుండా.. ఇతర చోట పెన్ తో ఏమైనా రాసినా ఓఎంఆర్ షీట్ ను ఇన్వాలిడ్ గా పరిగణిస్తారు.

 

 

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...