Thursday, 18 May 2023

  

5 రోజులుగా నల్ల నీళ్లు రావటంలేదు--- యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన







ఈరోజు జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి లో గల ఇల్లంతకుంట క్రాస్ రోడ్ వద్ద గత 5 రోజులుగా నల్ల నీళ్లు రాక కాలి బిందెలతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన.

జమ్మికుంట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో గల కొత్తపల్లిలోని ఐదు వార్డులలో మంచినీటి సమస్యతో గత ఐదు రోజులుగా నల్ల నీళ్లు రాకపోవడంతో మహిళలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖాళి బిందెలతో నిరసన  తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాళీ బిందెలతో మహిళలు మాట్లాడుతూ గత ఐదు రోజులుగా కొత్తపల్లి ప్రాంతంలో నిత్యావసర నల్ల నీరు రాక అనేక అవస్థలు పడుతున్న పట్టించుకునే నాధుడు లేడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు, పోలీసులు జోక్యం చేసుకొని  అందర్నీ ఇండ్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు సజ్జాద్ మొహమ్మద్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ రెడ్డి , రంజిత్ రెడ్డి , బాధిత మహిళలు బోగా లలిత , రమా, రాజేశ్వరి , రబ్బాన , సుందరమ్మ , శ్రీమతి , సరూప, షబానా, కళ్యాణి , రాణి, తార , బబ్బి , సల్మాన్ , అరుణ్ తదితరులు పాల్గొన్నారు

Thursday, 20 April 2023

 బాలుడి హత్యలో దోషులను కఠినంగా శిక్షిస్తాం... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..





సనత్నగర్లో దారుణం వెలుగుచూసింది. అల్లావుద్దీన్‌ కోటి ఏరియాలో గురువారం ఏనిమిదేళ్ల బాలుడు అబ్దుల్‌ వహీద్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాలుడి మృతదేహం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు. అయితే అమావాస్య రోజున బాలుడిని ఓ హిజ్రా నరబలి ఇచ్చిన్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.

వివరాలు.. నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్‌ వహీద్‌ (8) గురువారం సాయంత్రం నమాజ్‌ చేయడానికి వెళ్లి తప్పిపోయాడు. అయితే రాత్రి అవుతున్న బాలుడి ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అనంతరం సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు బకెట్‌లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహాన్ని జింకలవాడ నాలాలో స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నాలా నుంచి వెలికితీశారు. 

కాగా వహీద్‌ ఇంటి పక్కనే ఉంటున్న ఇమ్రాన్‌ అనే మహిళ(హిజ్రా).. బాలుడిని మజీద్‌ నుంచి నేరుగా తనతో తీసుకెళ్లిన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.  బాలుడిని చంపి ఓ బస్తాలో వేసుకొని ఆటోలో తీసుకువెళ్లిన్నట్లు చెబుతున్నారు. ఆటోలో మృతదేహాన్ని తీసుకువెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అవ్వడంతో స్థానికులు ఆటో డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. హిజ్రా ఇంటిపై బాలుడి బంధువులతోపాటు స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానాకి చేరుకుని పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరబలి ఇచ్చిన్నట్లుగా అనుమానిస్తున్న మహిళను
 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలుడి మృతికి హిజ్రాయే కారణమా? మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


సనత్ నగర్ బాలుడి మృతి ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్‌ హత్యకు గురువ్వడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
 విషయం తెలుసుకున్న వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

 

Tuesday, 18 April 2023

  

శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా  తీర్చిదిద్దాలి---- పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

 



ముషీరాబాద్ చౌరస్తా గల శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా  తీర్చిదిద్దాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గత నెలలో శ్రీ రామనవమి సందర్భంగా మంత్రి  శ్రీనివాస్ యాదవ్ ఈ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ప్రధాన రహదారి వెంట ఉన్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలులో భాగంగా మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో దేవాదాయశాఖ అధికారులతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రస్తుతం ఆలయం కు 3200 గజాల స్థలం ఉన్నదని, దానిని  పరిగణలోకి తీసుకొని సీతారాములు, ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణానికి, రోడ్ వైపు షాప్స్ నిర్మాణం చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఆలయానికి ఆనుకొని ఉన్న కొంత ప్రయివేటు భూమిని కొనుగోలు చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, స్ధాపతి బుధవారం ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరలోనే మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ లతో కలిసి ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆలయ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఉన్న షాప్స్ నిర్వాహకులకే ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు, షాప్స్ నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, పద్మారావు నగర్ BRS పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆలయ EO రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 29 March 2023

 

యువత చేతిలోనే కర్ణాటక అధికార పీఠం!

 

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 2.6 కోట్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.5 కోట్లు. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే ద‌శ‌లో ఎన్నికలు జరగనున్నాయి. నేటి (మార్చి 29) నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎన్నిక‌ల కోడ్‌) అమలు కానుంది, బెంగళూరు సిటీ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి అనేకల్, బెంగళూరు సౌత్, యశవంతపూర్, దాసరహళ్లి, బ్యాటరాయణపూర్, మహదేవ్‌పూర్ మరియు యలహంక్. ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో సహా యువ ఓటర్ల సంఖ్య పెరిగింది, గత యువ ఓటర్లతో పోలిస్తే ఈసారి యువ ఓటర్ల సంఖ్య సగానికిపైగా పెరిగింది బెంగళూరు నగర ఎన్నికల జిల్లాలో యువత ఓటరు నమోదులో 49 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ఇచ్చింది బెంగళూరులో గతంలో 54,000 మంది ఉన్న యువ ఓటర్ల సంఖ్య ఇప్పుడు 1.1 లక్షలు దాటిందని బెంగళూరు నగర్ జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంగప్ప తెలిపారు ఇక యువతను మైండ్ లో పెట్టుకొనే రాజకీయా పార్టీలు తమదైన శైలిలో హామిల వర్షం కురిపించాయి. కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వస్తే డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు రూ.3 వేలు అందిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అలాగే డిప్లొమా చదివి, నిరుద్యోగులుగా ఉన్న యువతకు రూ.1500 అందిస్తామని చెప్పింది

 

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 104 స్థానాలు రాగా.. కాంగ్రెస్‌కు 78 సీట్లు, జేడీఎస్‌కు 37 సీట్లు వచ్చాయి. అలాగే కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు గెలుచుకోగా.. ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుని అది పెద్ద పార్టీగా అవతరించగా.. జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో జేడీఎస్ అధ్యక్షడు కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కుమారస్వామి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

కొంతమంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మళ్లడంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బలం కోల్పోయింది. ప్రభుత్వం కూలిపోవడంతో కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా జరుగుతుందనే ఆరోపణలు ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగనున్న కర్ణాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.

 

224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో బీజేపీకి 119 మంది, కాంగ్రెస్ కు 75 మంది, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ఈసారి 150 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సారథ్యంలో ఎన్నికలు జరగనున్నాయి. మాజీ సీఎం, లింగాయత్ కీలక నేత బీఎస్ యెడ్యూరప్ప 2024లోను మోడీని మూడోసారి ప్రధాని చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. యెడ్యూరప్ప జూలై 2021 వరకు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత బొమ్మై సీఎం అయ్యారు. ఈసారి యెడ్డీ పోటీ చేసే అవకాశాలు తక్కువ. ఆయన తనయుడు విజయేంద్ర శిఖారిపుర నియోజకవర్గం నుండి పోటీ చేయవచ్చునని భావిస్తున్నారు. అలాగే, బాగా పని చేయని ఎమ్మెల్యేలకు బీజేపీ టిక్కెట్ నిరాకరించే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ ఫేస్ ను ఈ ఎన్నికల్లోను ఉపయోగించుకోనున్నారు. ఇటీవల 4 శాతం ముస్లీం రిజర్వేషన్ ను తొలగించి వొక్కలింగ, లింగాయత్ లకు కేటాయించింది బీజేపీ. ఇది ఈ పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.

రిజర్వేషన్ పునరుద్ధరిస్తామని కాంగ్రెస్

ముస్లీంలకు తొలగించిన నాలుగు శాతం రిజర్వేషన్ ను తాము అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మైనార్టీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించింది. మాజీ సీఎం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేస్తున్నారు. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షులు డీకే శివకుమార్ కు కూడా ప్రాధాన్యత ఇస్తోంది పార్టీ. చాలా రాష్ట్రాల్లో బీజేపీ దరిదాపుల్లోకి రాలేకపోతోంది కాంగ్రెస్. కానీ కర్నాటకలో మాత్రం టఫ్ పైట్ ఇస్తోంది.

జేడీఎస్ కింగ్ మేకర్ ఆశలు

జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ లేదా కింగ్ ఆశలు పెట్టుకున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మెజార్టీ రాకుంటే జేడీఎస్ కు డిమాండ్ పెరుగుతుంది. పాత మైసురు ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లోను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

 

 

Monday, 13 March 2023

 

  హనీ ట్రాప్.. ఈ ఒక్క పరీక్షకేనా!? లేందంటే అన్ని పరీక్షలకా!??

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంస్థకు చెందిన కీలకమైన కంప్యూటర్ హ్యాకింగ్ కు గురైందని, అందుకే పరీక్షను వాయిదావేశామని అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరీక్ష పత్రం లీక్ వెనక జరిగింది హ్యాకింగ్ కాదు, హనీ ట్రాప్.

అవును.. ఓ అమ్మాయి మత్తులో పడి స్వయంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగి ఈ పరీక్ష పత్రాన్ని లీక్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు, సదరు ఉద్యోగితో పాటు, మరో ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకీ ఏం జరిగింది..

లెక్కప్రకారం, ఈరోజు టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి పరీక్ష జరగాల్సి ఉంది. ఓఎంఆర్ పద్ధతిలో రాతపరీక్ష నిర్వహించేందుకు ప్రశ్నాపత్రం సిద్ధంచేసి ఉంచింది టీఎస్పీఎస్సీ. అయితే ఆఖరి నిమిషంలో కంప్యూటర్ నుంచి సమాచారం బయటకెళ్లినట్టు గుర్తించారు. దీంతో వెంటనే టౌన్ ప్లానింగ్ తో పాటు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు చెందిన రాతపరీక్షల్ని వాయిదా వేశారు, అంతకంటే ముందు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ వద్ద పీఏగా చేస్తున్న ప్రవీణ్ ఈ పని చేసినట్టు గుర్తించారు. కొన్ని రోజులుగా ఓ యువతి, అతడితో చనువుగా ఉంటోంది. ప్రవీణ్ ను కలిసేందుకు పలుమార్లు కార్యాలయానికి కూడా వచ్చింది.

ఆమె కోరిక మేరకు, ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసుకొచ్చాడు ప్రవీణ్. అలా హనీ ట్రాప్ మూలంగా ఈ పరీక్ష పత్రం లీక్ అయింది. వేలాది మంది మంది అభ్యర్థుల జీవితాల్ని ప్రశ్నార్థకం చేసింది.

అయితే అత్యంత కట్టుదిట్టమైన పాస్ వర్డ్స్ తో ఉండే ఆ కంప్యూటర్ ను ప్రవీణ్ ఎలా తెరిచాడనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఆ పాస్ వర్డ్స్ అతడికి ఎలా తెలిశాయి, కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రశ్నాపత్రాన్ని అతడు ఎలా ప్రింట్ చేశాడు (ప్రింట్ ఆప్షన్ లేదు) అనేది పోలీసులు కనిబెట్టాల్సి ఉంది. దీంతో పాటు, లీక్ చేసిన క్వశ్చన్ పేపర్ ను అతడు ఎంతమందికి అందించాడనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ప్రస్తుతానికి ఈ కేసులో ప్రవీణ్ తో పాటు మరో ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హ్యాకింగ్ అనుకుంటే, హనీ ట్రాప్ గా మారిన ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ఇది ఎలా ఉంటె తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వందల సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే , ఇప్పుడే ఈ హాని ట్రాప్ జరిగిందా లేదంటే ఇప్పటివరకు జరిగిన గ్రూప్స్ , డి. ఓ.ఏ .ఓ ఇంకా జరిగిన పరీక్షలలో కూడా ఇదేవిధంగా జరగలేదని ఏంటి నమ్మకం, ఒక విదంగా చూస్తే ఆదివారం జరిగే పరిక్షల కన్నా ముందు జరిగిన పరీక్షలు చాల పెద్దవి కావటం విద్యారులలో ఆందోళన కలిగిస్తుంది, ఒక PA కు అక్కడ ఆన్న సమాచారం అంత ఈజీగా దొరికింది అంటేనే ఎదో మతలబు లాగా ఉంది దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించకపోతే విద్యారులు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది, ఏది ఏమయినా విచారణ జరుగుతుంది కాబట్టి చూద్దాం ఎం చెపుతారో అధికారులు 

Monday, 6 February 2023

 

 2022లో దుబాయిలో ఇళ్ల కొనుగోళ్ల మీద భారతీయులు పెట్టిన ఖర్చుఅక్షరాలా  రూ 35,500 కోట్లు

  

హైదరాబాదులో కంటే దుబాయిలో ఇల్లు కొనడం చవక. అవును ఒకరకంగా ఇది నిజమే. హైదరాబాదులో రూ 3 కోట్లు పెట్టి గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఫ్లాట్ కొనుక్కోవచ్చు. కానీ అదే పెట్టుబడి దుబాయిలో పెడితే అంతే అద్భుతమైన, ఒక్కోసారి అంతకంటే అద్భుతమైన నివాసాలు దొరికేస్తున్నాయి. పైగా అది టూరిష్ట్ డెస్టినేషన్ కావడంతో సగటున రోజుకి రూ 20,000 సంపాదించుకునే అవకాశం లభిస్తోంది. అదే హైదరాబాదులో కొన్న ఆ స్థాయి ఫ్లాట్ అద్దెకిస్తే నెల మొత్తానికి లక్షన్నరో-రెండు లక్షలో రావచ్చు. అంతకు మించి కష్టం. 

దీనికి తోడు దుబాయిలో కోటిన్నర పైన పెట్టుబడి పెట్టి ఫ్లాట్ కొంటే పదేళ్ళ పాటు గోల్డెన్ వీసా కూడా ఇస్తున్నారు..అది కూడా కుటుంబం మొత్తానికి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దుబాయిలో పీక్ సీజన్ నడుస్తుంది. అందులో మరీ ముఖ్యంగా డిసెంబర్-జనవరి సీజన్.  ఆ సమయంలో ఈ ఫ్లాట్స్ ని రోజుకి రూ 30000 చొప్పున అద్దెకి ఇస్తున్నవారు కూడా ఉన్నారు. ఎలా చూసుకున్నా ఇండియాతో పోలిస్తే దుబాయ్ టాక్స్ హెవెన్. కనుక పన్నుపోటుండదు. 

ఉండడానికైతే ఓకే కాని పెట్టుబడి కోసం ఆస్తి కొనాలంటే ఇండియాకంటే దుబాయే ఎన్నో రెట్లు లాభసాటి అని ప్రూవ్ అయిపోయింది. పైగా దుబాయిలో ఆస్తి విలువ పెరుగుదల కూడా ఎక్కువ. 

2022లో దుబాయిలో ఇళ్ల కొనుగోళ్ల మీద భారతీయులు రూ 35,500 కోట్లు ఖర్చుపెట్టారంటే ఆలోచించండి. ఇది 2021 తో పోలిస్తే రెట్టింపు. వీళ్లంతా అపరకుబేరులు, టాటాబిర్లాలు, అంబాని-అదానిలు కారు. వీరిలో అధికశాతం మంది రూ 2 కోట్ల పైచిలుకులో పెట్టుబడి పెట్టగలిగేవాళ్లే ఎగువ మధ్యతరగతి భారతీయులే ఎక్కువ ఉన్నారు. 

దుబాయిలో ప్రపంచస్థాయి సదుపాయాలు ఉండడం, ప్రపంచంలోని ధనిక పర్యాటకులకి ఇష్టమైన నగరం కావడంతో ఇక్కడ పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా ఎందరో పెడుతున్నారు. వారిలో భారతీయులు ముందంజలో ఉన్నారన్నది వాస్తవం. 

2019లో ఏడాది మొత్తం కష్టపడితే అమ్మగలిగే ఇళ్లను ఇప్పుడు కేవలం ఒక నెలలో అమ్మేస్తున్నమని, డిమాండ్ ఆ రేంజులో ఉందని దమాక్ ప్రొపెర్టీస్ డైరెక్టర్ అష్రత్ అన్నారు. భారతీయుల తర్వాత రష్యావాళ్లు ఇక్కడ ఇళ్లు కొంటున్నారట. ఆ తర్వాత లిస్టులో బ్రిటన్, చైనా, పాకిస్తానీయులు ఉన్నారట దుబాయిలోని 15%-20% రియలెస్టేట్ భారతీయుల పెట్టుబడుల్లోనే ఉందట. 

ఇంతకీ పైన చెప్పుకున్న గోల్డెన్ వీసాలో చాలా వెసులుబాట్లున్నాయి. అది కేవలం టూరిస్ట్ విసా కాదు. దుబాయిలో పదేళ్ల పాటు నివశించవచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు, ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా చేయవచ్చు. 

ఇక్కడ ప్రపంచంలోనే ఉన్నతశ్రేణి ప్రమాణాలున్న స్కూల్స్ ఉన్నాయి. సిటీ కూడా చాలా సేఫ్. క్యాబులో క్యాష్ మరిచిపోయినా డ్రైవర్లే తీసుకొచ్చి ఇస్తారు", ఎగువ మధ్యతరగతి, ఆ పై తరగతుల వారికి దుబాయిలో ఇళ్ల పెట్టుబడులు లాభసాటిబేరమే అనిపిస్తోంది. అందుకే ఈ మధ్యా కాలంలో చాలామంది మన తెలుగు రాష్టాలవారు కూడా ఎక్కువ దుబాయ్ రియలెస్టేట్ పై కన్నువేసారు. దాదాపుగా ఒక తెలుగు రాష్టాల నుండి 4000 నుండి 5000 వరకు దుబాయ్ వెళుతుంటారు ఆ మర్మం ఇదేనేమో

 

Wednesday, 25 January 2023

 

యువత నిర్మించాల్సింది అవినీతి రహిత నవ్య భారతదేశాన్ని!---కామధేనువు సేవాసమితి   

 





 

భారత్‌లో జనవరి 25వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (National Voters’ Day) నిర్వహిస్తారు.

భారత్‌లో జనవరి 25వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశంలో ఎన్నికల కమిషన్ ను ఏర్పాటు చేసిన సందర్భంగా నేషనల్ ఓటర్స్ డేను నిర్వహిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం 1950లోనే ఏర్పడింది. కానీ 2011 నుంచే ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉండాలి. ఎన్నికల సంఘంలోని సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఈ సంవత్సరం 11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అధికారులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యువత రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యేలా చూడాలనేది నేషనల్ ఓటర్స్ డే లక్ష్యం. ఇందుకు ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, వారిపేరుతో ఓటు నమోదు చేయాలి. జనవరి 25న కొత్త ఓటర్లకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డును అందజేస్తారు. ఏ ఒక్క ఓటరునూ విడిచిపెట్టకూడదనే నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. యువత, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది. దీనిపై అవగాహన పెంచేందుకు  యూత్ ఫర్ అంటి కరప్షన్ సభ్యులు నగరంలోని వివిధ స్కూల్స్, కళాశాలకు తిరిగి ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటం జరిగింది ఈ కార్యక్రమంలో దేవేందర్ కొన్నే, బత్తిని రాజేష్, సత్తార్ మరియు ఇతర సభ్యలు పాలుగోన్నారు

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...