Tuesday 21 June 2022

 

యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామధేనువు సేవాసమితి సభ్యుల యోగ కార్యక్రమం




2015 జూన్ 21 , మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే.. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి భారత ప్రధాని మోదీ సూచించారు.

యుజ్అనగా కలయికఅనే సంస్కృత ధాతువు నుండి యోగలేదా యోగముఅనే పదం ఉత్పన్నమైంది. యుజ్యతేఏతదితి యోగః’, ‘యుజ్యతే అనేన ఇతి యోగఃవంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము. యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు వెళ్లడమే యోగ. యోగముఅంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. యోగా అనేది ఒత్తిడిని తగ్గించడంలో, శారీరక బలాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

యోగతో ఎముకలు దృఢంగా..

వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో ఉండే క్యాల్షియం కూడా తరుగుతూ ఉంటుంది. దీని ఫలితంగా ఎముకలు బలహీనం అయిపోతాయి. ఈ పరిస్థితుల్లో బోలు ఎముకల వ్యాధి సోకె అవకాశం ఉంది. యోగాలో కొన్ని ఆసనాలు చేయడం ద్వారా ఎముకలు శక్తివంతమై వాటి యొక్క బరువు కూడా పెరుగుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా ధృఢంగా మారతారు. యోగా అనేది ఓ దివ్యౌషధం అని గుర్తుంచుకోవాలి. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

శ్వాసక్రియలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే శరీరంలో వీటితో పాటు కొన్ని రకాల హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ కారణంగా శరీరం రిలాక్స్ అవుతుంది. చక్కని విశ్రాంతి పొందుతారు. వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. యోగా వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. కంటి సమస్యలు, మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కొవ్వు నిల్వలు సమతుల్యంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్నవారికి యోగా అధ్భుత ఔషధమని చెప్పొచ్చు. యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామధేనువు సేవాసమితి సభ్యులు స్థానిక సనత్ నగర్ హనుమాన్ గోశాల నందు యోగ చేయటం జరిగింది

 

2 comments:

  1. శ్వాసక్రియలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే శరీరంలో వీటితో పాటు కొన్ని రకాల హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ కారణంగా శరీరం రిలాక్స్ అవుతుంది. చక్కని విశ్రాంతి పొందుతారు. వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. యోగా వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. కంటి సమస్యలు, మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కొవ్వు నిల్వలు సమతుల్యంగా ఉంటాయి,మీరు ఇంకా గోశాలలో చేశారు అక్కడ చాల మంచిది సార్

    ReplyDelete
  2. అద్భుతం సార్

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...