Monday 11 July 2022

  

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం --ఫొటో పోటీలు

వంద మాటలను ఒక్క ఫోటో లో చూడగలం. జీవిత సత్యాలను, మానవ జీవన విధానాన్ని ఒక్క ఛాయా చిత్రం సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. చూడగలిగితే ప్రకృతి లో ఉండెంత అందం మరెక్కడా ఉండదు... అలాంటి అందాలను బంధించేదే ఫోటోగ్రఫీ. ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 19న " ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం "ను  పురస్కరించుకుని   తెలంగాణ రాష్ట్ర సమాచార & ప్రజాసంబంధాల శాఖ ఫొటో పోటీలను నిర్వహిస్తుంది. స్థానిక ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించేందుకు 1992లో సమాచార శాఖ ఈ పోటీలను ప్రారంభించింది.  ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లో పాల్గొనే వారి సంఖ్య ప్రతీ సంవత్సరం గణనీయంగా పెరుగుతోంది. ఇందులో పాల్గొనడమే కాకుండా వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, పోటీల స్థాయి గురించి మరింత తెలుసుకోవడానికి అనేక మంది ఉత్సాహాన్ని చూపుతున్నారు.

సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించే ఈ ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేయడానికి ఫోటోగ్రఫీ, జర్నలిజం రంగంలో పేరుగాంచిన ప్రముఖ వ్యక్తులను జ్యూరీ సభ్యులుగా నియమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విభాగాలను కవర్ చేయడానికి ప్రతి సంవత్సరం సరి కొత్త థీమ్లు ప్రకటిచడం జరుగుతోంది. ఈ పోటీలకు అందిన ఫొటోలను అవసరమైన చోట శాఖాపరమైన అవసరాలకు వినియోగిస్తారు. ఈ ఫొటో పోటీలకు వచ్చిన ప్రతి కాటగిరీకి 12, 3వ బహుమతులతోపాటు 5 కన్సోలేషన్ బహుమతులు అందచేస్తారు. విజేతలను నగదు పురస్కారం, జ్ఞాపికలతో ఘనంగా సత్కరిస్తారు. గత సంవత్సరం 2021 లో 104 మంది పాల్గొన్న వారి నుంచి దాదాపు 1,500 ఫోటోలు అందాయి. అందులో 32 మంది ఫోటోగ్రాఫర్లకు ప్రతీ అంశం నుంచి 5 కన్సోలేషన్ బహుమతులతో పాటు 12వ మరియు 3వ స్థానం బహుమతులను ఎంపిక చేశారు. బంగారు తెలంగాణ, తెలంగాణ పండుగలు, ఉత్తమ వార్తా చిత్రం, నగర అభివృద్ధి గత సంవత్సరం పోటీకి సంబంధించిన అంశాలు. అదేవిధంగా, ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం (I&PR శాఖ) ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2022 వేడుకల సందర్భంగా ఫోటో పోటీని నిర్వహిస్తోంది.

ఈ ఏడాది ఐదు కేటగిరీలు ఉన్నాయి

మొదటి అంశం -I: బంగారు తెలంగాణ

(మహిళా & శిశు సంక్షేమ IT పరిశ్రమ, ఆరోగ్యం, విద్యుత్, నీటిపారుదల, లా & ఆర్డర్)

రెండవ అంశం -II: పల్లె, పట్టణ ప్రగతి

(పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్లు, ట్యాంకర్లు, వైకుంట ధామములు, గ్రామ పంచాయతీలలో డంపింగ్ యార్డులు మొదలైనవి,)

మూడవ అంశం-III: ఉత్తమ వార్తా చిత్రం

(వార్తా పేపర్ / మ్యాగజైన్లో ప్రచురించబడిన చిత్రం, ఆగస్టు 2019 తర్వాత మాత్రమే)

నాలుగవ అంశం -IV: అర్బన్ & రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్

(సరస్సులు, ఉద్యానవనాలు, రోడ్లు, మన ఊరు మన బడి, గ్రంథాలయాలు మొదలైన వాటి అభివృద్ధి,)

ఐదవ అంశం - V: స్కైలైన్ ఆఫ్ హైదరాబాద్

ఈ ఫోటో కాంపిటీషన్ పాల్గొనేవారు (3) థీమ్ / కాన్సెప్ట్ కోసం ఒక్కొక్కరు మూడు ఫోటోలను పంపవచ్చు. దీని ప్రకారం ఉత్తమ 1, 2, 3వ ఎంట్రీలకు వరుసగా రూ.20,000/-, రూ.15,000/- మరియు రూ.10,000/- నగదు పురస్కారాలతో పాటు సర్టిఫికెట్లు, మెమెంటో లతో పాటు (5) కన్సోలేషన్ బహుమతులతో సత్కరించాలని నిర్ణయించడం జరిగింది.. ఐదు కేటగిరీలలో ఒక్కొక్కరికి రూ.5,000/- మొత్తం 40 బహుమతులుంటాయి

ఈ ఫోటో పోటీలలో పాల్గొనేవారు తమ ఎంట్రీలను 11-7-22 (సోమవారం) నుంచి 12-8-22 వరకు (అన్ని పని దినాలలో) సమర్పించవచ్చు. ఎంట్రీలను స్వీకరించడానికి చివరి తేదీ ఆగస్టు 12. ఆ రోజు సాయంత్రం 5.00 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఎంట్రీలను అసిస్టెంట్ డైరెక్టర్ (ఫోటో ), సమాచార భవన్, సమాచార పౌర సంబంధాల శాఖ, మాసాబ్ ట్యాంక్ , హైదరాబాద్, 500028 అనే చిరునామా కు పంపించాల్సి ఉంటుంది. పోటీలకు పంపే ఫోటోలను adphoto.ts @gmail.com అనే మెయిల్ కు కూడా పంపాలి. అన్ని వర్గాల ఫోటోగ్రాఫర్లు మరియు ఫోటోగ్రఫీ ఔత్సాహికులందరూ పోటీలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ సమాచార, ప్రసార శాఖ కోరింది.

1 comment:

  1. వంద మాటలను ఒక్క ఫోటో లో చూడగలం. జీవిత సత్యాలను, మానవ జీవన విధానాన్ని ఒక్క ఛాయా చిత్రం సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. చూడగలిగితే ప్రకృతి లో ఉండెంత అందం మరెక్కడా ఉండదు..

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...