Monday, 11 July 2022

  

కేసీఆర్ పాలన అంతమొందించే బాధ్యత నాదే ఈటెల.


కేసీఆర్ దుర్మార్గమైన పాలనను అంతమొందించే బాధ్యత తనపై ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వాఖ్యలు చేశారు. కేసీఆర్  ను ఓడగొడితేనే  తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవుతుందన్నారు. ఉద్యమకారుడిగా తాను ప్రశ్నిస్తే.. పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు. కేసీఆర్ కు కావాల్సింది కేవలం బానిసలేనన్నారు. కేసీఆర్ బలం, బలహీనతలు అన్ని తనకు తెలుసన్నారు. సీఎం కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనంటూ మరోసారి సంచలన వాఖ్యలు చేశారు. డబ్బుతో తనను ఓడించాలని కేసీఆర్ కలలు కన్నారని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్. తనలాంటి వారు కేసీఆర్ నచ్చలేదన్నారు. ఆయనకు కావాల్సింది కేవలం బానిసలు మాత్రమేనన్నారు. అసెంబ్లీలో తన ముఖం కన్పించకుండా ఉంాలని కేసీఆర్ తనను ఓడించడానికి రూ.600 కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు ఈటల.

పోలీసులు లేకుండా రావాలన్న నా భార్య సవాల్‌కు..  కేసీఆర్ సచ్చిపోవాలన్నారు. 50 శాతమున్న బీసీలకు 3 మంత్రి పదవులా అని ప్రశ్నించారు ఈటల. గిరిజనులకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం గుప్పించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. సీఎం కేసీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు ఈటల రాజేందర్. కేసీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని ధ్వజమెత్తారు.

హుజురాబాద్‌లో ఓటుకు నోటు ఇచ్చింది కేసీఆరే అని ఆరోపించారు ఈటల. కేసీఆర్ వ్యుహాలు ఎంటో తనకు తెలుసన్నారు. దుర్మార్గమైన పాలన అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు. చరిత్ర నిర్మాతలు ఎప్పుడూ నాయకులు కాదని.. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమేనని మరో సారి తనదైన శైలిలో వాఖ్యానించారు ఈటల రాజేందర్.

1 comment:

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...