Monday 11 July 2022

 

తిరిగి ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.

ఆకస్మిక వరదల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ (Amarnath)యాత్ర మళ్లీ ప్రారంభమైంది. దీంతో జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి పహల్గామ్‌లోని నున్వాన్ బేస్ క్యాంప్‌నకు యాత్రికులు బయల్దేరారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రస్తుతం పహల్గామ్ మార్గంలో మాత్రమే యాత్రికులను అనుమతిస్తున్నారు. బల్తాల్ మార్గం నుంచి యాత్ర ఇంకా పునఃప్రారంభం కాలేదు. కానీ బల్తాల్, పహల్గాం రెండు మార్గాల నుంచి హెలికాప్టర్ సేవలను అందుబాటులో ఉంచారు. ఈ మేరకు 4,020 మంది భక్తులతో కూడిన 12వ బ్యాచ్‌ దర్శనానికి బయల్దేరించింది. జమ్మూలోని భగవతినగర్‌ యాత్రి నివాస్ నుంచి 110 వాహనాల్లో గట్టి బందోబస్తు మధ్య బేస్‌ క్యాంపులకు బయలుదేరినట్టు సైనిక వర్గాలు కూడా తెలిపాయి. అందులో 1016 మంది భక్తులు తెల్లవారుజామున 3:30 సమయంలో 35 వాహనాల్లో బల్తాల్ బేస్‌ క్యాంపునకు బయలుదేరాయి. ఇలా వెళ్లిన యాత్రికులంతా మంగళవారం అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకోనున్నారు.


కాగా అమర్‌నాథ్ గుహ సమీపంలో ఈ నెల 8న ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కనీసం 16 మంది మరణించారు. 40 మందికిపైగా తప్పిపోయారు. దీంతో ఆదివారం లోయలోని బేస్ క్యాంపులకు వెళ్లడానికి ఏ బ్యాచ్‌ను అనుమితంచ లేదు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. శిథిలాలను కొనసాగిస్తున్నారు. అయితే శుక్రవారం కొండచరియలు విరిగిపడటంతో గుహ మందిరానికి వెళ్లే మార్గం దెబ్బతింది. దాంతో పవిత్ర గుహ వెలుపల సైన్యం తాత్కాలిక మెట్లను నిర్మించింది. వరదల వల్ల అమర్ నాథ్ యాత్రికులు చాలామంది చనిపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి వెళ్లిన 84 మంది క్షేమంగా బయటపడ్డారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. అయితే వారిద్దరూ చనిపోయినట్టు తెలిసింది. రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారిని వారితో పాటు వెళ్లినవారు గుర్తించారు. దాంతో ఈ విషయాన్ని పోలీసులు ఖరారు చేశారు. చనిపోయిన వారు రాధ, పార్వతీలు గుర్తించగా.. వారిని ఆస్పత్రులకు తరలించినట్టు వెల్లడించారు.

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...