Monday 11 July 2022

 

లోన్‌ యాప్‌ వేధింపులు ….వివాహిత ఆత్మహత్య

లోన్‌ యాప్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్‌ బుల్స్‌, రూపెక్స్‌ యాప్స్‌ నుంచి రూ.20,000 లోన్‌ తీసుకుంది. రూ.20 వేల రుణానికి లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. అయినా ఇంకా డబ్బులు కట్టాలని, లేకుంటే ప్రైవేటు ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడతామని కేటుగాళ్లు బెదిరించారు. రుణం తీర్చకపోతే బంధువులకు ఫోన్‌ చేసి చెప్తానని సైబర్‌ నేరగాళ్లు భయపెట్టారు. వాట్సాప్‌లో అసభ్యకర మెసెజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రత్యూష ఇంటిపైన ఉన్న ఫ్లెక్సీ హోర్డింగ్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు తల్లిదండ్రులకు, భర్తకు సెల్ఫీ వీడియో పంపింది. ఈ మేరకు ప్రత్యూష భర్త మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

2 comments:

  1. Eppatike chala mandi mosapoyru, papm inka marpu ravatam ledu

    ReplyDelete
  2. amyakulu chalamandi bali avuthunanru

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...