Monday 15 August 2022

అవినీతి రహిత సమాజం రావాల్సిన అవసరం ఉంది

 యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ కేంద్ర కార్యాల‌యంలో స్వతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర జెండా ఆవిష్క‌ర‌ణ చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ ఎంతోమంది వీరులు, మ‌హానీయుల త్యాగ‌ఫ‌లిత‌మే 75 సంవ‌త్స‌రాల స్వ‌తంత్య్ర భార‌తావ‌నికి ప్ర‌ధాన కార‌ణ‌మన్నారు. నేటి త‌రం యువ‌త వారి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు. అవినీతి ర‌హిత స‌మాజం కోసం యూత్ ప‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ వినూత్న కార్య‌క్ర‌మాలు చేస్తుంద‌ని, అందులో భాగంగానే నిజాయితీప‌రుల‌కు అండ‌గా ఉండేందుకు ముంద‌డుగు ప్రారంభించింద‌న్నారు. మంచి స‌మాజం కోసం వినూత్న కార్య‌క్ర‌మాల‌తో యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ ముందడుగు వేస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సీనియ‌ర్ నాయ‌కులు కొన్నె దేవేంద‌ర్‌, కానుగంటి రాజు, కొమ‌టి ర‌మేష్‌బాబు, మూడావ‌త్ ర‌మేష్‌నాయ‌క్‌, జి. హ‌రిప్ర‌కాశ్‌, అంజుక‌ర్‌, సాయి, నాగేంద్ర‌, న‌రేష్‌, స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.



4 comments:

  1. యెస్, అవినీతి రహిత సమాజం రావాల్సిన అవసరం చాలా ఉంది, ప్రస్తుతం దేశంలో 75 కోట్ల మంది ఇంకా కనీస సౌకర్యాలు లేకకుండా ఉన్నారు, అది కేవలం అవినీతి వల్లనే

    ReplyDelete
  2. తెలుగు యోగి గారి స్వోత్కర్ష, పాఠకులపై చులకన ధోరణి పెరుగుతోంది. నిజమైన ఆధ్యాత్మిక వేత్త నా మార్గమే సరైనది అనుకోడు. తనకు దూరం జరిగి ఇతర మార్గాలలో వెళ్లిన వారిని దూషించడం సరికాదు.

    ReplyDelete
  3. జన్మాంతర సాధన వల్ల ఉత్తమ జ్ఞానం పాండిత్యం కొంతమందిలో కలిగి గురు స్థానం లోకి వస్తారు. వారి వల్ల కొంతమేరకు లోకోపకారం జరుగుతుంది. అయితే కొంతమంది ఆధ్యాత్మిక అహంకారం వల్ల ఆత్మస్తుతి పరనింద చేయడం జరుగుతోంది. తనతో విభేదించిన వారిని తూలనాడటం, తన ధోరణి నచ్చక దూరం జరిగిన వారిని హేళన గా దూషించడం మంచిది కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం అహంకారానికి దారి తీయకూడదు.

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...