Thursday, 18 August 2022

 

 కేజ్రీవాల్ లేటెస్ట్ ఫోకస్ యావత్ దేశం మీద పడింది



ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు తనను జాతీయ నేతగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఢిల్లీ సీఎంగా ప్రజలనుంచి మంచి మార్కులు కొట్టేసిన తర్వాత, ఇటీవలే పంజాబ్ ప్రజల నమ్మకాన్ని కూడా చూరగొని పార్టీని అధికారంలోకి తెచ్చిన తర్వాత.. కేజ్రీవాల్ లేటెస్ట్ ఫోకస్ యావత్ దేశం మీద పడింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడానికి తాజాగా కేజ్రీవాల్ భారత యాత్ర చేపట్టడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 

కేజ్రీవాల్ తన భారతయాత్రకు ఒక మంచి నినాదం కూడా తయారు చేసుకున్నారు. ‘‘మేక్ ఇండియా నెంబర్ 1’’ అనేదే ఆ నినాదం. దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలని కేజ్రీవాల్ స్వప్నం నిజమే కావొచ్చు. కానీ ఆ ప్రయత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్త పార్టీగా తీర్చిదిద్దడం, యావత్ దేశంలో అస్తిత్వాన్ని చాటుకునేలా సీట్లు గెలవడం కేజ్రీవాల్ లక్ష్యం. వీటన్నింటి పర్యవసానం.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి.. నరేంద్రమోడీని రీప్లేస్ చేయడానికి విపక్షాలు అన్నీ జట్టు కడితే.. ప్రధాన పదవికి ప్రధాన పోటీదారుగా తనను తాను ఆవిష్కరించుకోవడం అనే లక్ష్యం బై డిఫాల్ట్ గా ఉంటుంది. 

ఆ ప్రయత్నంలో భాగంగానేనా అన్నట్లు కేజ్రీవాల్.. మోడీ స్వరాష్ట్రం గుజరాత్ మీద నెక్ట్స్ ఫోకస్ పెట్టారు.. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఎన్నికల్లో ఆప్ పోటీచేస్తుందని, 2023 తెలంగాణ ఎన్నికల్లో కొంత సీరియస్ గానే బరిలో ఉండవచ్చునని కూడా పుకార్లు ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే.. ఆప్ సారథి స్వయంగా గుజరాత్ ఎన్నికల బరిలోకి దిగేశారు. అక్కడ తన ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. 

దేశవ్యాప్తంగా ప్రజలను ఆప్ వైపు ఆకట్టుకోవడానికి అయిదు హామీలతో ప్రణాళికను రూపొందించారు కేజ్రీవాల్. ఆ అయిదు అంశాలే.. దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ కూడా చేస్తాయని అంటున్నారు.

 1) నాణ్యమైన ఉచిత విద్య,

2) ఉచిత వైద్యం- మందులు,

3) యువత అందరికీ ఉద్యోగాలు,

4)మహిళలకు సమానహక్కులతో కూడిన జీవితం,

5) రైతులకు గిట్టుబాటు ధరల హామీ

అనేవే ఈ పంచసూత్రాలు. ఒక రకంగా చెప్పాలంటే.. అద్భుతమైన హామీలు. యావత్తు దేశ మనుగడ మొత్తం ఈ పంచసూత్రాల్లోనే ఇమిడిపోయి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ అంశాల విషయంలో తాను సమర్థుడైన నాయకుడినే అని కేజ్రీవాల్ ఢిల్లీ పరిపాలనతోనే నిరూపిపించుకున్నారు కూడా.

కానీ.. ఫ్రీబీస్ కు అలవాటు పడిన, పార్టీలు విసిరే బిస్కట్లకు ఆశపడే ప్రజలు వీటిని నమ్మి ఆప్ కు కిరీటం పెడతారా అనేది సందేహం. వారిలో చైతన్యం తీసుకురావడానికి అనేకంటే.. వారిలో నమ్మకం కలిగించడానికి కేజ్రీవాల్ 2024 ఎన్నికల్లోగా ఎంత కృషి చేస్తారనేది గమనించాలి.

 

Tuesday, 16 August 2022

  

ఉప ఎన్నిక పుణ్యమా అని మునుగోడు ప్రజల చిరకాల డిమాండ్లు నెరవేరేనా !!

 


భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను జారీ చేయకముందే ముఖ్యమంత్రి ఉపఎన్నికలో పార్టీ తరపున ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. మునుగోడు ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే మునుగోడు పై ఫోకస్ చేశారు. ఇది మునుగోడు ఉప ఎన్నికకు అధికార పార్టీ ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగస్టు 20న రానున్న ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి రానున్న సందర్భంగా మునుగోడు ప్రజల చిరకాల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. మునుగోడు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించనున్నారని పార్టీ శ్రేణులలో ఆసక్తికర చర్చ జరుగుతోంది

2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న తర్వాత, రాష్ట్రంలో హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ మరియు హుజూరాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌లలో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించారు. కానీ దుబ్బాక, హుజూరాబాద్‌లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేయలేదు. హుజూర్నగర్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా, నాగార్జున సాగర్ ను సైతం టిఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుంది. ఇక దుబ్బాక, హుజురాబాద్ లను బిజెపి కైవసం చేసుకుంది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ మరియు శాసనసభకు రాజీనామా చేయగా తాజాగా సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడానికి ప్రత్యేక దృష్టి పెట్టారు. మునుగోడు ప్రజల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లను యుద్దప్రాతిపదికన ఉపఎన్నికకు ముందు నెరవేర్చేందుకు నివేదికలు ఇవ్వాలని నల్గొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జి. జగదీష్‌రెడ్డిని, జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడంతో మునుగోడు ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారని నల్గొండ జిల్లా నాయకులు సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, దశాబ్దాలుగా అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్నప్పటికీ 100 పడకల ప్రభుత్వాసుపత్రి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా పేదవర్గాలు ప్రభుత్వ కళాశాలలు లేక ప్రైవేటు కళాశాలలో డబ్బులు ఖర్చు పెట్టి ఉన్నత విద్యను పొందలేకపోతున్నారు అని, ఇక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోలేక పోతున్నారని ప్రజల ప్రధాన సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు నేతలు
దీంతో సీఎం కేసీఆర్ ఆగస్టు 20న బహిరంగ సభలో ఈ రెండు డిమాండ్లను నెరవేరుస్తామని, అదే రోజు కళాశాలలు, ఆసుపత్రి మంజూరుకు సంబంధించిన జిఓ (ప్రభుత్వ ఉత్తర్వులు) విడుదల చేస్తామని నల్గొండ పార్టీ నేతలకు హామీ ఇచ్చారని సమాచారం. అంతేకాదు మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్లు తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి మరిన్ని వరాల జల్లు కురిపించాలని భావిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తే వారు టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని భావిస్తున్నారు.


Monday, 15 August 2022

 ఒక్క పొలిసు కేసు కూడా లేని గ్రామం

                                    ఆ కేసును కూడా కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. 


ఈరోజుల్లో పోలీసు కేసు అనేది చాలా సర్వసాధారణమైంది. చీటికిమాటికి కూడా కేసులు పెట్టుకుండే కాలంలో ఆ ఊర్లో ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదంట. నమ్మరా..? ఒక కేసు అయిందిలే అది కూడా రాజీ అయిపోంది అనుకోండి. ఇప్పుడయితే ఒక్క కేసు కూడా లేని గ్రామంగా ఆ ఊరు రికార్డులోకి ఎక్కింది. ఆ ఊరి చరిత్ర తెలుసుకున్న జడ్జి నేరుగా ఆ ఊరికే వెళ్లి అక్కడి గ్రామ పెద్దతో పాటు.. గ్రామస్తులు అందర్నీ అభినందించారు.

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఒక్క కేసు

 కూడా లేని గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ మాటలను నేరుగా కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు.

 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆ గ్రామానికి వచ్చిన ఆమె జాతీయ జెండా ఆవిష్కరించారు. కేసులు లేని

 గ్రామంగా ర్యాగట్లపల్లి నిలిచిందని అభినందించారు.


గ్రామానికి చెందిన ఏకైన కేసుకు సంబంధించి ఇరువర్గాల వారు రాజీపడటంతో.. ఆ కేసును కూడా

 కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. రోడ్డు ప్రమాదం కేసులో ఇరువర్గాలు రాజీపడి తమకు తామే తీర్పు

 ఇచ్చుకోవడం సంతోషకరమన్నారు. దీన్ని రికార్డులో నమోదు చేసి భద్రపరుస్తామన్నారు. 40 ఏళ్లుగా గ్రామంలో

 ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తున్న గ్రామ పెద్ద నాగన్నగారి సిద్ధరాంరెడ్డిని జడ్జి ఈ సందర్భంగా

 సన్మానించారు.

 

 

      యువ కళాకారుడి  ప్రతిభ.

 

ప్రతి ఒక్కరిలో దేశభక్తి పొంగిపొర్లింది.  స్వాతంత్ర్య సమర యోధుల జీవితాలను గుర్తుకు చేసుకుంటూ.. సలామ్ చేశాం.  భారత దేశ గొప్పతనం ప్రపంచ నలుమూలలా తెలిసేలా సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకుంటున్నాం. పూర్ణ స్వరాజ్యం కల నెరవేరి 75 ఏళ్లు కావొస్తుంది. దీనికి గుర్తింపుగా `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` జరుపుకున్నాం. హర్ ఘర్ మే తిరంగా వెలిగిపోయింది. ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు.

భారతదేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని  ఎర్రకోటపై ప్రధాన మంత్రి  జాతీయ జండాను ఆవిష్కరించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మువ్వన్నెలు రెప రెపలు మిరమిట్లు గొలుపుతున్నాయి. కళాకారులు అయితే ఎవరికి తోచిన రీతిలో వారు తమ ప్రతిభను చూపెడుతూ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువ కళాకారుడు చేసిన ప్రయత్నం అందరి మన్ననలు అందుకునే లా చేస్తోంది. కేవలం ఉప్పుతో గ్లోబ్ పై భారత మాత బొమ్మ గీసి.. రంగులద్దాడు.. ఈ చిత్ర చూసినవారంతా ఆ కళాకారుడి ప్రతిభకు సలామ్ అంటున్నారు.

ఇలాంటి బొమ్మలు గీయడం అతడికి ఇదే తొలిసారి కాదు.. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు. చిత్తూరు జిల్లాలోని కుప్పానిక ిచెందిన ఈ కళాకారుడు.. పూరి  ఆర్ట్స్ పేరుతో.. సమాజాన్ని చైతన్య పరిచేలా ఆయన పెయింట్స్ ఉంటున్నాయి. ఇటీవల ఉప్పుతోనే తిరుమల వెంకటేశ్వరుడి బొమ్మ గీసి.. దానికి రంగులు అద్ది.. గోవిందుడి రూపాన్ని ఆవిష్కరించారు.. అతడు గీసిని శ్రీనివాసుడి

 ముఖ చిత్రం అద్భుతంగా ఉంది. పూరి ఆర్ట్స్ పేరుతో యువకుడు పలు చిత్రాలు రూపొందిస్తూ..

 పలువురి మన్ననలు పొందుతున్నాడు. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ తో సత్తా చాటిన పీవీ సింధు బొమ్మను సైతం అట్టముక్కలతో అద్భుతంగా రూపొందించాడు. భారత దేశానికి సంబంధించి ఏ ఘనత వెలుగులోకి వచ్చినా... వెంటనే తన మైండ్ కు పదును పెట్టి.. అద్భుతాలు చేస్తున్నాడు మన పెయింటర్.. గతంలోనూ పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

అవినీతి రహిత సమాజం రావాల్సిన అవసరం ఉంది

 యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ కేంద్ర కార్యాల‌యంలో స్వతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర జెండా ఆవిష్క‌ర‌ణ చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ ఎంతోమంది వీరులు, మ‌హానీయుల త్యాగ‌ఫ‌లిత‌మే 75 సంవ‌త్స‌రాల స్వ‌తంత్య్ర భార‌తావ‌నికి ప్ర‌ధాన కార‌ణ‌మన్నారు. నేటి త‌రం యువ‌త వారి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు. అవినీతి ర‌హిత స‌మాజం కోసం యూత్ ప‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ వినూత్న కార్య‌క్ర‌మాలు చేస్తుంద‌ని, అందులో భాగంగానే నిజాయితీప‌రుల‌కు అండ‌గా ఉండేందుకు ముంద‌డుగు ప్రారంభించింద‌న్నారు. మంచి స‌మాజం కోసం వినూత్న కార్య‌క్ర‌మాల‌తో యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ ముందడుగు వేస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సీనియ‌ర్ నాయ‌కులు కొన్నె దేవేంద‌ర్‌, కానుగంటి రాజు, కొమ‌టి ర‌మేష్‌బాబు, మూడావ‌త్ ర‌మేష్‌నాయ‌క్‌, జి. హ‌రిప్ర‌కాశ్‌, అంజుక‌ర్‌, సాయి, నాగేంద్ర‌, న‌రేష్‌, స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.



Sunday, 14 August 2022

హనుమాన్ దేవాలయంలో తీరంగా ర్యాలీ

 బ్రిటీష్ తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ వేడుకల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘ఆజాది కి అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, సనత్ నగర్ లోని స్థానిక హనుమాన్ దేవాలయంలో, అర్చకలు మరియు దేవాలయ సిబ్బంది తీరంగా ర్యాలీ ఏర్పాటు చేయటం జరిగింది.



Tuesday, 9 August 2022

 

                 పూర్వ విద్యార్థుల    ఆత్మీయ కలయిక

 


స్నేహమంటే విలువైనది,  అపురూపమైనది,  అమర మైనది. కానీ  ప్రతీ అంచుకు రెండు కోణాలు ఉన్నట్లే , మంచి,  చెడు అనే  గుణాలకి  స్నేహం కూడా ఏమీ అతీతం కాదు.  మంచి స్నేహం ఎప్పుడూ నీడలా వెన్నంటి ఉంటుంది..... ఆపదలో ఆసరా అవుతుంది...... సంతోషానికి సంబరం అవుతుంది.....బాధకు  భరోసా ఇస్తుంది..... ప్రతిభకు గుర్తింపు ఇస్తుంది...... పిలవకపోయినా నేనున్నా అంటుంది.  మంచి స్నేహానికి ఒక బలమైన,  విచిత్రమైన,  విపరీతమైన స్వార్థం ఉంటుంది.  ఆ స్వార్థం పేరు ఏంటంటే " సంతోషం " . సంతోషాన్ని స్నేహితులతో  పంచుకోవాలనే ఒక ఆరాటం.... అంతకుమించి స్వచ్ఛమైన మంచి  స్నేహం లో ఏ రకమైన స్వార్థం ఉండదు.మంచి స్నేహం... ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా, సాటి స్నేహితుడి యొక్క ఉన్నత తత్వాన్ని, అభ్యున్నతిని  మాత్రమే కోరుకుంటుంది.  అదేవిధంగా స్నేహితుడి యొక్క నిమ్నతత్వాన్ని  సరి చేయడానికి ప్రయత్నిస్తుంది  స్నేహానికి   అర్థం చేసుకునే గుణం ,  సహాయపడే తత్వం భగవంతుడు సహజంగానే ప్రసాదిస్తాడు . మంచి..... వేగంగా నడవలేదు,  త్వరగా ఆకట్టుకోలేదు కానీ ఎప్పటికీ స్థిరత్వమే దాని గమ్యం.

 స్నేహితులారా……మంచిని ప్రోత్సహిద్దాం....... మంచి స్నేహితులుగా ఉందాం.......... నిజం లో బ్రతుకుతూ ఆనందంగా ఉందాం. ఎందుకంటే మిగిలిన జీవితానికి కావలసింది ఆనందం. ఆనందంగా ఉంటేనే మనం బాగుంటాం......మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది...... మన కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది..... సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది.

 స్నేహితుల దినోత్సవ సందర్భంగా . 1996-97 పదవతరగతిలో గీతా విజ్ఞాన మందిర్ లో చదివిన మిత్రులు హైదరాబాద్ కొత్త పేట లో కలిసి వారి వారి అనుభూతులను, వారి జీవితాల్లో జరిగిన అపూర్వ సంఘటనలను పంచుకున్నారు , ఇందులో మురళి, నాగరాజ్ , వినీత్, రాజేష్, నరేష్ , ప్రదీప్శంకర్, పురేందర్, ఆజాద్ , నరేందర్(ఎస్ ఐ) రమేష్, శ్రీకాంత్, రంజిత్ పాల్గొన్నారు   

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...