Monday, 5 September 2022

 

జనాలు రేషన్ కొన్నట్లే బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు!



జార్ఖండ్‌ అసెంబ్లీలో ఇవాళ అధికార యూపీఏ కూటమి ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్‌ సోరెన్‌ నెగ్గారు. గనుల లీజును తనకు తానే కేటాయించుకుని సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. దీంతో సోరెన్పై ఎమ్మేల్యేగా అనర్హత వేటువేయడంపై గవర్నర్ అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికార యూపీఏ కూటమి విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. అసెంబ్లీలో సీఎం హేమంత్ సోరెన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వాస పరీక్షలో 81 మంది ఎమ్మెల్యేలు పాల్గొనగా సోరెన్‌ కు అనుకూలంగా 48 మంది ఓటేశారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. మెజారిటీ కావాలంటే 42 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. విశ్వాసపరీక్షలో హేమంత్‌ సోరెన్‌ కు మద్దతుగా 48 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. యూపీఏ కూటమికి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బ‌ల‌ప‌రీక్ష స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష బీజేపీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. జార్ఖండ్ అధికార కూటమి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ నుండి ప్రత్యేక విమానంలో ఆదివారం రాష్ట్ర రాజధాని రాంచీకి చేరుకున్నారు. అక్కడ వారిని విలాసవంతమైన రిసార్ట్‌లో ఉంచారు. రాష్ట్ర అతిథి గృహంలో ఎమ్మెల్యేలు కలిసి రాత్రి బస చేసి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్లారు.

ఓటింగ్‌ కు ముందు హేమంత్ సోరెన్ మాట్లాడుతూ... కమలం పార్టీ చేసిన చర్యల కారణంగానే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని దుయ్యబట్టారు. అధికార కూటమి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి  బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందన్నారు. ఎన్నికల్లో గెలవడానికి అల్లర్లకు ఆజ్యం పోసి దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జార్ఖండ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా జార్ఖండ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో పాలుపంచుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బెంగాల్‌లో ఉన్నారని.. బెంగాల్‌కు వారు వెళ్లడం వెనుక అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై విచారణకు వెళ్తున్న పోలీసులకు ఆయా రాష్ట్రాలు సహకరించడం లేదనిహేమంత్ సోరెన్ మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు తలపడే వాతావరణం సృష్టించాలనుకున్నారని,హింసాత్మక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రోత్సహించాలని చూశారంటూ విమర్శించారు.

 

Sunday, 28 August 2022

 

బల నిరూపణ ప్రదర్శించుకునేందుకు సిద్ధమవుతున్న ఆప్

 


తమ ప్రభుత్వ బలాన్ని నిరూపించుకునేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అవుతోంది.

దిల్లీలో బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ లోటస్ విఫలమయిందని ప్రజలకు తెలియచెప్పేందుకు సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను పక్కన పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ 40 మంది శాసన సభ్యులను తమ పార్టీ నుంచి తప్పించాలని చూసిందని, అందుకోసం ఒక్కొక్కరికీ రూ. 20 కోట్ల రూపాయిలను లంచంగా ఇవ్వాలని చూసిందని ఆరోపించారు.

గత వారం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో శాసన సభ్యులతో సమావేశమయ్యారు. మొత్తం 62 మంది ఆప్ శాసన సభ్యులకు గాను 53 మంది మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కూడా బీజేపీలో చేరితే ఆయన పై పెట్టిన కేసులను ఉపసంహరిస్తామని చెప్పారని ఆరోపించారు.

దిల్లీలో మద్యం కుంభకోణానికి సంబంధించి మనీష్ సిసోడియా ఇంట్లో ఇటీవల సోదాలు నిర్వహించింది. ఈ కేసులో మరొక 14 మందితో పాటు సిసోడియా పై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఆయన పై ఈడీ మనీ లాండరింగ్ కేసును కూడా నమోదు చేసింది.

దిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు గాను, 62 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉండగా, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి.

 

Friday, 26 August 2022

 <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

 

   నాడు నేడు!

 

గద్దర్ పేరు వినిపించగానే.. మెడలో ఎర్ర కండువా, చేతిలో కర్ర, తెల్ల పంచా, నెరిసిన జుట్టుతో నరాలు

 ఉప్పొంగే, రక్తం మరిగే పాటలతో ఓ రూపం మన కళ్ల ముందు అలా కదిలాడుతుంది. కానీ, అదంతా

 అప్పుడు.. ఇప్పుడు గద్దర్ మోడ్రన్‌గా మారిపోయారు. ఎలా అంటే ఠక్కున చూస్తే అసలు ఈయన గద్దరేనా

 అనిపించేలా.. ఆయన మాట్లాడితే తప్ప ఆయన్ని చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. సూటూ..

 బూటూ.. మెడలో టై ఫుల్ బ్లాక్ హెయిర్‌తో గద్దర్ న్యూ లుక్‌‌‌ అందర్నీ విస్మయానికి గురి చేసింది యాదాద్రి

 లక్ష్మీనరసింహ స్వామిని ఇవాళ కుటుంబ సమేతంగా గద్దర్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజా

 కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని.. కానీ, ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం పూర్తిగా ప్రజలదేనన్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులను చూస్తే ఆ దేవదేవుడే నడిచొచ్చి భక్తులను ఆహ్వానిస్తున్నాడా అనిపించిందన్నారు. తాను పాటలు రాసేటప్పుడు ప్రకృతితో పరవశించి పోయేవాడినని.. భగవంతుని సన్నిధిలో కూడా అంతే అనిపించింది అని గద్దర్ అన్నారు. "తెలంగాణ రాష్ట్రం వస్తే నీకు బ్రహ్మాండమైన పూజలు చేస్తామని నరసన్నను వేడుకున్నారు. ఆ మాట ప్రకారమే ప్రజలు పూజలు చేస్తున్నారు. ఇక్కడ శిల్ప కళను చూస్తున్నప్పుడు మరో ప్రపంచంలోకి పోతున్నట్లు అనిపిస్తుంది. అర్చకులు, సిబ్బంది ఆప్యాయంగా భక్తులను ఆహ్వానించి దర్శనం చేయించడం ఎంతో ఆదర్శంగా అనిపిచ్చింది. ఈ పవిత్రమైన దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఆలయాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు ధన్యవాదాలు. భగవంతుని సన్నిధిలో నాకెంతో ప్రశాంతత కలిగింది" అని గద్దర్ అన్నారు.

Thursday, 25 August 2022

 

బిసిల మీద ప్రేమ ఉందని చూపటానికి 

ఈటెలను  ఫ్లోర్ లీడర్ని చేయటానికే రాజాసింగ్ ను పక్కన పెడుతున్నారా!!?



రాజాసింగ్ కొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ  ఎమ్మెల్యే పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈయన గురించే చర్చ జరుగుతోంది. ఇక హైదరాబాద్‌లోఅయితే రచ్చ రచ్చ జరుగుతోంది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షో హైదరాబాద్‌లో ఖరారైనప్పటి నుంచి రాజాసింగ్ వార్తల్లో ఉంటున్నారు. హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మునావర్‌ను.. హైదరాబాద్‌ లో షో చేయనిచ్చే ప్రసక్తే లేదని రాజాసింగ్ హెచ్చరిస్తూ వచ్చారు. ఆ తర్వాత పోలీసు బందోబస్తు మధ్య మునావర్ ఫరూఖీ షో ముగించుకొని వెళ్లిపోయారు. ఐతే మునావర్‌ను తిట్టే క్రమంలో.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. అప్పటి నుంచి రచ్చ మరింత ముదిరింది. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం, ముస్లిం సంఘాలు ఆందోళనలు చేశాయి. ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే ఇటీవల రాజాసింగ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరపరిచారు. ఐతే ఆయనకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ.. రిమాండ్‌ను తిరస్కరించింది కోర్టు. రాజాసింగ్‌కు బెయిల్ మంజూరుచేసింది. ఆ తర్వాతి రెండో రోజే పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. గోషామహల్‌లోని తన నివాసంలో రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి.. నేరుగా చర్లపల్లి జైలుకు తరలించారు. ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారని చెబుతున్నారు. పీడీ యాక్ట్ పెట్టడమంటే మామూలు విషయం కాదు. పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు పీడీ యాక్ట్ పెట్టి.. కోర్టులు, తీర్పులతో సంబంధం లేకుండా నేరుగా జైల్లో వేస్తారు. కనీసం ఏడాది పాటు జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజాసింగ్‌ పరిస్థితి కూడా అదే..! ఐతే పీడీ యాక్ట్‌ను పోలీసులు నిబంధనల ప్రకారమే నమోదు చేశారా? అనేది తేలాలి. అంతా ఓకే అయితే.. ఆయన జైల్లోనే ఉంటారు. పోలీసులు ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే.. కోర్టు ఆదేశాల మేరకు బయటకు వస్తారు. ఐతే ఇంత జరుగుతున్నా బీజేపీ నేతలెవరూ రాజాసింగ్‌పై మాట్లాడకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. తమ పార్టీ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ పెట్టినా.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గానీ.. ఇతర నేతలు కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తీరుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్‌ను వారు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదా? అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. రాజాసింగ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. కేసులు నమోదుకావడంతో.. పార్టీకి నష్టం కలుగుతోందని కమలం పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీకి రాజాసింగ్ తీరు అడ్డంకులు కలిగిస్తోందని అనుకుంటున్నారట. ఆయన్ను పార్టీకి దూరంగా ఉంచితేనే బాగుంటుందని.. లేదంటే నష్టం కలుగుతుందన్న అభిప్రాయానికి వచ్చారట. అందువల్లే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కమలం పెద్దలు స్పందించడం లేదని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో రాజాసింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం గానీ.. లేదంటే పార్టీ పెద్దల పట్ల అసంతృప్తితో రాజాసింగే బయటకు వచ్చేయడం గానీ.. జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలంతా బండి సంజయ్ పాదయాత్రపైనే దృష్టిసారించారని.. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ పెట్టి, జైల్లో వేసినా పట్టించుకోవడం లేదని.. ఈ పరిణామాలు చూస్తుంటే.. బీజేపీలో రాజాసింగ్ చాప్టర్ ముగిసినట్లేనని ప్రచారం జరుగుతోంది. మరి బీజేపీ నిజంగానే రాజాసింగ్‌ను పక్కనబెట్టిందా? లేదంటే దీని వెనక ఇంకేదైనా వ్యూహం ఉందా? అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది.

అయితే మెజార్టీ వాళ్ళ అభిప్రాయం ప్రకారం రానున్న మునుగోడు మరో ఏడాదిలో వచ్చే సాధరణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈటెలకు అసంబ్లీ ఫ్లోర్ లీడర్ గ ఎన్నుకొని బిసిల ఓట్లకు గాలం వేసే ప్రక్రియ అని ఊహాగానాలు, అది నిజం కూడా కావొచ్చు ఎందుకంటే రాజాసింగ్ ని పక్కన పెట్టటం వలన ఒక పక్క ముస్లిం ఓట్లు మరోపక్క బిసిల ఓట్లు పడే అవకాశం ఉంది అనేది బిజెపి పెద్దల ఆలోచనగా ఉంది, ఏ రకంగా చుసిన బిజెపి సాధారణ ఎన్నికలను చాల పకడ్బందీగా తీసుకుంటుదనేది జగమెరిగిన సత్యం  

 

 

ఢిల్లీలో బేరాలు!!??

 

తమ ఎమ్మెల్యేల‌ను కొనడానికి ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తోందని పార్టీ సీనియర్ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం ఉదయం ఢిల్లీలో తమ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనుంది.

ఇవాళ ఉదయం 11 గంటలకు అత్య‌వ‌స‌ర‌ స‌మావేశం కానుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఆప్ తన కొంతమంది ఎమ్మెల్యేలను సంప్ర‌దించినా అందుబాటులోకి రావ‌డం లేద‌ని తెలుస్తోంది. వారు మీటింగుల‌కు వ‌స్తారా రారా లేకపోతే బీజేపీకి అందుబాటులోకి వెళ్లారా అనేది అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

కాషాయ పార్టీలో చేరేందుకు బీజేపీ తమకు రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని గతంలో నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.

బుధవారం ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. త‌మ‌ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల నగదుతో కొనడానికి ఆప్ త‌ప్పుబ‌డుతోంది

 

Wednesday, 24 August 2022

అరవింద్ కేజ్రీవాల్ భావి ప్రధాని అవ్వగలరా!!?

 




2014లో ప్రధాన మంత్రి పదవికి పోటీ చేసేనప్పుడు, ‘‘హిందూ హృదయ సామ్రాట్’’గా, గుజరాత్‌లో మూడుసార్లు వరుసగా ఎన్నికల్లో విజయం సాధించిన నాయకుడిగా మోదీని ముందుకు తీసుకొచ్చారు.

అయితే, ఇప్పుడు ఆప్ నాయకుడు కేజ్రీవాల్ కూడా మూడుసార్లు దిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా పంజాబ్‌ ఎన్నికల్లోనూ ఆయన పార్టీ విజయం సాధించింది.

దిల్లీలోని స్కూళ్లు, హాస్పిటళ్ల పరిస్థితులను మెరుగుపరిచినట్లు కేజ్రీవాల్‌కు పేరుంది.

అయితే, ఈ అనుభవంతోపాటు దిల్లీ మోడల్‌ను ఆధారంగా తీసుకొని 2021 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యామ్నాయంగా మారుతారని చెప్పొచ్చా?

 వరుసగా మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ప్రధాన మంత్రి పదవికి 2014లో నరేంద్ర మోదీ పోటీచేశారు. మరోవైపు మూడుసార్లు దిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఓడించి అప్పటికే ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చరిత్ర సృష్టించారు.

ఇద్దరు నాయకులూ వారణాసి వేదికగా నేరుగా కూడా లోక్‌సభ ఎన్నికల్లో తలపడ్డారు. అయితే, ఇక్కడ మోదీ పైచేయి సాధించారు.

సరిగ్గా పదేళ్ల తర్వాత, అంటే 2024లో మరోసారి నరేంద్ర మోదీకి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసురుతున్నారు. 2014లో మోదీ మిషన్ తరహాలోనే భారత్‌ను మరోసారి గొప్ప దేశంగా మారుస్తానని కేజ్రీవాల్ అంటున్నారు.

‘‘ప్రపంచంలో భారత్‌ను అగ్రదేశంగా మార్చేవరకూ మేం ప్రశాంతంగా కూర్చోలేం. దీని కోసం దేశంలోని మూలమూలకు వెళ్లి 130 కోట్ల మందినీ మాతో కలుపుకుంటాం’’అని కేజ్రీవాల్ అన్నారు.

ఇదివరకటి ప్రభుత్వాలను విమర్శిస్తూ.. ‘‘ఈ నాయకులు, పార్టీలకు అధికారాన్ని అప్పగిస్తే, దేశం ముందుకు వెళ్లడం కష్టం అవుతుంది. అందుకే అందరమూ కలిసి పనిచేయాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆప్ నాయకులు మనీష్ సిసోదియా నుంచి రాఘవ్ చడ్ఢా, సంజయ్ సింగ్‌ల వరకు.. ‘‘ఇదివరకు మోదీ వర్సెస్ ఎవరు? అనే చర్చ జరిగేది.. కానీ నేడు ఈ చర్చ మోదీ వర్సెస్ కేజ్రీవాల్‌కు మారింది’’అని చాలాసార్లు చెబుతున్నారు.

2014లో నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆయనకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవముంది.

తన దగ్గర గుజరాత్ మోడల్ ఉందని, అక్కడ అమలుచేసిన కార్యక్రమాలు, వాణిజ్య విధానాలు, వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ లాంటి సదస్సులను జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు.

ఈ రాజకీయేతర కార్యక్రమాల్లో పారిశ్రామిక దిగ్గజాలు ముఖేశ్ అంబానీ నుంచి గౌతమ్ అదానీల వరకు పాల్గొనేవారు. దీనిపై దేశ వ్యాప్తంగా మీడియాలో వార్తలు వచ్చేవి.

 ‘‘నేడు ఎవరైనా బీజేపీకి సవాల్ విసురుతున్నారంటే.. అది కచ్చితంగా కేజ్రీవాలే. ప్రస్తుతం మమతా బెనర్జీకి అంత ఉత్సాహం ఉన్నట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్‌ను బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. మరోవైపు ప్రాంతీయ పార్టీలకు కూడా బీజేపీ అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇప్పుడు మోదీకి పోటీ ఇచ్చే వారి రేసులో అరవింద్ కేజ్రీవాల్ ముందు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ

‘‘ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలను అలానే కొనసాగిస్తే, ప్రధాన మంత్రి పదవిని చేరుకునేందుకు ఆయనకు 15ఏళ్లు పడుతుంది. ఎందుకంటే ఆయన కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటుచేసుకుంటూ వస్తున్నారు. దీనికి కాస్త సమయం పడుతుంది’’

‘‘అయితే, ఆయనకు రాజకీయంగా మంచి అనుభవముంది. దేశ ప్రజల నాడి ఎలా పట్టుకోవాలో ఆయనకు తెలుసు. ఇదివరకటి సెక్యులర్ నిర్వచనాలకు కట్టుబడి ఉంటే పని జరగదని ఆయనకు అవగాహన ఉంది. ఇప్పుడు ఆయన హిందూ అనుకూల ఇమేజ్ (ప్రో-హిందూ ఇమేజ్) కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ముస్లిం వ్యతిరేకి అనే ముద్ర కూడా పడకుండా చూసుకుంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి వారు అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్లి హిందువుల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రజలను ఎలా తనవైపు తిప్పుకోవాలో కేజ్రీవాల్‌కు తెలుసు. బీజేపీకి కూడా భవిష్యత్‌లో తమను ఢీకొట్టబోయేది కేజ్రీవాలేనని అవగాహన ఉంది

అయితే, కొన్నిసార్లు తన వైఖరి వల్ల అరవింద్ కేజ్రీవాల్ కూడా విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా దిల్లీ ఘర్షణలు, ఎన్‌ఆర్‌సీ-సీఏఏ లాంటి అంశాలపై కేజ్రీవాల్ మౌనాన్ని విపక్షాలు తప్పుపట్టాయి.

 ‘‘తాజాగా ఆగస్టులో రెండు సర్వేల ఫలితాలు బయటకు వచ్చాయి. ఇదివరకు జాతీయ స్థాయిలో ఆప్ సభ్యత్వం ఒకటి నుంచి 1.5 శాతం చొప్పున పెరిగేదని.. కానీ, ఇప్పుడు అది 6.5 నుంచి 8 శాతానికి వెళ్లిందని వీటిలో పేర్కొన్నారు’’

‘‘దీని ప్రకారం, వచ్చే రెండేళ్లలో ఆప్ ప్రజాదారణ మరింత పెరగొచ్చు. అదే సమయంలో మోదీ ప్రజాదారణ కాస్త తగ్గొచ్చు. కానీ, ప్రస్తుతానికి అయితే, ఇద్దరు నాయకుల మధ్య అంతరం చాలా ఎక్కువే ఉంది. మరోవైపు ఈ రెండు పార్టీలను ఒకరికి మరొకరు పోటీ అని కూడా చెప్పలేం’’

అటల్ బిహారీ వాజ్‌పేయీ, నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్ లాంటి వారు దశాబ్దాల రాజకీయ అనుభంతో ప్రజలపై తమదైన ముద్ర వేశారు.

అయితే, అరవింద్ కేజ్రీవాల్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి కేవలం పదేళ్లు మాత్రమే గడిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో మోదీకి పోటీగా ఇమేజ్‌ను సృష్టించుకోవడం ఆయనకు ఎంత కష్టం? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

 ‘‘రెండు రాష్ట్రాల్లో అనుభవం ఆధారంగా జాతీయ స్థాయిలో ఇమేజ్ సృష్టించుకోవడం కాస్త పెద్ద లక్ష్యమే. ఇప్పుడు కేజ్రీవాల్‌ను పక్కన పెడితే, గతంలో పెద్దపెద్ద రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన సందర్భాలు చాలానే ప్రజలపై చెరగని ముద్ర వేయాలంటే తప్పకుండా కొత్త విధానాలతో ముందుకు రావాలలి

‘‘ఇప్పుడు కేజ్రీవాల్ నడిపిస్తున్న కార్యక్రమాల్లో చాలావరకు ఆయన సొంతంగా సృష్టించినవి లేవు. కాబట్టి ఆయన కొత్తగా ఏదైనా చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో భారత్‌ను మోదీ మెరుగ్గా నడిపిస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’

‘‘ఉదాహరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇది ఒక రాజకీయేతర కార్యక్రమం. ఇలాంటి ఆలోచన ఇదివరకు ఏ పార్టీకి రాలేదు. కేజ్రీవాల్ కూడా ఇలాంటి కొత్త కార్యక్రమాలతో ముందుకు రావాలి. ముఖ్యంగా దిల్లీ లేదా పంజాబ్ ప్రజలను ఆయన పూర్తిగా ఆకట్టుకోవాలి’’

బీజేపీ తరహాలో వనరులు లేదా వ్యవస్థ ఆప్‌కు లేవని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి కేజ్రీవాల్‌ను తమ అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

అయితే,‘‘విపక్షాలు దానికి సిద్ధంగా లేవు. మరోవైపు తాను ఒంటరిగానే బరిలోకి దిగుతానని కేజ్రీవాల్ కూడా స్పష్టం చేశారు. కొన్ని విపక్షాలు కూడా ఆయన్ను ముప్పుగానే పరిగణిస్తున్నాయి’’

ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్షాల అభ్యర్థి కాకపోతే.. మరి ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.

బహుశా నితీశ్ కుమార్ అవుతారేమో.. ఆయన వైపే విపక్షాలు మొగ్గుచూపొచ్చు. మోదీ ఎదగడంలో ఆరెస్సెస్ క్రియాశీల పాత్ర పోషించినట్లే.. ప్రతిపక్షాలన్నీ కలిసి ఆయన్ను ముందుకు తీసుకురావొచ్చు. ఇక మమతా బెనర్జీ విషయానికి వస్తే, ఆమె సొంత పార్టీలో చాలా తలనొప్పులు ఉన్నాయి’’.

‘‘నితీశ్‌కు కొన్ని అంశాలు కలిసి రావొచ్చు. ముఖ్యంగా ఆయన అనుభవం, హిందీ మాట్లాడే రాష్ట్రం నుంచి రావడం, మంచి పాలకుడిగా గుర్తింపు.. ఇవన్నీ కలిసొచ్చే అంశాలు. ఎందుకంటే ముందుగా హిందీ రాష్ట్రాల నుంచి బీజేపీని కూకటివేళ్లతో పెకలించాలి. మరోవైపు నితీశ్ వయసు కూడా 70ఏళ్లు దాటింది. దీంతో విపక్షాల్లోని యువ నేతలు ఆయనకు ఎంత మద్దతు ప్రకటిస్తారో చూడాలి’’

‘‘నితీశ్‌కు కాంగ్రెస్ మద్దతు పలకొచ్చు. ఎందుకంటే రాహుల్‌కు విపక్షాలు సిద్ధంగా లేవని కాంగ్రెస్‌కు కూడా తెలుసు. మరోవైపు రాహుల్ గాంధీకి పోటీగా తమ పార్టీలోని మరొకరిని ముందుకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. దీంతో కచ్చితంగా కాంగ్రెస్ బయటి వ్యక్తులనే ముందుకు తేవాలి. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి బయటకువెళ్లి పార్టీలు పెట్టిన శరద్ పవార్, జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ లాంటి వారికి కూడా పార్టీ మద్దతు ఇవ్వకపోవచ్చు.


  

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...