Friday, 20 January 2023

కామధేనువు సేవాసమితి అద్వర్యం లో అన్నదాత కార్యక్రమం

 మనం ఎన్నో దానాల గురించి వింటుంటాం. అందులో అన్నదానం ఎంతో విశిష్టిత కలిగింది. వాటిలో ముఖ్యంగా రక్తదానం, అవయవదానం, అన్నదానం గురించి ఎక్కువగా వింటుంటాం. అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని చెబుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం భోజనం పెట్టి ఒకరి కడుపు నింపవచ్చు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అన్నదానం అన్ని దానాల కంటే ప్రధానమైందని పండితులు చెబుతారు.

ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తెలుగు రాష్ట్రాల నుండే  కాడకుండా దేశ నలుముల నుండి ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు.. అక్కడికి వచ్చి చికిత్స పొందుతూ, ఉండే వారికి మరియు వారి వద్ద ఉండే సహాయకులు అక్కడ భోజన వసతి లేదు అలా అని కామధేనువు సేవాసమితి వారు దీనిపై చర్చించి నెలలో రెండు సార్లు ఇక్కడ వచ్చే వారికి ఉచిత భోజనం ఏర్పాటు చేయటం జరుగుతుంది.. ఈ కార్యక్రమంలో దేవేందసర్ కొన్నే, కరుణాకర్, పూజ,వెంకటేష్, వేణు,తులసి కుమార్, విగ్నేష్, కేశవ్, హనుమాన్,సూర్యప్రకాష్ పాల్గొన్నారు

Tuesday, 17 January 2023

 

అడ్డంగా దొరికిన (అ)ధర్మ నాయక్

 

మెదక్‌ జిల్లా టేక్మల్ వద్ద జరిగిన కారు సజీవదహనం కేసులో బిగ్ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. చనిపోయాడనుకున్న సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్న‌ ధర్మానాయక్ సేఫ్ ‌గా ఉన్నారు. అదే కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవదహనం అయ్యాడు. కారులో ఒక‌ వ్యక్తిని ఉంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తానే చనిపోయినట్లుగా పెద్ద స్టోరీ క్రియేట్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. 

అసలు ఏం జరిగిందంటే.. సెక్రటేరియట్‌లో పని చేస్తున్న ధర్మానాయ‌క్.. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లు అడుతూ భారీగా నష్టపోయాడు. ఈ నష్టాన్ని కవర్ చేసేందుకు  సినిమా రేంజ్‌లో స్కెచ్ వేశాడు. కారులో త‌న‌కు బదులుగా మరొకరిని పెట్టి.. తానే సజీవదహనం అయినట్లు సీన్ క్రియేట్ చేశాడు. తాను చ‌నిపోతే త‌న పేరు మీద ఉన్న రూ. 7 కోట్ల‌ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుందని ధర్మా ఈ డ్రామా ప్లే చేసినట్లు తేల్చారు పోలీసులు.

మొద‌ట పోలీసులు ప్ర‌మాదం అనుకున్న‌.. ఘటనా స్థలంలో దొరికిన పెట్రోల్ బాటిల్ ఆధారంగా పోలీసులు ఇంట్రాగేష‌న్ చేసి ధర్మానాయ‌క్ డ్రామా బ‌య‌ట‌పెట్టారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన కేసులో ప్రధాన నిందితుడు ధర్మానే అని తేల్చిన పోలీసులు.. పూణెకి పారిపోయిన నిందితుడిని పట్టుకున్నారు.

Monday, 9 January 2023

 

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

 తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు  కీలక తీర్పు.కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు.రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించిన కేంద్రంకేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు.

క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో  తెలంగాణలో కొనసాగుతున్న సోమేష్ కుమార్.క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో  హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం.క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు.

సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేత.

Wednesday, 28 December 2022

   

మొదటి వితంతు వివాహం  జరిగింది ఎక్కడో కాదు కందుకూరి వీరేశలింగం గారి ఇల్లే!



ప్రస్తుత రోజుల్లో వితంతు వివాహాలు అంటే సర్వసాధనంగా మారిపోవడం జరిగింది.కానీ ఒకప్పటి రోజుల్లో వితంతువు అంటే ఏదో దరిద్రాన్ని చూసినట్లు చూసేవారు

డిసెంబర్ 11. 1881 లో సుప్రసిద్ధ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు మొదటిసారిగా వితంతు వివాహం జరిపారు.అయితే దాన్ని జరిపించడం కోసం ఆయన పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు చాలానే ఉన్నాయి.

అయినప్పటికీ వంటి చేత్తో ఆ పెళ్లి జరిపించి మూఢాచారాలను తెలుగు వారిలో దూరం చేయడానికి మొదటి అడుగున వేశారు.బెంగాల్లో వితంతు వివాహం జరిగిన దక్షిణాదిలో మాత్రం చందాసం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఆ రోజులలో చిన్న వయసులోనే ముసలి వాళ్లకి భార్యలుగా వెళ్లిన వాళ్లు చనిపోయాక వితంతులుగా ఆడపిల్లలు నరకం చూస్తున్నారు.అప్పుడు ఈ సాంఘిక దురాచారానికి అడ్డుకట్ట వేయాలని కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలోని తన స్వగృహంలో 1881 డిసెంబర్ 11వ తేదీన బాల వితంతువు గౌరమ్మ, గూగులమూడి శ్రీరాములు అనే వ్యక్తికి పెళ్లి జరిపించారు.

ఈ వివాహం గురించి విని వారిపై ఎక్కడ దాడి చేస్తారో అని మండపానికి పెళ్లికూతురుని, పెళ్లి కొడుకుని రహస్యంగా తీసుకొచ్చారని కందుకూరి వీరేశలింగం గారు రచనలలో పేర్కొన్నారు.

అంతే కాకుండా ఆ వివాహానికి ఎవరూ వెళ్ళరాదని వెళితే వారిని ఊరి నుంచి వెలివెస్తమని చెందాసులు పిలుపు ఇవ్వడంతో వీరేశలింగం దంపతులే గోదావరి నుండి నీటిని మోసారు.వంట కూడా ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చేయగా కందుకూరి వీరేశలింగం శిష్యులు, విద్యార్థుల్లో కొంతమంది వారికి అండగా నిలిచారు.ఈ చరిత్రత్మక ఘటన జరిగిన కందుకూరి ఇల్లు ఈ రోజు రాజమండ్రిలో ఒక సందర్శన స్థలంగా మారిపోయి ఉంది.

అక్కడికి సందర్శకులు వచ్చి మొదటి వితంతు వివాహం జరిగిన ప్రదేశాన్ని చూసి వెళుతుంటారు.తన జీవితకాలంలో దాదాపు 40 వితంతు వివాహాలు జరిపించారు మన కందుకూరి వీరేశలింగం గారు.

 

Monday, 26 December 2022

 

 

సుశాంత్ సింగ్ అతడి బాడీపై ఉన్నాయి. మెడపై కూడా చాలా గాయాలు ఉన్నాయి.డెడ్ బాడీని చూస్తే ఈజీగా చెప్పొచ్చు. ఆత్మహత్య కాదు హత్య!!  పోస్టుమార్టం సిబ్బంది సంచలన కామెంట్స్ !!

 

2020లో సరిగ్గా లాక్ డౌన్ సమయంలో 14 జూన్ హీరో సుశాంత్ సింగ్ మరణించడం అందరికీ షాక్ ఇచ్చినట్లయింది.సుశాంత్ సూసైడ్ చేసుకోవటం దేశవ్యాప్తంగా అందరూ షాక్ కి గురయ్యారు.

దేశ ప్రధాని మోడీ.సుశాంత్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉన్న సమయంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవటం ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది.అయితే ఈ సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి నమోదైన కేసులో డ్రగ్స్ కోణం బయటపడటం తెలిసిందే

ఇదిలా ఉంటే ఇప్పుడు సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు హత్యా అని.పోస్టుమార్టం సిబ్బంది ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళ్తే హీరో సుశాంత్ సింగ్ డెడ్ బాడీకి కూపర్ హాస్పిటల్ లో పోస్టుమార్టం జరిగింది.అయితే ఈ హాస్పిటల్ లో పోస్టుమార్టం సిబ్బందిలో ఒకరు రూప కుమార్ సుశాంత్ బాడీకి పోస్టుమార్టం చేయడం జరిగింది.అయితే రూప కుమార్ సుశాంత్ ది.ఆత్మహత్య కాదు.హత్య అని సంచలన వ్యాఖ్యలు చేశారు.అతని డెడ్ బాడీ చూసినప్పుడు ఒంటిపై ఇంకా మెడ పైన గాయాలు ఉన్నాయి.ఇదే విషయాన్ని పై అధికారులకు తెలియజేయడం జరిగింది.అయితే మా పై అధికారులు డెడ్ బాడీకి పోస్టుమార్టం నిర్వహించే సమయంలో వీడియోలు వద్దు.

ఫోటోలు తీస్తే సరిపోతుంది.ఉదయం కల్లా పోస్టుమార్టం పూర్తి కావాలి.

పోలీసులకి డెడ్ బాడీ అప్పగించాలి.అని ఒత్తిడి తేవడం జరిగింది

ఆ రకంగానే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించడం జరిగింది.కచ్చితంగా సుశాంత్ మరణం.

హత్య అని రూప కుమార్ స్పష్టం చేశారు.అతడి బాడీపై చాలా గాయాలు ఉన్నాయి.

మెడ మీద కూడా ఉన్నాయి.డెడ్ బాడీని చూస్తే ఈజీగా చెప్పొచ్చు.

ఇది దాడి వలన జరిగిందని.అని రూప కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

 

Thursday, 22 December 2022

 

పెళ్లి చేసుకుందామంటే మాకు పిల్ల దొరకడం లేదు మహారాష్ట్రలో వినూత్న నిరసన.

 



వాళ్లందరూ బాగా చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. అంతో ఇంతో కూడా ఆస్తులు ఉన్నాయి. కానీ పెళ్లి చేసుకోవాడానికి పిల్ల దొరక్కపోవడంతో తెగ ఇబ్బంది పడిపోతున్నారు. పెళ్లి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి, వధువుల కోసం వెతికి వెతికి విసిగిపోయారు. ఒక పక్క వయుస్సు అయిపోతున్నా..వివాహం కాకపోవడంతో మానక్షిక క్షోభకు గురవుతున్నారు. పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి దొరకడం లేదేంటి అని బాధపడే అబ్బాయిల సంఖ్య రోజురోజుకి ఎక్కవయిపోయింది. దీంతో తమకు పెళ్లి కావడం లేదని యువకులందరూ రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

 గుర్రాలపై వచ్చి నిరసన

తమకు పెళ్ళీడు వచ్చినా.. పెళ్లికావడం లేదంటూ చాలామంది యువకులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమకు పెళ్లికాకపోవడాన్ని ప్రభుత్వానిదే తప్పు అని ఎత్తి చూపుతూ గుర్రాలపై కలెక్టరేట్ కార్యాలయంకు ఊరేగింపుగా వచ్చి నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో పెళ్లికొడుకు వేషాధారణలో గుర్రాలపై వచ్చి కలెక్టరేట్ కార్యాలయం వద్ద బైఠాయించారు. రాష్ట్రంలో లింగనిర్ధారణ చట్టం కట్టుదిట్టంగా అమలు కాకపోవడంతో లింగనిష్పత్తి దారుణంగా పడిపోతోందని ఆరోపించారు. ఈ కారణంతోనే తమకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదని విమర్శించారు. ఆడపిల్లల నిష్పత్తి పెరుగుదలకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి చేద్దామంటే అబ్బాయిలు దొరికేవారు కాదు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది


 ఘనంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు 

న్యూ మిలీనియం హైస్కూల్, జమ్మికుంట 







భారతదేశం గర్వించే దగ్గ శాస్త్రవేత్త గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ అని న్యూ మిలీనియం స్కూల్స్ చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని న్యూ మిలీనియం హైస్కూల్లో గణిత దినోత్సవ వేడుకలను పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి ప్రారంభించారు, అనంతరం విద్యార్థులు తయారు చేసిన గణిత నమూనాలు పజిల్స్ ప్రముఖ శాస్త్రవేత్తలు సాధించిన విషయాలను చార్టుల ద్వారా ఉపాధ్యాయులకు సాటి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారని కళాశాల ప్రిన్సిపాల్ విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు సులభంగా లెక్కలు నేర్చుకోవడానికి వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్  తో అతిపెద్ద గుణకారం,కూడికలు, తీసివేతలు, రూట్స్, స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అతి తక్కువ సమయంలో సులువుగా విద్యార్థులు చెప్పడం జరిగిందని వారు అన్నారు, అనంతరం పాఠశాల చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం న్యూ మిలీనియం స్కూల్స్లో గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని విద్యార్థులకు గణిత సబ్జెక్టు పై అవగాహన కల్పిస్తూ ఆ సబ్జెక్టు పై భయం అనేది లేకుండా లెక్కలను సులువైన పద్ధతిలో ఎలా నేర్చుకోవాలి అనే దానిపై వారికి చక్కటి అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు, బహుముఖ ప్రజ్ఞాశాలి గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకమైన నివాళులర్పించామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ విశ్వనాథరెడ్డి వరుణ్ రెడ్డి ఇన్చార్జి తిరుపతిరెడ్డి గణిత అధ్యాపకులు శంకర్ కిరణ్ రమేష్ నవీన్ సారయ్య రాజు రాధిక పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...