Tuesday, 21 June 2022

 

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రానుందా!!!?

 

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం గంటగంటకూ ముదురుతోంది. అధికార మహా వికాస్ అగాధి కూటమి ప్రభుత్వం మనుగడ ఇరకాటంలో పడేసిన శివసేన రెబల్ ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గుజరాత్ లో మకాం వేశారు. సర్కారు

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Maharashtra political crisis) గంటగంటకూ ముదురుతోంది. అధికార మహా వికాస్ అగాధి కూటమి ప్రభుత్వం మనుగడను ఇరకాటంలో పడేస్తూ శివసేనకు చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే (Eknath Shinde)రెబల్ చర్యకు దిగారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి షిండే వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఏక్ నాథ్ షిండే వెంట ఎంత మంది ఎమ్మెల్యులు ఉన్నారనేది క్లారిటీ రావాల్సి ఉంది. షిండే వెంట 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తులుత వార్తలు వచ్చినా, ఇప్పుడా సంఖ్య 23కు పెరిగింది. కొన్ని వార్తా సంస్థలైతే షిండే వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 36గానూ పేర్కొన్నాయి. అందులో నలుగురు మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మంత్రి ఏక్ నాథ్ షిండేతోపాటు ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ఓ రిసార్టులో ఉన్నట్లు సమాచారం. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోన్న క్రమంలో, సూరత్ లో శివసేన ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. షిండే వర్గంలోని 23 మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టాలనే బీజేపీ ఉద్దేశానికి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. సదరు ఎమ్మెల్యేల జాబితాతో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. బీజేపీ హైకమాండ్, అమిత్ షా, జేపీ నడ్డాలను ఆయన కలవనున్నారు. గతంలో ఓసారి ఇలాగే తొందరపడి సీఎంగా ప్రమాణం చేసి, గంటల వ్యవధిలోనే రాజీనామా చేసిన చేదు అనుభవం దరిమిలా ఫడ్నవిస్ ఈసారి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లడానికి ముందు ముంబైలో దేవేంద్ర ఫడ్నవిస్ తమతో మాట్లాడారని, శివసేనలో తిరుగుబాటు తలెత్తిన నేపథ్యంలో అవసరమైతే, మహారాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధంగా ఉంటుందని ఫడ్నవిస్ వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ మీడియా రిపోర్టు చేసింది. గుజరాత్ క్యాంపులో ఉన్న 23 మంది శివసేన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం లేదా విశ్వాస పరీక్షకు దూరంగా ఉంచడం ద్వారా ఉద్ధవ్ సర్కారును కూలగొట్టాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలో బీజేపీ నీచ రాజకీయాలు మహారాష్ట్రలో సాగబోనీయమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. మంత్రి ఏక్ నాథ్ షిండేతో టచ్ లోనే ఉన్నామని, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేంతటి సాహసం షించే చేయబోరని, గుజరాత్ నుంచి ఆయన వర్గం ఎమ్మెల్యేలు తిరిగొస్తారనే నమ్మకం ఉందని రౌత్ మీడియాతో అన్నారు. శివసేనలో తిరుగుబాటు నేపథ్యంలో కూటమిలోని ఎన్సీపీకాంగ్రెస్ పార్టీలు సైతం అప్రమత్తం అయ్యాయి. ఆయా పార్టీల కీలక నేతలు ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోవడంతో శివసేన పార్టీ ఇవాళ ఢిల్లీలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి వెళ్లలేకపోయింది. రౌత్ తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకొని ముంబైలోనే ఉండిపోయారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై ఢిల్లీలో ప్రతిపక్షాల సమావేశానికి నేతృత్వం వహిస్తోన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం ఈ సాయంత్రమే ముంబై పయనం కానున్నారు. ఇవాళ రాత్రి పవార్ ముంబై చేరగానే నేరుగా సీఎం ఠాక్రేను కలవనున్నారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఉత్కంఠభరితంగా సాగుతున్నది మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మహా వికాస్ అగాధి కూటమికి 169 ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో శివవసేన 56, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44, బహుజన్ వికాస్ పార్టీ 3, సమాజ్ వాదీ పార్టీ 2, ప్రహార్ జనశక్తి పార్టీ 2, పీడబ్ల్యూపీకి 1 ఎమ్మెల్యే ఉండగా, 8మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. విపక్షంలోని ఎన్డీ కూటమి బలం 113గా ఉంది. అందులో బీజేపీకి 106, ఆర్ఎస్పీ 1, జేఎస్ఎస్ 1, ఇండిపెండెంట్లు 5గురు ఉన్నారు. ఈ రెండు కూటములు కాకుండా ఎంఐఎంకు ఇద్దరు, సీపీఐ, ఎంఎన్ఎస్, స్వాభిమాన్ పక్ష్ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. శివసేన నుంచి ప్రస్తుతం దూరమైన 23మంది ఎమ్మెల్యేలకు తోడు ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఇంకొందరిని బయటికి లాగేసి, ఇండిపెండెంట్ల మద్దతుతో సర్కారు ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.

 

ఉపరాష్ట్రపతే రాష్ట్రపతి అవ్వబోతున్నారా

అధికార పక్షం తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారనే చర్చ జోరందుకుంది. ఈ తరుణంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో జేపీ నడ్డా, అమిత్‌ షా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మంగళవారం వెంకయ్యనాయుడుని కలిసి.. హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. ఈ తరుణంలో.. రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడును నిలబెడతారా? అనే చర్చ మొదలైంది. గతంలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన వాళ్లు.. రాష్ట్రపతిగానూ పదోన్నతి పొందిన దాఖలాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులుగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్‌ హుస్సేన్, వి.వి. గిరి, ఆర్‌. వెంకట్రామన్, డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ, కె.ఆర్‌ నారాయణన్‌లు రాష్ట్రపతులయ్యారు. ఈ తరుణంలో.. ఇప్పుడు వెంకయ్యనాయుడుకు ఆ ఛాన్స్‌ దక్కవచ్చని, పైగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ల పర్వం మొదలై.. వారం గడుస్తున్నా ఇటు ఎన్డీయే, అటు విపక్షాల కూటమి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. విపక్షాలు మరోసారి భేటీ కానున్న తరుణంలో.. బీజేపీ కమిటీ మాత్రం అభ్యర్థి ఎవరనేది కనీసం హింట్‌ కూడా ఇవ్వలేదు. 

మంగళవారం రాత్రి 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో.. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయొచ్చని భావిస్తున్నారు. ఇక విపక్షాల తరపున యశ్వంత్‌ సిన్హా పేరు తెర మీదకు వచ్చింది. అయితే అందరి ఆమోదయోగ్యమైన పేరును ప్రకటిస్తామని సీపీఐ నేత డి రాజా చెప్తున్నారు.  జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

 

 

 

అగ్నిపథం కండిషన్స్ అప్లై

దేశంలో సైనికశిక్షణ పొందిన యువతరం పుష్కలంగా అందుబాటులో ఉండడం, సైనిక బలగాలను నెమ్మది నెమ్మదిగా అత్యుత్తమ ప్రతిభావంతులతో మాత్రమే నింపడం అనేది లక్ష్యంగా అగ్నిపథ్ పథకాన్ని రూపొందించినట్లుగా కేంద్రం ప్రచారం చేసుకుంటూ వచ్చింది. 

నిజానికి ప్రకటించిన రోజు నాటికి అగ్నిపథం అసలు స్వరూపం అదే. కానీ.. సైనిక విభాగాల నియామక నోటిఫికేషన్లు వెలువడే సమయానికి అసలు రూపం బయటపడుతోంది. ముసుగులు తొలగిపోతున్నాయి. అగ్నివీరులుగా ఎంపికయ్యే ప్రతి బ్యాచ్ లో 25 శాతం మందిని.. సైనిక సర్వీసుల్లోకి తీసుకుంటారు అనే మాట మిథ్య అని తేలిపోతున్నది. ఒకవైపు ఆందోళనలు ఇంకా కొనసాగుతున్న తరుణంలోనే.. కేంద్రం యొక్క అసలు వంచన స్వరూపం కూడా బయటకు వచ్చింది. 

అగ్నిపథ్ ద్వారా.. ఏటా జరిగే అగ్నివీరుల నియామకాల్లో నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని సర్వీసుల్లోకి తీసుకుంటారనేది తొలినాటి ప్రకటన. కానీ ఆర్మీ నోటిఫికేషన్లు వచ్చిన సమయానికి చిన్న మెలిక పెట్టారు. 25 శాతం మందిని తీసుకోవడం అనేది కంపల్సరీ కాదు. అది ఆర్మీ ఇష్టం! అంటే మొత్తం నూరుశాతం మందిని కూడా ఇంటికి పంపేసి.. మరో బ్యాచ్‌ను కొత్తగా నాలుగేళ్లు మాత్రమే పనిలో ఉండే అగ్నివీరులుగా తీసుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల సైనిక బలగాలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. కానీ పర్మినెంట్ ఉద్యోగం ఉన్న సైనికుల సంఖ్య చాలా దారుణంగా తగ్గిపోతూ ఉంటుంది. 

అయితే ఇందులో చిన్న వెసులుబాటును ప్రకటించారు. ఈ నాలుగేళ్ల శిక్షణ పూర్తిచేసుకున్న వారు..  మళ్లీ ఫ్రెష్ గా సైనిక నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నాలుగేళ్ల వలన వారికి కొంత ఎడ్వాంటేజీ ఉంటుంది. అప్పుడు సెలక్షన్ ప్రక్రియ యధావిధిగా చేపడతారు. అయితే ఆ సెలక్షన్లు ఎంత విస్తృతంగా జరుగుతాయి. తద్వారా అవకాశాలు ఎలా ఉంటాయి అనేది క్లారిటీ లేదు. నాలుగేళ్ల తర్వాత జరగబోయే ప్రక్రియ కాబట్టి.. ఇప్పుడే దానికి సంబంధించి ఎవరైనా ప్రకటించిన మాటలు నమ్మడానికి కూడా అవకాశం లేదు.

ఇప్పుడు అగ్నిపథ్ గురించి ఆందోళన చెందుతున్న వారు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం ఈ గందరగోళం సృష్టించకుండా ఇంకో పనిచేసి ఉంటే బాగుండేది. 17.5ఏళ్లు కనీస వయోపరిమితి కాబట్టి.. టెన్త్, ఇంటర్ స్థాయుల్లో ఎన్‌సీసీ లాంటి సైనిక అనుబంధ శిక్షణను ప్రతిచోటా ప్రవేశపెట్టి.. అందులో శిక్షణ పొందిన వారు మాత్రమే సైనిక నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, ఆ శిక్షణ లేని వారు అనర్హులని చెప్పి ఉంటే సరిపోయేది. 

ప్రభుత్వానికి అగ్నివీరులు అనే ముసుగుకింద నాలుగేళ్లపాటు ఇచ్చే జీతాల భారం కూడా తగ్గేది. ఇప్పుడు అనేక రకాల గందరగోళాలకు, అస్థిరత్వానికి కారణమయ్యేలా ప్రభుత్వం ఆలోచనలు, ఆచరణ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

 

 

 

యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామధేనువు సేవాసమితి సభ్యుల యోగ కార్యక్రమం




2015 జూన్ 21 , మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే.. జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి భారత ప్రధాని మోదీ సూచించారు.

యుజ్అనగా కలయికఅనే సంస్కృత ధాతువు నుండి యోగలేదా యోగముఅనే పదం ఉత్పన్నమైంది. యుజ్యతేఏతదితి యోగః’, ‘యుజ్యతే అనేన ఇతి యోగఃవంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము. యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు వెళ్లడమే యోగ. యోగముఅంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. యోగా అనేది ఒత్తిడిని తగ్గించడంలో, శారీరక బలాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

యోగతో ఎముకలు దృఢంగా..

వయస్సు పెరిగే కొద్దీ ఎముకల్లో ఉండే క్యాల్షియం కూడా తరుగుతూ ఉంటుంది. దీని ఫలితంగా ఎముకలు బలహీనం అయిపోతాయి. ఈ పరిస్థితుల్లో బోలు ఎముకల వ్యాధి సోకె అవకాశం ఉంది. యోగాలో కొన్ని ఆసనాలు చేయడం ద్వారా ఎముకలు శక్తివంతమై వాటి యొక్క బరువు కూడా పెరుగుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా ధృఢంగా మారతారు. యోగా అనేది ఓ దివ్యౌషధం అని గుర్తుంచుకోవాలి. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

శ్వాసక్రియలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే శరీరంలో వీటితో పాటు కొన్ని రకాల హార్మోన్స్ విడుదల అవుతాయి. ఈ కారణంగా శరీరం రిలాక్స్ అవుతుంది. చక్కని విశ్రాంతి పొందుతారు. వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. యోగా వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. కంటి సమస్యలు, మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కొవ్వు నిల్వలు సమతుల్యంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్నవారికి యోగా అధ్భుత ఔషధమని చెప్పొచ్చు. యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామధేనువు సేవాసమితి సభ్యులు స్థానిక సనత్ నగర్ హనుమాన్ గోశాల నందు యోగ చేయటం జరిగింది

 

Monday, 20 June 2022

 

తండ్రుల ప్రసూతి సెలవుల గురించి మీకు తెలుసా?

 

2020లో ఫిన్లాండ్ ఒక మైలురాయిని నాటింది. తల్లి తండ్రులిద్దరికీ సమానంగా 7 నెలల ప్రసూతి సెలవులు ప్రకటించారు. సమాన సెలవులు ప్రకటించిన మొదటి దేశం ఫిన్లాండ్

త‌ల్లితో పాటు త‌ండ్రులు పిల్ల‌ల బాగోగులు చూసుకునే ఆచారం పెరుగుతోంది. మీరు ఉదయం తల్లి ,సాయంత్రం తండ్రి షిఫ్ట్ నమూనాలను కూడా చూడవచ్చు. అయితే కూలి పనులకు వెళ్లే స్త్రీలు తమ పనికి సెలవు పెట్టి బిడ్డను చూసుకుంటున్నంత సౌకర్యం పురుషులకు ఉండదు. కానీ ఈ యూరోపియన్ దేశాలన్నీ 1970 లలో ఆలోచించడం ప్రారంభించాయి. తండ్రులకు ప్రసూతి సెలవు ఇవ్వడం ప్రారంభించాయి. ప్రస్తుతం వివిధ దేశాల్లో పురుషులకు ప్రసూతి సెలవులు అందజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తండ్రులకు ప్రసూతి సెలవులను చూద్దాం.

ఐరోపా దేశాలలో పిల్లల సంరక్షణ బాధ్యత తల్లి ,తండ్రి ఇద్దరికీ ఎక్కువగా ఉంటుంది. స్వీడన్ ,ఎస్టోనియా వంటి దేశాల్లో 1980, 1990ల నుండి ప్రసూతి సెలవులు అమలులో ఉన్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ 100% వేతనంతో ప్రసూతి సెలవు తీసుకోవచ్చని 3 నెలల వరకు తప్పనిసరి. ఇద్దరు తల్లిదండ్రులు ఇప్పుడు 80% చెల్లింపుతో 480 రోజులను పంచుకోవచ్చు లిథువేనియాలో మీరు 100% చెల్లింపు సెలవుతో 1 సంవత్సరం తీసుకోవచ్చు. దీనికి 2 సంవత్సరాల వరకు పట్టవచ్చు. జీతంలో 70% చెల్లిస్తారు. జపాన్ ,దక్షిణ కొరియాలో మీరు 1 సంవత్సరం వరకు షేర్డ్ లీవ్ తీసుకోవచ్చు. మొదటి 6 నెలలకు 67% జీతం ,తదుపరి 6 నెలలకు 50% జీతం. నార్వేలో ఒక తండ్రి 15 వారాల వరకు 100% వేతనంతో ఇంటి నుండి తన బిడ్డను చూసుకోవచ్చు. 80% 19 వారాల వరకు చెల్లించాలి.

ఫ్రాన్స్‌లో 28 రోజుల వరకు పూర్తి వేతనంతో తండ్రులకు ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది. 2018 నాటికి, OECD గ్రూప్‌లోని 41 దేశాలలో 35 దేశాలు తండ్రులకు ప్రసూతి సెలవులు మంజూరు చేసినట్లు నివేదించాయి.
2019లో కెనడా ఒక విప్లవం చేసింది. ద్విలింగ తల్లిదండ్రులే కాకుండా స్వలింగ సంపర్కులు ,దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు కూడా వారి పిల్లలను చూసుకోవడానికి 5 వారాలపాటు 55% వేతనంతో కూడిన సెలవు ఇస్తుంది.

ఈ ఆచారం భారతదేశంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే అమలులో ఉంది. 2 వారాల వరకు ప్రసూతి సెలవులు తీసుకునేందుకు తండ్రికి అనుమతి ఉంది.సాధారణంగా ప్రైవేట్ సంస్థలు అలాంటి ప్రయత్నాలు చేపట్టవు. లాభాల బాటలో పయనిస్తున్న కంపెనీలకు ఈ తరహా సెలవుల వల్ల ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ దీనికి మినహాయింపులు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ వారి పురుష ఉద్యోగులకు 6 వారాల వరకు ప్రసూతి సెలవులను అందిస్తుంది.జొమాటో ఫుడ్ డెలివరీ కంపెనీ 26 వారాలు, 6 నెలల వరకు సెలవులను అందిస్తుంది.

 

ముస్లిం యువతుల వివాహ వయసుకు సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు (High Court) కీలక వ్యాఖ్యలు చేసింది

 

 

ముస్లిం యువతుల వివాహ వయసుకు సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు (High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. యువకుడికి 21 ఏళ్లు, యువతికి 16 ఏళ్లు ఉన్నాయి. ముస్లిం (Muslim) పర్సనల్‌ లా ప్రకారం తమకు వివాహ వయసు (Marriage Age)

ముస్లిం యువతుల వివాహ వయసుకు సంబంధించి పంజాబ్హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకరినొకరు ఇష్టపడిన ముస్లిం యువతి, యువకుడు గత వారం వివాహం చేసుకున్నారు. యువకుడికి 21 ఏళ్లు, యువతికి 16 ఏళ్లు ఉన్నాయి. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం తమకు వివాహ వయసు ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. వారికి పంజాబ్, హర్యానా హైకోర్టు రక్షణ కల్పించింది. ముస్లిం ఆచారాల ప్రకారం తమ వివాహం సరైనదేనని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ కొత్త జంట దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ బెంచ్ విచారిస్తోంది.

ముస్లిం చట్టంలో యుక్తవయసు, మేజర్‌ అవడం ఒకటేనని, ఒక వ్యక్తి 15 సంవత్సరాలకు మేజర్‌ అవుతారని ఈ జంట కోర్టుకు తెలిపింది. యుక్తవయసు వచ్చిన ముస్లిం అబ్బాయి లేదా ముస్లిం అమ్మాయి.. వారు ఇష్టపడే వారిని వివాహం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉందని, సంరక్షకుడికి జోక్యం చేసుకునే హక్కు లేదని కూడా తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది.. యూనస్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అండ్‌ ఓర్స్ కేసులో తీర్పుతో సహా ఈ విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు వివిధ తీర్పులను ఉదహరించారు. ప్రతివాదులు నెం.5 నుంచి 7 వరకు ఉన్న వారి నుంచి తమ ప్రాణాలకు, స్వేచ్ఛకు తీవ్రమైన ప్రమాదం ఉందని, పఠాన్‌కోట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కి ఫిర్యాదు చేసినా, ఎటువంటి చర్య తీసుకోలేదని నూతన జంట కోర్టుకు తెలిపారు. చట్టం ప్రకారం నిర్ణీత గడువులోగా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేలా ఆదేశాలు జారీ చేస్తే తాము సంతృప్తి చెందుతామని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. యూనస్ ఖాన్ కేసు విషయంలో, ముస్లిం అమ్మాయి వివాహం ముస్లింల పర్సనల్‌ లా ద్వారా నిర్వహిస్తారని కోర్టు అంగీకరించినట్లు గుర్తు చేశారు. వివిధ తీర్పులలో పేర్కొన్న విధంగా.. ముస్లిం యువతి వివాహం ముస్లిం వ్యక్తిగత చట్టం ద్వారా నిర్వహిస్తారని స్పష్టంగా ఉంది. ప్రిన్సిపుల్స్ ఆఫ్ మొహమ్మదీన్ లా బై సర్ దిన్షా ఫర్దుంజీ ముల్లా అనే పుస్తకంలోని ఆర్టికల్ 195 ప్రకారం, పిటిషనర్ నెం.2 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండటంతో ఆమెకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అర్హత ఉంది. పిటిషనర్ నం.1 వయసు 21 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటంతో వివాహం చెల్లుతుందని, పిటిషనర్లు ఇద్దరూ వివాహ వయసు కలిగి ఉన్నారని ముస్లిం పర్సనల్ లా చెబుతుంది. సర్ దిన్షా ఫర్దుంజీ ముల్లా రచించిన ప్రిన్సిపల్స్ ఆఫ్ మొహమ్మదీన్ లా అనే పుస్తకంలోని ఆర్టికల్ 195 ప్రకారం.. యుక్తవయసు వచ్చిన ప్రతి ముస్లిం యువకుడు, యువతి వివాహ ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు. ఇందుకు 15 సంవత్సరాలు పూర్తవ్వాలని పేర్కొంటుంది.

కోర్టు స్పందన ఇలా..

పిటిషనర్ల ఆందోళనను పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి కోర్టు కళ్ళు మూసుకోదు. పిటిషనర్లు వారి కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందున, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను వారు హరించలేరు. చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలిఅని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పఠాన్‌కోట్‌ను ఆదేశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. భారతదేశంలో ప్రత్యేక వివాహ చట్టం, 1954, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 మేరకు.. చట్టబద్ధమైన వివాహ వయసు అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు.

ముస్లిం చట్టం ప్రకారం, వివాహం లేదా నిఖా అనేది ఒక ఒప్పందం. వివాహ వయసు ఉన్న వారు సొంత నిర్ణయాల మేరకు వివాహం చేసుకునే హక్కును ముస్లిం చట్టం కల్పిస్తుంది. చెల్లుబాటు అయ్యే ముస్లిం వివాహానికి షరతులు ఇవే..

ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా ముస్లింలు అయి ఉండాలి.

- ఇద్దరూ యుక్తవయసులో ఉండాలి.

- ఇద్దరికీ అంగీకారం ఉండాలి. ఇద్దరు సాక్షులు ఉండాలి.

- మెహర్, నిషేధించిన బంధాలతో వివాహం చేసుకోకూడదు (Absence of a prohibited degree of relationship).

2021 డిసెంబర్ 15న మహిళల చట్టబద్ధమైన వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో మహిళల వివాహ వయసు 21 సంవత్సరాలకు చేరుతుంది. అన్ని మతాలకు అతీతంగా మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన "బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు, 2021"ను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

 

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...