Monday, 4 July 2022

 

జగ్గారెడ్డి సంచలన ప్రకటన… కన్ఫ్యూజ్‌ కావొద్దంటున్న జగ్గారెడ్డి!!!

 

 సోమవారం సంచలన ప్రకటన చేస్తానని మీడియా ముఖంగానే చెప్పారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బండకేసి కొడతానని రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జగ్గారెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ అందరిలో కనిపించింది. ఏం చెబుతారా? అని అంతా ఉత్కంఠగా వింటుండగా.. ప్రస్తుతం తాను ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు మొన్నటి వ్యాఖ్యలపై నో కామెంట్స్ అన్న జగ్గారెడ్డి.. సంచలన ప్రకటన ఏముంటుందనేది సమయమే డిసైడ్‌ చేస్తుందని చెప్పారు. తాను కాంగ్రెస్‌ లోనే ఉంటానని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్‌ ను అధికారంలో తీసుకొస్తామన్నారు. పార్టీలోని పరిణామాలను వివరించేందుకు సోనియాను కలుస్తామని తెలిపారు. తాను ఏం మాట్లాడినా కాంగ్రెస్‌ మంచి కోసమేనని వ్యాఖ్యానించారు.

పార్టీలో ఉంటానా పోతానా అనేది మనసులో నుంచి తీసేయాలన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ నాయకులు తన వ్యాఖ్యలను నెగెటివ్‌ గా తీసుకోవద్దని చెప్పారు. పార్టీ లైన్‌ లోనే ఉంటానని.. ఎక్కడికీ పోనని స్పష్టం చేశారు. ఒకవేళ తాను పోవాలి అనుకుంటే ఆపేదెవరు? అంటూ వ్యాఖ్యానించారు. తన స్టేట్‌ మెంట్లతో ఎవరూ కన్ఫ్యూజ్ కావొద్దని.. తాము తిట్టుకోవడం వ్యూహమే అనుకోవాలన్నారు. రేవంత్, తాను గొడవ పడేది ఎత్తుగడనే అనుకోవాలని చెప్పారు.

మరోవైపు బీజేపీ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. ఎలాంటి తీర్మానాలు లేకుండా సభ ముగించేశారని ఎద్దేవ చేశారు. బండి సంజయ్ పాదయాత్రలో ప్రజలకు ఏ హామీలు ఇస్తారని ప్రశ్నించారు. బీజేపీ నేతలంతా డబుల్ ఇంజన్ అని మాట్లాడుతున్నారని.. ఉన్న సింగిల్ ఇంజనే సరిగ్గా పనిచేయడం లేదని విమర్శించారు జగ్గారెడ్డి

 

మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు!

మహారాష్ట్ర (Maharashtra)రాజకీయాల్లో మరో సంక్షోభం తలెత్తనుందా? మహావికాస్ అగాధి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టి, బీజేపీ మద్దతుతో సీఎం గద్దెనెక్కిన ఏక్‌నాథ్ షిండేది మూన్నాళ్ల ముచ్చటేనా? మధ్యంతర ఎన్నికలతోనే డ్రామా ముగుస్తుందా? అనే అవుననే అంటున్నారు ఎన్సీపీ చీఫ్ శదర్ పవార్  రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ తన పార్టీ శ్రేణులకు పవార్ పిలుపునివ్వడం సంచలనంగా మారింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సోమవారం నాడు అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో 164-99 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం కేబినెట్ కూర్పుపై దృష్టిపెట్టిన ఆయన.. వచ్చేవారం సుప్రీంకోర్టు వెల్లడించనున్న తీర్పుకోసమూ ఎదురుచూస్తున్నారు. శివసేన పార్టీ మొత్తంగా ఉద్ధవ్ ఠాక్రేకు చెందాలా? షిండే వర్గానిదేనా? అనే వివాదంపై సుప్రీంకోర్టు ఈనెల 11న విచారించనుంది. వివాదంలో షిండే వర్గానికే టెక్నికల్ ఎడ్జ్ ఉండటంతో ఉద్ధవ్ త్వరలోనే సేన లేని శివసేనానిగా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, బీజేపీ-శివసేన రెబల్ వర్గం పొత్తుతో ఏర్పడిన ప్రభుత్వం ఆరు నెలలకు మించి మనలేదని పవార్ వ్యాఖ్యానించారు.

క్యాబినెట్ కూర్పు తర్వాత శివసేన రెబల్స్ లో చాలా మంది సీఎం షిండేపై తిరుగుబాటు చేస్తారని, నిజానికి షిండేకు మద్దతు పలికిన రెబల్స్‌లో అనేక మందికి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇష్టం లేదని, క్యాబినెట్‌ విస్తరణతో వారిలో అసంతృప్తి బయటకు వస్తుందని జోస్యం చెప్పారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. ఆరు నెలల్లోపే మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు తప్పవని, అందుకోసం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులతో పవార్ అన్నారు. దిలా ఉంటే, సోమవారం నాటి బలపరీక్షలో ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షిండే సర్కారుకు వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తం 99 ఓట్లు షిండేకు వ్యతిరేకంగా పడగా, సభకు హాజరైన వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో షిండే ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. శివసేన కకావికలం అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగానే కొనసాగుతున్న దరిమిలా అజిత్ పవార్ ప్రతిపక్ష నేతగా ఎన్నికవుతారని తెలుస్తోంది

 

 

హైదరాబాద్ బీజేపీ సభ బండి సంజయ్‌కు కలిసొచ్చేనా!!!

టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే విషయంలో బండి సంజయ్ దూకుడుగా ముందుకు సాగడం.. ఈ విషయంలో బీజేపీ శ్రేణుల్లో సైతం బండి సంజయ్ సరికొత్త ఉత్సాహం నింపడం కూడా ఆయనపై ఆ పార్టీ హైకమాండ్‌కు నమ్మకం పెరిగేలా చేసిందనే వాదన ఉంది.

తెలంగాణలో BJP దూకుడు కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. ఈసారి కచ్చితంగా తెలంగాణలో పాగా వేయాల్సిందేనని డిసైడయ్యింది. తెలంగాణలో బీజేపీ(BJP) బలపడుతుండటం.. ఆ పార్టీ కూడా రాజకీయ సందడి చేస్తుండటంతో.. కచ్చితంగా ఆ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని రాజకీయవర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి ఎవరవుతారా ? అంశంపై కూడా ఎప్పటికప్పుడు చర్చ జరుగుతోంది. ఈ రేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందున్నారనే వాదన ఉన్నా.. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న కిషన్ రెడ్డి కూడా ఈ రేసులో ఉన్నారని మరికొందరు వాదిస్తున్నారు.

అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ మద్దతు ఎవరికి ఉందనే దానిపై కూడా ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. గతంలో తుక్కుగూడలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆ పార్టీ ముఖ్యనేత అమిత్ షా(Amit Shah).. కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి మోదీ(Narendra Modi) అవసరం లేదని.. ఇందుకు బండి సంజయ్ సరిపోతారని కామెంట్ చేశారు. దీంతో తెలంగాణలో కేసీఆర్‌కు పోటీగా బండి సంజయ్ మారతారనే చర్చ కూడా సాగింది. మరోవైపు తాజాగా హైదరాబాద్‌లో జరిగిన భారీ సభలోనూ నరేంద్రమోదీ, అమిత్ షా బండి సంజయ్‌కు జై కొట్టారనే ప్రచారం సాగుతోంది.

ఈ సభలో మీ అందరి ప్రియమైన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌అంటూ అమిత్ షా వ్యాఖ్యానించగా.. సభకు వచ్చిన స్పందనను చూసి ప్రధాని నరేంద్రమోదీ స్టేజ్ మీదే బండి సంజయ్‌ను భుజం తట్టి అభినందించడం అందరి దృష్టిని ఆకర్షించింది.  సభలో మాటల ద్వారా అమిత్ షా.. భుజం తట్టి ప్రోత్సహించడం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరూ తెలంగాణలో బండి సంజయ్‌ నాయకత్వానికి జై కొట్టారనే ప్రచారం బీజేపీలో సాగుతోంది. నిజానికి తెలంగాణలో బండి సంజయ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాతే పార్టీ అనేక విజయాలు సాధించింది.

దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు రావడం బండి సంజయ్‌కు బాగా కలిసొచ్చింది. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే విషయంలో బండి సంజయ్ దూకుడుగా ముందుకు సాగడం.. ఈ విషయంలో బీజేపీ శ్రేణుల్లో సైతం బండి సంజయ్ సరికొత్త ఉత్సాహం నింపడం కూడా ఆయనపై ఆ పార్టీ హైకమాండ్‌కు నమ్మకం పెరిగేలా చేసిందనే వాదన ఉంది. ఈ కారణంగానే ఆయనపై కొందరు పార్టీ నేతలు బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తున్నా.. వాళ్లు మాత్రం బండి సంజయ్ నాయకత్వానికి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారని పలువురు భావిస్తున్నారు. మొత్తానిక హైదరాబాద్ బీజేపీ సభ బండి సంజయ్‌కు బాగా కలిసొచ్చిందనే చర్చ సాగుతోంది.

 

 

 

పొత్తులో ఉన్న తమ్ముడ్ని కాదని అన్నకు పిలుపేలా!!!

భీమ‌వ‌రంలో అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించ‌డం వెనుక బీజేపీ భారీ వ్యూహం ర‌చించిందా? అంటే... ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రావాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. అంతేకాదు, మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కూడా బీజేపీ ప‌క్క‌న పెట్టి, అన్న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంపై భిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఇందులో నిజానిజాల సంగ‌తేమో గానీ, ఒక బ‌ల‌మైన చ‌ర్చకు తెర‌లేచింది. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌మ‌ను కాద‌ని టీడీపీ వైపు చూస్తుండ‌డాన్ని బీజేపీ జీర్ణించుకోలేకుంది. కుటుంబ పార్టీలు, వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేక నినాదంతో జాతీయ స్థాయిలో తాము పోరాటం చేస్తున్నామ‌ని, ఇందులో భాగంగానే ఏపీలో టీడీపీ, వైసీపీల‌కు స‌మ‌దూరంలో ఉండాల‌ని అనుకుంటున్న‌ట్టు బీజేపీ నేత‌లు చెబుతున్నారు. కానీ జ‌గ‌న్‌పై ద్వేషంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రోసారి చంద్ర‌బాబును అధికారంలోకి తెచ్చేందుకు త‌మ‌ను కూడా అందులో భాగ‌స్వామిని చేయాల‌నే ప్ర‌య‌త్నాల‌ను బీజేపీ ప‌సిగట్టింది.

దీంతో ప‌వ‌న్‌ను సైతం దూరం పెట్టేందుకు వెనుకాడ‌కూడ‌ద‌ని బీజేపీ గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో బ‌ల‌ప‌డేందుకు ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడి కోసం బీజేపీ వెతుకులాడుతోంది. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవిపై బీజేపీ కన్ను ప‌డింది. అందుకే ఆయ‌న్ను ద‌గ్గ‌రికి తీసుకుని సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి, ఆ రెండు పార్టీల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు ఆ పార్టీ ముఖ్యుల నుంచి వినిపిస్తున్న మాట‌.

ఇందుకు అల్లూరి సీతారామ‌రాజు 125వ‌ జ‌యంతి వేడుక‌ల‌ను వేదిక చేసుకోవాల‌ని బీజేపీ నిర్ణ‌యించింది. అందుకే చిరంజీవిని ప్ర‌త్యేకంగా కిష‌న్‌రెడ్డి ఆహ్వానించి గౌర‌వించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. భ‌విష్య‌త్‌లో చంద్ర‌బాబును సీఎంగా చేయ‌డ‌మా లేక అన్న చిరంజీవిని ఆ స్థానంలో కూచోపెట్ట‌డ‌మా? అనేది ప‌వ‌న్‌క‌ల్యాణ్ విచ‌క్ష‌ణ‌కే వ‌దిలి పెట్టాల‌నే ప‌క్కా వ్యూహాన్ని ర‌చించిన‌ట్టు బీజేపీ ముఖ్య నేత‌లు చెబుతున్నారు.

ఇటీవ‌ల సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరు ప్ర‌క‌టించాల‌ని జ‌న‌సేన నుంచి వ‌చ్చిన డిమాండ్‌ను బీజేపీ మొహ‌మాటం లేకుండా తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. దీని వెనుక బీజేపీ దూర‌దృష్టే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా చిరంజీవే రంగంలో ఉంటార‌ని, మ‌ద్ద‌తు ఇవ్వ‌డమా? లేదా? అనేది ప‌వ‌న్ ఇష్ట‌మ‌ని బీజేపీ తేల్చి చెప్పే రోజు త్వ‌ర‌లో రానుంది. తాత‌కు ద‌గ్గు నేర్పిన‌ట్టు... త‌మ‌కు రాజ‌కీయాలు నేర్పాల‌ని అనుకుంటున్న‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అదును చూసి చెక్ పెట్టాల‌ని బీజేపీ ప‌క‌డ్బందీ వ్యూహం ర‌చిస్తున్న‌ట్టు ఆ పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

అయితే ప్ర‌జారాజ్యం చేదు అనుభ‌వంతో రాజ‌కీయాల‌కు మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టారు. రాజకీయాల ఊసే లేకుండా తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు. అంద‌రివాడిగా ఉండేందుకే చిరంజీవి ప్ర‌స్తుతానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి, అది కాకుంటే జాతీయ స్థాయిలో వెలిగిపోతున్న బీజేపీ నీడ‌లో ఉండేందుకు చిరంజీవికి అభ్యంత‌రం ఎందుక‌నే ప్ర‌శ్న వినిపిస్తోంది. ఏది ఏమైనా చిరంజీవిని త‌మ పార్టీ స్టార్ లీడ‌ర్‌గా తెచ్చుకునేందుకు బీజేపీ భారీ ప్లాన్ చేసింద‌న్న‌ది నిజం.

 

  

పేరు లేని రైల్వే స్టేషన్..



మన దేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ప్రజల మొదటి ఎంపిక రైలు ప్రయాణం. అంతేకాదు,ఇండియన్ రైల్వే ఆసియాలో రెండవ అతిపెద్ద రైలు నెట్వర్క్. అత్యధిక ప్రభుత్వ ఉద్యోగులు కలిగిన మన ఇండియన్ రైల్వే ఆధునిక టెక్నాలజీని పరిచయం చేస్తూ నిత్యం ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. అలాంటిది సంవత్సరాలుగా రైల్వే స్టేషన్లో బోర్డుపై పేరులేకుండా ఓ స్టేషన్ కొనసాగుతుందంటే మీరు నమ్ముతారా? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ని

మన దేశంలో ఎనిమిది వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సాధారణంగా మనం రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకోవాలి అంటే ఎక్కే స్టేషన్ దిగే స్టేషన్ పేరు తెలియాలి. మరి స్టేషన్కు పేరే లేకపోతే ఎలా? ఇప్పుడు మనం, పశ్చిమ బెంగాల్లోని ఆద్రా రైల్వే డివిజన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఈ డివిజన్లోనే మనం చెప్పకుంటోన్న పేరులేని రైల్వే స్టేషన్ ఉంది. బంకురా - మసాగ్రామ్ రైలు మార్గంలో ఉన్న ఈ స్టేషన్ రైనా, రైనగర్ అనే రెండు గ్రామాల మధ్య వస్తుంది. దీనిని 2008వ సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేషన్ ప్రారంభ రోజుల్లో రైనగర్ అని పిలువబడింది. కానీ రైనా గ్రామ ప్రజలు దీనిని వ్యతిరేకించారు.అందుకు కారణం లేకపోలేదు. ఆ స్టేషన్ భవనం ఉన్నది రైనా గ్రామంలోనే. దాంతో తమ గ్రామం పేరిట ఈ స్టేషన్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పటికే పెట్టిన పేరును ఎలా తొలగిస్తారని రైనగర్ వాసులు వాదనకు దిగారు. ఈ కారణంగా రెండు గ్రామాల ప్రజల మధ్య పెద్ద రణరంగమే జరిగింది. ఈ విషయం రైల్వే బోర్డుకు చేరింది. వివాదాన్ని పరిష్కరించడానికి, రైల్వే స్టేషన్ బోర్డు నుండి స్టేషన్ పేరును తొలగించారు అధికారులు. అప్పటినుంచి వివాదం కొనసాగుతుండడంతో స్టేషన్ పేరు లేకుండానే స్టేషన్ను కొనసాగిస్తున్నారు

అయితే, రైల్వే శాఖ ఇప్పటికీ దాని పాత పేరు రైనగర్ పేరుమీదనే ప్రయాణీకులకు టిక్కెట్లను జారీ చేస్తుంది. ఈ రైలు మార్గాన్ని గతంలో బంకురా- దామోదర్ రైల్వే మార్గంగా పిలిచేవారు. తర్వాత ఇది హౌరా- బర్దమాన్ మార్గానికి అనుసంధానించబడింది. ఈ స్టేషన్లో బంకురా- మసగ్రామ్ ప్యాసింజర్ రైలు మాత్రమే రోజుకు ఆరుసార్లు ఆగుతుంది. స్థానిక గ్రామాలవారి సౌకర్యార్థమే కాబట్టి ఎవరికి నచ్చిన పేరుతో వారు పిలుస్తారు. ఇక కిలోమీటర్ లెక్కన టికెట్ ఇస్తారు. దీనివల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పేరు లేకపోవడం వల్ల ప్రయాణీకులు దాని గురించి ఇతర వ్యక్తులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది.


Sunday, 3 July 2022

  

ఏడూ శనివారముల వెంకన్న  స్వామిని  దర్శనం చేసుకున్న కామధేనువు సేవాసమితి సభ్యులు..





ఇక్కడ వేంకటేశ్వరుడు రాయితో కాకుండా ఒక చెక్కలో స్వయంభువగా కొలువై ఉన్నాడు. అసలు నారదుడే విష్ణువుకు ఇక్కడ వేంకటేశ్వరుడిగా నామకరణం చేసినట్లు చెబుతారు. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా పిలుస్తారు. ఇక్కడ ఏడు వారాల శనివారం వ్రతం చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రంలో శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అందమైన ప్రకృతి కి నిలయమైన తూర్పగోదావరి జిల్లాలో, తెలుగువారి వంట పూతరేకులకు ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురానాకి కూత వేటు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు.

నారదమహర్షి వేంకటేశ్వరుడిగా నామకరణం చేసి తన స్వహస్తాతో ప్రతిష్టించిన విగ్రహమే వాడపల్లి వేంకటేశ్వర విగ్రహం. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతి అని కూడా అంటారు. ఈ క్షేత్రంలోని మూలవిరాట్టు రాతితో చేయబడినది కాదు.

చెక్కతో చేయబడినది. ఇందుకు సంబంధించిన పురాణ కథనం ప్రకారం. శ్రీ క`ష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకొంటాడు. దీంతో ద్వాపర యుగం అంతమించి అప్పుడప్పుడే కలియుగం ప్రారంభమవుతూ ఉంటుంది.

ఈ సమయంలో కలియుగంలోని ప్రజలు దైవ చింతన మరిచిపోయి డబ్బు సంపాదన పై ఎక్కువ ద`ష్టి సారిస్తూ ఉంటారు. దీంతో భూ మండలం పై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడుతారు
నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్లి ఈ భూమండలం పై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకొంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు.
ఇప్పటి వరకూ ఏదేని ఒక ఉపద్రవం సంభవించినప్పుడు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక రూపంలో అవతారాన్ని ఎత్తాను. అయితే ఆ అవతారంలో తనకు అర్చనలు జరగలేదు. అయితే ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకొంటానని చెబుతాడు.

దీని వల్ల వారిలో భక్తి భావం పెరుగుతుందని అభయమిస్తాడు. ఇందు కోసం ఇప్పటి వాడపల్లిలో స్వయంభువుగా వెలుస్తానని వారికి వివరిస్తాడు. దీంతో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. కాగా ఇప్పటి వాడపల్లినే పూర్వం నౌకాపురమనే పేరుతో పిలిచేవారు.

ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వాడపల్లి వద్ద ఉన్న గౌతమీ నదీ లో ఓ చందనం పెట్టె తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ప్రజలు దానిని తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టే కనిపించదు.
చివరికి అశరీర వాణి రూపంలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెలితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టే కనిపిస్తుంది.

భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తాడు. దీనిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్షీ దేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడకు నారదుడు వచ్చి జరిగిన కథ మొత్తం వారికి చెబుతాడు.
అంతేకాకుండా ఆ మూర్తికి ‘వేం' అంటే ‘పాపాలను' ‘కట' అంటే పోగొట్టేవాడు. అని నామకరణ చేసి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టింపజేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వేంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. అటు పై అక్కడ ఉన్నవారంతా కలిసి అక్కడ ఆలయం నిర్మింపజేశారు.

అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఓకసారి తుఫాను సంభవించగా అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోయాయి.

దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని చెప్పాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతాయి.

ఇక్కడ 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేస్తే ఎటువంటి కోరికైనా తీరుతుంది

·          తిరుపతి, ద్వారకా తిరుమలల తరువాత అత్యంత ప్రజాధరణ పొందిన క్షేత్రం వాడపల్లి. గౌతమీ నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. కొద్ది దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున, లోల్లకు ఆనుకొని ఉండుటతో లోల్లవాడపల్లిగా పిలుస్తారు.

·         ఇక్కడి దేవాలయములోని మూర్తి ధారు మూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూచేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడకల శిలా ఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విదంగా ఉంది. వైకుంటంలో ఒకసారి సనకసనందాది మహర్షులు నారాయణుని దర్శించుకొన వచ్చి భూలోకమున పాపము పెరుగుతున్నది. అధర్మం, అన్యాయం పెరుతున్నవి. వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకొన్నారు. అపుడు విష్ణువు వారితో అధర్మం ప్రభలినపుడు నేను అనేక రూపాలలో అవతరించాను అలానే కలియుగంలో అర్చాస్వరూపుడనై భూలోకంలో లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల పాపములను కడుగుచున్న గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలయుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురి చేరుకొంటాను. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు.

·         కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్ళకు కనిపించకపోవడం జరుగుతుండేది. ఒకరోజు ఊరిలో కల వృద్ద బ్రాహమణుడి కలలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు. తెలవారక ముందే అందరూ సుచిగా గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నదీగర్భంలోకి వెళితే కృష్ణగరుడపక్షి వాలి ఉన్నచోటులో నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పాడు. ప్రజలు స్వామి ఆదేసానుసారం వెళ్లగా చందనపేటిక కనిపిస్తుంది. దానిని నిపుణుడైన శిల్పితో తెరిపించగా దానిలో శంఖ,చక్ర, గదాయుదుడైన నారాయుణుడి విగ్రహం కనిపిస్తుంది. దానితో గతంలో నారదాదుల వలన తెలిసిన విసేషాలతో ఆ అర్చావతారరూపమునకు గౌతమీ తీరాన దేవాలయం నిర్మించి అందే మూర్తిని ప్రతిష్ఠకావించి పూజించుట ప్రారంభిస్తారు.

·         పూర్వపు ఆలయం నదీ పరీవాహక ప్రాంతంలో ఉండుట వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోగా తదనంతర ప్రస్తుత ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే అగ్నికులక్షత్రియుల కుటుంబం నిర్మించారు


గోదావరి వడ్డున ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మార్చినెలలో సర్వ ఏకాదశి రోజునుండి ఐదు రోజులపాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్ళకు అశేషంగా ప్రజలు తరలి వస్తుంటారు. ఈ ఉత్సవాలలో మరో ప్రత్యేకత ఊరిలోగల వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ ఐదురోజులు అన్నసంతర్పణ కార్యక్రమములు ఎవరికి వారుగా నిర్వహిస్తుంటారు. వాడపల్లి ఉత్సవాలకు వెళ్ళే భక్తులను భోజనానికి మావద్దకు రండిఅంటే మావద్దకురండి అని పిలుస్తూంటారు.

హైదరాబాద్, సనత్ నగర్ లోని కామధేనువు సేవాసమితి సభ్యులు శనివారం స్వామి దర్శనం చేసుకొని ఆలయ ప్రతిష్టతను చెప్పటం జరిగింది!! 





 

ఆన్లైన్ మోసం ఖరీదు ఒక ప్రాణం

ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ఇలాంటి మోసాల బారిన పడుతున్న బాధితుల్లో చదురానివారి కంటే బాగా చదువుకున్నవారే ఎక్కువమంది ఉంటున్నారు. అన్నీ తెలిసినా మోసగాళ్ల మాయలో పడి డబ్బులు పొగొట్టుకుంటున్నారు. కొంతమంది ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని   గుంటూరు జిల్లాలో  లో ఇలాంటి ఘటనే జరిగింది. మంగళగిరి మండలం నవులూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్వేతా చౌదరి.. కొంతకాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. తాను పనిచేస్తున్న సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయడంతో ఆదివారం ఉదయం కారులో హైదరాబాద్  వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం బండి  వేసుకొని ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. NTR జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని చిల్లకల్ల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. ఈ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే చిల్లకల్లు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా శ్వేత కోసం గాలించగా.. ఆదివారం ఉదయం పది గంటల సమయంలో మృతదేహం కనిపించింది. ఐతే ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అసలు విషయం తెలిసి అంతా షాక్ కు గురయ్యారు. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమో లేక ఉద్యోగంలో ఒత్తిడో కాదు. శ్వేతా చౌదరి బిటెక్ పూర్తిచేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. నిత్యం ఆన్ లైన్లో ఉండే శ్వేత.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తుండేది. ఈ క్రమంలో ఓ అపరిచత వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. సదరు వ్యక్తి లక్షా 20వేలు చెల్లిస్తే.. నీకు ఏడు లక్షలిస్తానని శ్వేతా చౌదరిని నమ్మించాడు. ఆమె తనదగ్గర డబ్బులు లేవని చెప్పడంతో అతడే రూ.50వేలు శ్వేతకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ రూ.50వేలతో కలిపి మిగిలిన డబ్బులను ఆమెతోనే కట్టించాడు. ఆ తర్వాత కూడా ఆమె రూ.1.30 లక్షలు చెల్లించింది. రెండు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రాడవంతో తాను మోసపోయానని గ్రహించింది. ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఆమె ఫోన్ కాల్ డేటాతో పాటు డబ్బులు పంపిన ఎకౌంట్ వివరాలు, సోషల్ మీడియా ఫ్రెండ్స్ లిస్టును పోలీసులు సేకరిస్తున్నారు. బాగా చదువుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ కూడా ఆన్ లైన్ మాయగాళ్ల ఉచ్చులో పడటం చర్చనీయాంశమవుతోంది

 

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...