Friday, 15 July 2022

 

గోదారమ్మా ఇక శాంతించు..

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 36 ఏళ్ల తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో 70 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటిందిఇదిలా ఉండగా.. 


గత 50 ఏళ్లలో మూడు సార్లు మాత్రమే గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. ఇక, ప్రస్తుతం గోదావరిలోకి 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, అధికారులు భద్రాచలం గోదావరి కరకట్టను డేంజర్‌ జోన్‌గా ప్రకటించారు. ఇప్పటికే భద్రాచలంలో పలు కాలనీలు నీటమునిగాయి. రామాలయం ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. 2వేల కుటంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారుఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా గోదావరి వరదతో విరుచుకుపడుతోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్‌లను గోదావరి వరద ముంచెత్తింది.

లక్ష్మీ బ్యారేజ్‌ వద్దకు 28.30 లక్షల క్యూసెక్కులు చేరడంతో కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 16.72 అడుగులకు చేరుకుంది. గోదావరి చరిత్రలో 1986లో రికార్డు స్థాయిలో 35,06,338 క్యూసెక్కులు ప్రవాహం వచ్చినప్పుడు కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 15.75 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోవడం గమనార్హం. ఇక ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది.

 

Thursday, 14 July 2022

7.50 లక్షల పరిహారం ఇవ్వండి- సుప్రీంకోర్టు ఆదేశాలు

 రేప్ కేసులో జైల్లో ఉన్న ఖైదీకి!!


అత్యాచార కేసుల్లో దోషిగా తేలితే కోర్టులు కఠిన శిక్షను విధిస్తాయి. దోషులను జైల్లో వేసి ఊచలు లెక్కపెట్టేలా చేస్తాయి. ఐతే ఛత్తీస్‌గఢ్‌ లో ఓ విభిన్నమైన కేసు తెరపైకి వచ్చింది. రేప్ కేసులో దోషికిగా తేలి.. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి ఏడున్నర లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని   ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి దీనికి కారణమేంటి? అత్యాచార బాధితురాలికి పరిహారం ఇవ్వడం చూశాం గానీ.. దోషికి డబ్బులు ఇవ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా?. జష్‌పూర్ జిల్లాలోని ఫర్సాబహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్ముండా గ్రామానికి చెందిన భోలా కుమార్ అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ట్రయల్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి... 2014లో జీవిత ఖైదు విధించింది. ఐతే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ... హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లాడు భోలా కుమార్. 2018 జూలై 19న హైకోర్టు కూడా అతడిని దోషిగా నిర్ధారించింది. కానీ శిక్షను మాత్రం తగ్గించింది. జీవిత ఖైదు కాకుండా.. ఆ శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. ఐతే హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా.. అతడు పదేళ్ల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. విచారణ ఖైదీగా కొన్నాళ్లు, ఆ తర్వాత ఖైదీ ఇంకొన్నాళ్లు.. మొత్తంగా పదేళ్ల పాటు జైల్లో ఉన్నాడు. కానీ తన శిక్ష ఏడేళ్లే అని ఎంత చెప్పినా జైలు అధికారులు వినలేదు. శిక్షను అలాగే కొనసాగిస్తూ వచ్చారు ఈ క్రమంలోనే భోలా కుమార్ అంబికాపూర్ జైలు నుంచే సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తన శిక్షా కాలం పూర్తైనా.. ఇంకా జైల్లోనే ఉంచుతున్నారని అందులో పేర్కొన్నారు. ఆయ లేఖను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ 

అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పెషల్‌ లైవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)గా స్వీకరించింది. అనంతరం భోలా కుమార్‌కు న్యాయం సహాయం చేయాలని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. తన రికార్డులన్నింటినీ సుప్రీంకోర్టులో సమర్పించాలని కోరింది. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సమాచారాన్ని సేకరించి... సుప్రీంకోర్టులో పత్రాలను సమర్పించింది. దాని ఆధారంగా కేసు విచారణ జరిగింది. హైకోర్టు భోలాకుమార్ శిక్షాకాలం తగ్గించినా.. జైలు అధికారులు దానిని అమలు చేయలేదని.. తేలింది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తన శిక్షాకాలం కంటే ఎక్కువ కాలం జైల్లో ఉన్నందున భోలా కుమార్‌కి.. రూ.

7.50 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం జైలు నుంచి భోలా కుమార్‌ని విడుదల చేశారు.

Wednesday, 13 July 2022

 

 దేశంలో ఎవరికీ లేనటువంటి బ్లడ్ గ్రూప్!


ఇలాంటి బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే పది మందికి ఉంది. అలాంటి రక్తపు గ్రూపును కలిగిన పదో వ్యక్తి మన దేశంలోనే ఉన్నాడు. అసలు ఆ బ్లడ్ గ్రూప్ ఏంటి..? అది ఎలా పనిచేస్తోందో ఇక్కడ తెలుసుకుందాం.

ఒక మనిషి సజీవంగా ఉండాలంటే శరీరంలో ఎన్నో రకాల జీవక్రియలు సమన్వయంతో జరగాలి. మన శరీరంలోని ప్రతి భాగం కూడా ముఖ్యమైనదే. దాని పని అది సక్రమంగా చేసినప్పుడు మాత్రమే.. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలడు. అందుకే ఏ ఒక్క అవయవ పనిచేలేకపోయినా.. మనం అనారోగ్యానికి గురవుతాం. మానవ దేహాన్ని దేవుడు అలా రూపొందించాడు. మానన శరీరంలో అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తం. ఊపిరితిత్తులోని గాలి నుంచి ఆక్సిజన్‌ ను సేకరించి.. శరీరంలోని అన్ని కణాలకు అందించడమే రక్తం ప్రధాన కర్తవ్యం. అంతేకాదు శరీరంలో ఉత్పత్తైన కార్భన్ డయాక్సైడ్‌ను కూడా కణాల నుంచి తొలగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఐదు లీటర్ల రక్తం అవసరం. ఐతే మనుషుల్లో అనేక రకాల రక్త సమూహాలు కనిపిస్తాయి. A, B, AB, O పాజిటివ్.. అలాగే నెగెటివ్ గ్రూప్స్ ఉంటాయి.

ఇవేవీ కాకుండా ఇంకో బ్లడ్ గ్రూప్ ఉంది. అది చాలా అరుదుగా (ఉంటుంది. అందుకే ఈ బ్లడ్ గ్రూప్ గురించి చాలా మందికి దీని గురించి తెలియదు. అదే EMM Blood Group. వివరాల్లోకెళితే..ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును భారత్‌లో పరిశోధకులు గుర్తించారు.Gujarath  రాష్ట్రంలోని రాజ్‌ కోట్‌కు చెందిని 65 ఏళ్ల వ్యక్తిలో ఈఎంఎం నెగిటివ్చెందిన రక్తపు గ్రూపును వైద్యులు కనుగొన్నారు

ఇలాంటి బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే పది మందికి ఉంది. అలాంటి రక్తపు గ్రూపును కలిగిన పదో వ్యక్తిగా గుజరాత్ వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. భారత్‌లో ఈ బ్లడ్ గ్రూపు ఈయనకు మాత్రమే ఉంది. అయితే సాధారణంగా ఏ, బీ, , ఏబీ ఇలా బ్లడ్ గ్రూపులు ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటిలోనే ఈఎంఎం నెగిటివ్ ఎంతో ప్రత్యేకమైనది.

మానవ శరీరంలో నాలుగు రకాల రక్త సమూహాలలో ఏ, బీ, , ఆర్ హెచ్ వంటి 42 రకాల వ్యవస్థలు ఉంటాయి. కానీ, ఈఎంఎంలో 375 రకాల యాంటిజెన్లు ఉంటాయి. ఇలాంటి బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులు ఇతరులకు రక్తం దానం చేయడం కానీ, ఇతరుల నుంచి రక్తం స్వీకరించే అవకాశం ఉండదని వైద్యులు తెలిపారు

అయితే గుజరాత్‌కు చెందిన ఈ వ్యక్తికి గుండె సమస్య. దీనికి సంబంధించిన సర్జరీ కోసం చేసిన రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ తరుణంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ బయట పడిందని వైద్యులు తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ ఫ్యూజన్ ఈఎంఎం నెగిటివ్ అని నామకరణం చేసింది.

ఈ బ్లడ్ గ్రూప్ సాధారణ మానవులకు భిన్నంగా చేస్తుంది. ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్‌లు ఉన్నవారు తమ రక్తాన్ని ఎవరికీ దానం చేయలేరు.. ఎవరి దగ్గరినుండి పొందలేరు. గుండెపోటుతో అహ్మదాబాద్‌లో చికిత్స పొందుతున్న 65 ఏళ్ల రోగికి గుండె శస్త్రచికిత్స కోసం రక్తం అవసరమని సూరత్‌లోని సమర్పన్ బ్లడ్ డొనేషన్ సెంటర్ వైద్యుడు సన్ముఖ్ జోషి తెలిపారు.

అయితే, అహ్మదాబాద్‌లోని ప్రథమ ల్యాబొరేటరీలో అతని రక్తం రకం కనుగొనబడకపోవడంతో, నమూనాలను సూరత్‌లోని రక్తదాన కేంద్రానికి పంపారు.పరీక్ష తర్వాత, నమూనా ఏ సమూహంతోనూ సరిపోలలేదు. దీని తరువాత వృద్ధుడితో పాటు అతని బంధువుల రక్త నమూనాలను దర్యాప్తు కోసం అమెరికాకు పంపారు. ఆ తర్వాత ఇది EMM Blood Group అని తేలింది



 ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు- కామధేనువు సేవాసమితి


వేకువజాము నుంచే సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు    నారాయణ స్వామి గారు మరియు సతీష్ గార్లఆధ్వర్యంలో ఉదయం నుంచి సనత్ నగర్, స్థానిక నెహ్రు పార్కు దగ్గర ఉన్న శ్రీ సాయి బాబా దేవాలయంలో  ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఆలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కలశాలతో అభిషేకం బాబాను దర్శించుకునేందుకు ఆలయాల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశామని ఆలయ సిబ్బంది తెలియచేసారు, కామధేనువు సేవాసమితి సభ్యులు దేవేందర్ కొన్నే, తులసి కుమార్, బాల మురళి కృష్ణ వెంకటేష్, జి. ప్రకాష్ రావు, కరుణాకర్, రవి, రమణ ..తదితరులు పాల్గొనటం జరిగింది, గత రెండు సవత్సరాలు కరోనా మహమ్మారి వలన తక్కువ సంఖ్యలో పాల్గొన్న ఈ ఏడాది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొటున్నారని తెలియ చేశారు 

గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు.



Tuesday, 12 July 2022

క్రిమినల్ కేసుల టాప్ లిస్టులో తెలంగాణ  సీఎం!

 

 

దేశంలోనే అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదైన‌ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ సీఏం కేసీఆర్ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) రిపోర్టులో ఇది వెల్లడైంది..

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, లోక్ సభ ఎంపీలు మాత్రమే ఓటర్లుగా ఉండే రాష్ట్రపతి ఎన్నికలు ఈనెల 18న జరుగనున్నాయి. ప్రతి ఎన్నికల సందర్భంలో చేసినట్లే ఇప్పుడు కూడా నేతల నేరచరితను బయటపెట్టాయి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికై, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయబోయే వారిపై న‌మోదైన కేసులుకు సంబంధించి ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ తాజాగా ఒక రిపోర్ట్ ను విడుద‌ల చేశాయి. సదరు జాబితాలో ఎక్కువ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తొలి ఐదుగురిలో తెలంగాణ సీఎం కేసీఆర్  పేరు కూడా ఉంది.. దేశంలోనే అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదైన‌ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ సీఏం కేసీఆర్ కూడా ఉన్నారు. ఏడీఆర్,  నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 37 తీవ్రమైన IPC సెక్ష‌న్లు కలిగి ఉన్నాయని వెల్ల‌డించారు. అత్యధిక క్రిమినల్ కేసులున్న టాప్ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో  కేరళ ఎంపీ డీన్ కురియకోస్ 204 కేసులతో మొద‌టి స్థానంలో ఉన్నారు. 99 పెండింగ్‌ కేసులతో (తమిళనాడు) DMK ఎంపీ ఎస్‌.కతిరవన్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఆజం ఖాన్‌ 87 కేసుల‌తో మూడో స్థానంలో ఉన్నారు. మరో  ఎమ్మెల్యే ప్రిన్స్‌ జేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో ఉండగా, 64 క్రిమినల్ కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు. ఈ నెల 18  రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేప‌థ్యంలో ఈ రెండు వాచ్ బాడీలు మొత్తం సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల 4809 అఫిడవిట్‌లలో 4759 అధ్యయనం చేశాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న మొత్తం 4759 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలలో 477 మంది అంటే 10% మాత్రమే మహిళలు ప్ర‌తినిధులు ఉండ‌డం గమనార్హం. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ పై పెండింగ్ లో ఉన్న కేసుల్లో.. 13 నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన అభియోగాలు (IPC సెక్షన్-506), ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు అడ్డుకోవ‌డం, గాయపరచడానికి ప్ర‌య‌త్నించ‌డానికి సంబంధించిన 4 అభియోగాలు (IPC సెక్షన్-332), హత్య ప్రయత్నానికి సంబంధించిన 3 అభియోగాలు (IPC సెక్షన్-307),ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా గాయపరచడానికి సంబంధించిన 3 ఆరోపణలు (IPC సెక్షన్-324), ఎవరైనా ఒక వ్యక్తి నుండి దొంగతనంగా లేదా దాడి ద్వారా లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించి దొంగతనానికి పాల్పడి, ఆ వ్యక్తికి హాని కలిగించినా లేదా అతని ప్రాణానికి హాని కలిగించినా 'స్నాచింగ్స‌ నేరాలు 3 (IPC సెక్షన్-382) ఉన్నాయి. అంతేకాదు, మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు సంబంధించిన ఆరోపణలు (IPC సెక్షన్-153A),జీవిత ఖైదు లేదా ఇతర కారాగార శిక్షతో శిక్షార్హమైన నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నించినందుకు శిక్షకు సంబంధించిన 2 ఆరోపణలు (IPC సెక్షన్-511),ప్రజా దుష్ప్రచారానికి దారితీసే స్టేట్‌మెంట్‌లకు సంబంధించిన ఆరోపణలు (IPC సెక్షన్-505),ధ్వంసం చేయడం లేదా తరలించడం మొదలైన చ‌ట్ట‌వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు సంబంధించిన 2 కేసులున్నాయి. ఇంకా

(IPC) సెక్షన్- 435),సంకల్పం, స్వీకరించే అధికారం లేదా విలువైన భద్రత (IPC సెక్షన్-477) యొక్క మోసపూరిత రద్దు, విధ్వంసం మొదలైన వాటికి సంబంధించిన 2 కేసులు, అభియోగాలకు సంబంధించిన అభియోగాలు, జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించే వాదనలు సంబందించి 1 కేసు (IPC సెక్షన్-153B)  ఉన్నాయి. అయితే ఈ కేసుల్లో చాలా వ‌ర‌కు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో న‌మోదైన కేసులు ఎక్కువ ఉన్నాయి. 

 ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం జేడీ లక్ష్మీనారాయణ..



 

2024 ఎన్నికల్లో మార్పు తెచ్చేందుకు తనవంతు పనిచేస్తున్నాను అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ  సమాజాన్ని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నానని.. రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పుడే ఎన్నికల వాతావరణం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఎవరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారని.. ముందస్తు ఎన్నికల ప్రచారం ప్రజల్లోనే ఉందని.. పార్టీల్లో కాదన్నారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలు రాజకీయ నాయకులను ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారని, ఎన్నికలు ముందుగా నిర్వహించటం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు లక్ష్మీ  నారాయణ. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రజలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయి అసలు సమస్యలు పక్కదారి పడతాయన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, రాష్ట్రాల అప్పులపై చర్చలు జరగాలన్నారు.

వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్లీనరీ తర్వాత ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీకి ఇది సరైన సమయమని.. రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్దిని గెలిపించేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ బీజేపీకి లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ (BJP)కి వైఎస్సార్‌సీపీ (YSRCP) మీద ఆధారపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు ఇది సరైన సమయమన్నారు. బీజేపీని ప్రత్యేక హోదా దిశగా ఒత్తిడి చేసి సాధించటంతో ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్యానించారు లక్ష్మీనారాయణ.

 

మేధాపాట్కర్‌పై ఐపీసీ సెక్షన్ 420 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు

 

 

మధ్యప్రదేశ్‌లో సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌పై కేసు నమోదైంది. ట్రస్ట్‌ పేరుతో వసూలు చేసిన 13 కోట్ల రూపాయలకు సరైన అకౌంట్స్‌ లేవని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 ఆదివాసీ పిల్లల చదువుల పేరుతో వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేశారని ఆమెపై ఆరోపనలు వచ్చాయని, ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు. "ఆదివాసి పిల్లల చదువుల పేరుతో వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై బర్వానీ జిల్లాలో కార్యకర్త మేధా పాట్కర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెక్షన్ 420 ఐపీసీ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది" అని బర్వానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపక్ కుమార్ శుక్లా తెలిపారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో మేధా పాట్కర్‌తో పాటు మరో 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది మహారాష్ట్రలో ఆదివాసి పిల్లలకు ప్రాథమిక విద్యను అందించేందుకు మేధా పాట్కర్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సామాజిక కార్యకర్తగా నటించి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రీతమ్ రాజ్ బడోలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆమెపై కేసు బుక్ అయింది. ఈ మేరకు పోలీసుల ప్రాథమిక విచారణలో నర్మదా నవనిర్మాణ అభియాన్ ట్రస్ట్ 14 ఏళ్లలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, అవి ఎక్కడ నుంచి వచ్చాయి, వాటి ఖర్చుల వివరాలు సరిగ్గా లేవని పోలీసులు గుర్తించారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన నగదు ఉండడమే కాకుండా, వాటి వ్యయాలకు సంబంధించి ఆడిట్ అస్పష్టంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

అయితే ట్రస్ట్‌కు చెందిన పది బ్యాంకు ఖాతాల నుంచి రూ.4 కోట్లకుపైగా రికవరీ చేసినట్టు ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. మేధా పాట్కర్ తన వార్షిక ఆదాయాన్ని రూ. 6,000గా చూపి కోర్టును తపపుదోవ పట్టించారని, ఆమె సేవింగ్స్ ఖాతా నుంచి రూ.19 లక్షల మొత్తాన్ని రికవరీ చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మేధాపాట్కర్ కొట్టిపారేశారు. పోలీసుల నుంచి తనకు ఎటువంటి అధికారిక నోటీసులు అందలేదని అన్నారు. అయితే ప్రతి ఆరోపణకు సమాధానంతో తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనపై ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్‌లతో సంబంధాలున్నాయని మేధా పాట్కర్ అన్నారు. తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అన్ని స్పష్టంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. "ఆర్థిక స్థితికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు ఆడిట్ నివేదిక అందుబాటులో ఉంది. వాస్తవానికి మేము గెలిచాం. మేము విదేశీ డబ్బును స్వీకరించం. మేం సమాధానం ఇస్తూనే ఉంటాం. సాక్ష్యాలను ముందుకు తెస్తాం." అని మేధా పాట్కర్ అన్నారు. గతంలో కూడా తాము ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నాం. నిధులకు సంబంధించి ఇప్పటికే ఆడిట్ చేశామని ఆమె అన్నారు.

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...