Monday, 19 December 2022

 బీఆర్ఎస్ నుంచి వ‌ల‌స‌లు !?

 

తెలంగాణలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అస‌మ్మ‌తి గ‌ళాలు వినిపిస్తున్నాయి. తాజాగా అధికార పార్టీ బీఆర్ఎస్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీ కావ‌డం, మంత్రి మ‌ల్లారెడ్డిపై అసంతృప్తి వ్య‌ క్తం చేయ‌డం ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ ల‌కు దారి తీస్తున్నాయి. ప‌రోక్షంగా బీజేపీకి సంకేతాలు ఇస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ స్తుతం తెలంగాణ‌లో బీఆర్ఎస్ వ‌ర్రెస్ బీజేపీగా రాజ‌కీయం సాగుతోంది. కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌ త కుమ్ములాట‌లు ఆ పార్టీని రోజురోజుకూ మ‌రింత దిగ‌జారుస్తున్నాయి.

దీంతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లో అస‌మ్మతి, అసంతృప్తి నేత‌ల‌పై బీజేపీ డేగ క‌న్ను వేసింది. ఏ మాత్రం అవ‌కాశం ఉన్నా... వారిని త‌న్నుకుపోవ‌డానికి బీజేపీ కాచుకుని వుంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే మైనంప‌ల్లి నివాసంలో కుత్బూల్లాపూర్‌, కూక‌ట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి, ఉప్ప‌ల్ ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్‌, మాధ‌వ‌రం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, బేతి సుభాష్‌రెడ్డి భేటీ కావ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వీరిలో మెజార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌ డిన వారే కావ‌డంతో, బీఆర్ఎస్‌లో నిబ‌ద్ధ‌ త‌తో వుంటార‌నుకోవ‌డం భ్ర‌మే. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌నే న‌మ్మ‌కం లేక‌పోతే... బీఆర్ఎస్‌లో ఒక్క నిమిషం కూడా ఉండ‌ర‌నే ప్ర‌ చారం జ‌రుగుతోంది. ఇవాళ్టి స‌మావేశంలో మంత్రి మ‌ల్లారెడ్డి వైఖ‌రిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు ప్ర‌ చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా ప‌ద‌వులు, అభివృద్ధి విష‌యాల్లో మంత్రి మ‌ల్లారెడ్డి ఒంటెత్తు పోక‌డ‌తో వ్య‌ వ‌హ‌రిస్తున్నార‌నేది ఎమ్మెల్యేల ఆరోప‌ణ‌.

స్థానికంగా త‌మ వాళ్లు ప‌ద‌వులు ఆశిస్తున్నార‌ని, కానీ మ‌ల్లారెడ్డి అన్నీ త‌న నియోజ‌క‌వ‌ర్గానికే తీసుకెళుతున్నార‌నే ఆరోప‌ణ ఆ ఐదుగురు ఎమ్మెల్యేల నుంచి విన‌వ‌స్తోంది. కుత్బుల్లాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి త‌న మ‌నిషికి కావాల‌ని చెప్పినా, మ‌రొక‌రికి ఇచ్చార‌ని ఎమ్మెల్యే వివేక్ ఆగ్రహంగా ఉన్నార‌ని స‌మాచారం. అలాగే త‌న‌కు తెలియ‌కుండా మిగిలిన ఎమ్మెల్యేలకు ప‌నులు చేయ‌వ‌ద్ద‌ ని క‌లెక్ట‌ ర్‌కు మంత్రి మ‌ల్లారెడ్డి చెప్పిన‌ట్టు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

త‌మ గోడును త్వ‌ ర‌లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌ యించుకున్న‌ ట్టు వారు చెప్పారు. ఇది ర‌హ‌స్య భేటీ కాద‌ని, దీనికి ప్రాధాన్యం లేద‌ని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్‌లో తాము అసంతృప్తిగా ఉన్నామ‌నే సందేశాన్ని, సంకేతాల్ని బీజేపీకి పంపిన‌ట్టు  ప్ర‌ చారం జ‌రుగుతోంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నుంచి వ‌ల‌స‌లు త‌ప్ప‌ వ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

 

Friday, 16 December 2022

 కరీంనగర్ జిల్లాలో ట్రాన్స్ జెండర్ను పెళ్లి చేసుకున్న యువకుడు

 



కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను పెళ్లి చేసుకున్నాడు. జమ్మికుంటలో నివసిస్తున్న ట్రాన్స్ జెండర్ దివ్యను.. జగిత్యాలకు చెందిన అర్షద్ అనే యువకుడు వివాహం చేసుకున్నాడు. ఇంట్లో పెద్దలు అంగీకరించకపోయినా తాము ఒకరికొకరం తోడుగా కలిసి జీవించాలని నిర్ణయించుకుని సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. 

జగిత్యాలకు చెందిన అర్షద్..వీణవంకకు చెందిన ట్రాన్స్ జెండర్ దివ్య ప్రేమలో పడ్డాడు. అర్షద్ కోసం దివ్య సర్జరీ చేయించుకున్నారు. తమ పెళ్లికి తల్లిదండ్రులు, బంధువులు సపోర్ట్ చేయకపోయినా.. అర్షద్ మాత్రం పెళ్లికి ఒప్పుకోవడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తనతో జీవితాంతం తోడుగా ఉంటానని అర్హద్ చెప్పడంతో తన ప్రేమను కాదనలేకపోయానని దివ్య చెప్పారు. ఇంట్లో సాంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకున్న తర్వాత దైవ దర్శనం కోసం ఇల్లంతకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ దర్శనానికి జంటగా వచ్చారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి పూజలు చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు

Thursday, 15 December 2022

 

మూడు సార్లు విషప్రయోగం జరిగినా బతికి బయటపడిన షానుబీ

 

 

ఎంత పకడ్బందీగా హత్య చేసినా, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో హంతకుడ్ని పట్టుకోగలుగుతున్నారు. అందుకే ఓ దుర్మార్గుడు వెరైటీగా ఆలోచించాడు. పాము కాటుతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకాన్ని సక్సెస్ ఫుల్ గానే అమలు చేశాడు కానీ ఫలితం మాత్రం రివర్స్ కొట్టింది

మధ్యప్రదేశ్ లోని మాల్యా ఖేడీ గ్రామానికి చెందిన మోజిమ్ స్మగ్లింగ్ చేసి దొరికిపోయాడు. రెండేళ్లు జైలుశిక్ష పడింది. దీంతో అతడి భార్య షాను బీ, వేరే ఊరు వెళ్లిపోయింది. జైలు నుంచి తిరిగొచ్చిన మోజిమ్, మొదటి భార్యను పట్టించుకోలేదు. హలీమా అనే అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న మొదటి భార్య పంచాయితీ పెట్టింది. దీంతో ఇద్దరితో కాపురం చేయడానికి అంగీకరించాడు మోజిమ్. అయితే రెండో భార్యకు ఇది నచ్చలేదు. దీంతో మొదటి భార్య షానుబీని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు మోజిమ్.

పాము కాటుతో హత్య..

ఎలా చంపినా పోలీసులకు దొరికిపోతాని మోజిమ్ కు బాగా తెలుసు. పైగా పోలీస్ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో అతడికి అనుభవం కూడా ఉంది. అందుకే పాములు పట్టే తన స్నేహితుడి సహాయం తీసుకున్నాడు. ఓ విష నాగును తీసుకొచ్చి మొదటి భార్య దగ్గర వదిలాడు. ప్లాన్ వర్కవుట్ అయింది. పాము గట్టిగా కాటేసింది. కానీ ఆ పాము కాటు నుంచి షానుబీ కోలుకుంది.

దీంతో రెండోసారి ఇదే ప్లాన్ ను అమలు చేశాడు. ఆశ్చర్యంగా రెండో సారి కూడా షానుబీ పాముకాటు నుంచి తప్పించుకుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను కట్టేసి, విషం ఇంజెక్షన్ ఇచ్చాడు మోజిమ్. గట్టిగా అరిచిన భార్య, తన తండ్రి సహాయంతో హాస్పిటల్ లో జాయిన్ అయి ప్రాణాలు దక్కించుకుంది.

మొదటి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో మోజిమ్ తో పాటు, మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు సార్లు విషప్రయోగం జరిగినా బతికి బయటపడిన షానుబీ, స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 

 

Wednesday, 14 December 2022

 <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

సర్కారు బడుల్లో పిల్లలకు ఏది రక్షణ-- మురళి ఆకునూరి

 రిటైర్డ్ ఐ .. ఎస్

 

రంగారెడ్డి జిల్లా చౌదరి గూడ మండలం పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో

3వ తరగతి విద్యార్థిని పాము కాటు గురైన సంఘటన కలకలం రేపింది. టాయిలెట్ కు వెళ్లిన

విద్యార్థినిని పాము మూడు కాట్లు వేసింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు, విద్యార్థుల

తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.  ఆ పాఠశాలలో అపరిశుభ్ర

వాతావరణం,  టాయిలెట్లు చెత్తతో నిండిపోయాయని అంటున్నారు. టాయిలె

ట్లు దుర్గంధం, దుర్వాసన కొడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చికిత్స

కోసం విద్యార్థిని అక్షితను  ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు పామును కొట్టిచంపారు.

ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలంటే భయంగా ఉందని తల్లిదండ్రులు

అంటున్నారు.

 

ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థిని పాము కాటుకు గురైంది.  దీంతో తోటి విద్యార్థులు

భయాందోళన చెందుతున్నారు. పాఠశాలలో అపరిశుభ్ర పరిసరాల కారణంగా ఇలాంటి

ఘటనలు తరచూ జరుగుతున్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల

పరిసరాలు, మరుగుదొడ్లు చెత్త చెదరంతో నిండి పోయాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

బడులల్ల పాములు కరుస్తయి ఆస్పత్రులల్ల ఎలుకలు కరుస్తయి హాస్టళ్ల అన్నం లో

పురుగులు సాంబార్ల బల్లులు బడులల్ల ఆడపిల్లలకు మరుగుదొడ్లు కరువు

రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు కౌలు రైతులకు మొండి చెయ్యి

పోలీస్ స్టేషన్లల్ల /ప్రభుత్వ ఆఫీసులల్ల లంచాలు ఇగ ఈయన దేశాన్ని ఎలగ

పెడతాడట


 

ధైర్యాన్నిమూటకట్టి, తుపాకీని చేతబట్టి ప్రాణాలను పణంగా పేట్టే, ఓ సైనిక వందనం!  

గవర్నర్ తమిళసై..!!

 

భారత్ చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దు దాటాలని 300 మంది చైనా సైనికులు మరణ ఆయుధాలతో.

ప్రయత్నాలు చేయగా 100 మంది భారత సైనికులు తరిమికొట్టారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతోంది.

ఇక ఇదే సమయంలో పార్లమెంటు సమావేశాలలో చైనా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలియజేశారు.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై దేశ సరిహద్దుల వద్ద చైనా కవ్వింపు చర్యలకు భారత్ సైనికులు తరిమి కొట్టడాన్ని ప్రశంసించారు.భారత్ సైనికుల సాహసాలు, సేవలు వెలకట్టలేనివి అని కొనియాడారు.సమాజంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే సరిహద్దుల వద్ద సైనికులు చేస్తున్న త్యాగాలే అందుకు ముఖ్య కారణం అని అన్నారు.

సికింద్రాబాద్ లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్నాతకోత్సవంలో పాల్గొన్న సమయంలో తమిళసై ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

 <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

 

 మానవత్వం వికసిస్తుంది మంచితనం పరిమళిస్తుంది 



అవును, మూగజీవాలు ఒకదానికొకటి సాయం చేసుకున్నప్పుడు చూడటానికి మన రెండు కళ్ళు చాలవు.

తాజాగా అలాంటి ఘటనకు సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది.

దాంతో దానిని నెటిజన్లు తేరిపారా చేస్తున్నారు.ఇక్కడ ఒక కోతి జింకకు తినేందుకు ఆకులు అందిస్తూ సాయం చేస్తున్న వీడియోని గమనించవచ్చు.

IFS అధికారి సుశాంత నంద కోతి, జింక స్నేహాన్ని తెలిపే వీడియోని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.ఇక ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, ఒక కోతి.

జింకకు అందని చెట్టు ఆకులను తినేందుకు సహకరిస్తోంది.ఈ అద్భుతమైన ఈ వీడియోలో రెండు జింకలు చెట్టు కింద నిలబడి, ఆకులను తినడానికి యత్నిస్తుండటం మనం చూడవచ్చు

కాగా ఆ చెట్టుయొక్క కొమ్మ బాగా ఎత్తులో ఉండడంతో జింకలు తినలేకపోతున్నాయి.వాటి ఇబ్బందిని గమనించి ఓ కోతి.కొమ్మపై కూర్చొని దాన్ని కిందకు వంగేలా వాటికి సాయం చేస్తుంది.దీంతో కింద ఉన్న రెండు జింకలకు కొమ్మలు అందడంతో.హాయిగా ఆ ఆకులు ఆరగిస్తున్నాయి.కాగా ఈ వీడియోలో కోతి, జింకలకు గల స్నేహం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

ఇక వీటిని చూసిన నెటిజన్లు ఇలాంటి గుణం కలిగిన జంతువులు మనుషుల కంటే వందరెట్లు నయం అని చెబుతున్నారు.కాగా ఈ వీడియో ఇప్పటి వరకు 55 వేలకు పైగా వ్యూస్ ను సాధించడం విశేషం..మీరు ఓ లుక్కేయండి 

 <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

 

 

చత్రపతి శివాజీ రుద్ర యాగం చేసిన గ్రహ ముక్తేశ్వర్ దేవాలయం

 



ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో ఉంది.ఈ దేవాలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అడవిలో కళ్యాణ్ ఈశ్వర మహాదేవ దేవాలయం ఉంది.ఈ దేవాలయం పురాణాలు అద్భుతాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెంది ఉంది.ఈ దేవాలయ శక్తి చత్రపతి శివాజీ జీవితంపై కూడా ప్రభావం చూపింది అని అక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు.

మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఆ దేవాలయాలలో ప్రతిరోజు ప్రజలు వెళ్లి పూజలు, అభిషేకాలు, హోమాలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.భారతదేశంలో ఉన్న ఎన్నో దేవాలయాలలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి.

మనిషి టెక్నాలజీ లో ఎంతో ముందుకు వెళుతున్న దేవాలయాలలోని కొన్ని రహస్యాలను ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు.అలాంటి దేవాలయాలలో ఒకటైన గ్రహ ముక్తేశ్వర్ దేవాలయం కూడా ఒకటి.

శివాజీ ఇక్కడ రుద్ర యాగాన్ని చేసినట్లు చరిత్రలో ఉంది.గంగానది ఒడ్డున ఉన్న ఈ శివలింగం ప్రపంచవ్యాప్తంగా మరో అద్భుతం అని చెప్పవచ్చు.ఈ దేవాలయంలో ప్రతిష్టించిన శివలింగానికి సమర్పించిన నీరు, పాలు ఎవరికీ కనబడకుండా అదృశ్య మవుతున్నాయని చెబుతూ ఉంటారు.ఈ నీరు, పాలు ఎక్కడికి వెళ్తాయో ఇప్పటి వరకు ఎవరికీ కూడా తెలియదు.

ఈ ఆలయ రహస్యం తెలుసుకోవడానికి ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు జరిగిన నేటికీ ఆ మిస్టరీ హిస్టరీగానే మిగిలిపోయి ఉంది.

కళ్యాణేశ్వర మహదేవ్ దేవాలయం గురించి అనేక పౌరాణిక సంఘటనలు వార్తల్లో ఉన్నాయి.ఒక పురాణం ప్రకారం ఒక నల మహారాజు ఇక్కడ శివలింగానికి జలభిషేకం చేసినప్పుడు అతని కళ్ళ ముందు శివలింగంపై ఎంత నీరు పోసినా అంత నీరు అకస్మాత్తుగా భూమిలో కలిసిపోవడం చూశాడు.అది చూసిన రాజు శివలింగంపై ఎన్నో వేల కొద్దికుండలతో గంగాజలాన్ని పోసిన ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో కనిపెట్టలేకపోయాడు.

అలా అభిషేకం చేసి అలసిపోయిన రాజు అది శివుని మహిమ అని అర్థం చేసుకొని క్షమాపణ చెప్పి తన దేశానికి వెళ్లిపోయాడు.

 

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...