Monday, 15 August 2022

 ఒక్క పొలిసు కేసు కూడా లేని గ్రామం

                                    ఆ కేసును కూడా కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. 


ఈరోజుల్లో పోలీసు కేసు అనేది చాలా సర్వసాధారణమైంది. చీటికిమాటికి కూడా కేసులు పెట్టుకుండే కాలంలో ఆ ఊర్లో ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదంట. నమ్మరా..? ఒక కేసు అయిందిలే అది కూడా రాజీ అయిపోంది అనుకోండి. ఇప్పుడయితే ఒక్క కేసు కూడా లేని గ్రామంగా ఆ ఊరు రికార్డులోకి ఎక్కింది. ఆ ఊరి చరిత్ర తెలుసుకున్న జడ్జి నేరుగా ఆ ఊరికే వెళ్లి అక్కడి గ్రామ పెద్దతో పాటు.. గ్రామస్తులు అందర్నీ అభినందించారు.

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఒక్క కేసు

 కూడా లేని గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ మాటలను నేరుగా కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు.

 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆ గ్రామానికి వచ్చిన ఆమె జాతీయ జెండా ఆవిష్కరించారు. కేసులు లేని

 గ్రామంగా ర్యాగట్లపల్లి నిలిచిందని అభినందించారు.


గ్రామానికి చెందిన ఏకైన కేసుకు సంబంధించి ఇరువర్గాల వారు రాజీపడటంతో.. ఆ కేసును కూడా

 కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. రోడ్డు ప్రమాదం కేసులో ఇరువర్గాలు రాజీపడి తమకు తామే తీర్పు

 ఇచ్చుకోవడం సంతోషకరమన్నారు. దీన్ని రికార్డులో నమోదు చేసి భద్రపరుస్తామన్నారు. 40 ఏళ్లుగా గ్రామంలో

 ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తున్న గ్రామ పెద్ద నాగన్నగారి సిద్ధరాంరెడ్డిని జడ్జి ఈ సందర్భంగా

 సన్మానించారు.

 

 

      యువ కళాకారుడి  ప్రతిభ.

 

ప్రతి ఒక్కరిలో దేశభక్తి పొంగిపొర్లింది.  స్వాతంత్ర్య సమర యోధుల జీవితాలను గుర్తుకు చేసుకుంటూ.. సలామ్ చేశాం.  భారత దేశ గొప్పతనం ప్రపంచ నలుమూలలా తెలిసేలా సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకుంటున్నాం. పూర్ణ స్వరాజ్యం కల నెరవేరి 75 ఏళ్లు కావొస్తుంది. దీనికి గుర్తింపుగా `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` జరుపుకున్నాం. హర్ ఘర్ మే తిరంగా వెలిగిపోయింది. ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు.

భారతదేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని  ఎర్రకోటపై ప్రధాన మంత్రి  జాతీయ జండాను ఆవిష్కరించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మువ్వన్నెలు రెప రెపలు మిరమిట్లు గొలుపుతున్నాయి. కళాకారులు అయితే ఎవరికి తోచిన రీతిలో వారు తమ ప్రతిభను చూపెడుతూ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువ కళాకారుడు చేసిన ప్రయత్నం అందరి మన్ననలు అందుకునే లా చేస్తోంది. కేవలం ఉప్పుతో గ్లోబ్ పై భారత మాత బొమ్మ గీసి.. రంగులద్దాడు.. ఈ చిత్ర చూసినవారంతా ఆ కళాకారుడి ప్రతిభకు సలామ్ అంటున్నారు.

ఇలాంటి బొమ్మలు గీయడం అతడికి ఇదే తొలిసారి కాదు.. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు. చిత్తూరు జిల్లాలోని కుప్పానిక ిచెందిన ఈ కళాకారుడు.. పూరి  ఆర్ట్స్ పేరుతో.. సమాజాన్ని చైతన్య పరిచేలా ఆయన పెయింట్స్ ఉంటున్నాయి. ఇటీవల ఉప్పుతోనే తిరుమల వెంకటేశ్వరుడి బొమ్మ గీసి.. దానికి రంగులు అద్ది.. గోవిందుడి రూపాన్ని ఆవిష్కరించారు.. అతడు గీసిని శ్రీనివాసుడి

 ముఖ చిత్రం అద్భుతంగా ఉంది. పూరి ఆర్ట్స్ పేరుతో యువకుడు పలు చిత్రాలు రూపొందిస్తూ..

 పలువురి మన్ననలు పొందుతున్నాడు. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ తో సత్తా చాటిన పీవీ సింధు బొమ్మను సైతం అట్టముక్కలతో అద్భుతంగా రూపొందించాడు. భారత దేశానికి సంబంధించి ఏ ఘనత వెలుగులోకి వచ్చినా... వెంటనే తన మైండ్ కు పదును పెట్టి.. అద్భుతాలు చేస్తున్నాడు మన పెయింటర్.. గతంలోనూ పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

అవినీతి రహిత సమాజం రావాల్సిన అవసరం ఉంది

 యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ కేంద్ర కార్యాల‌యంలో స్వతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర జెండా ఆవిష్క‌ర‌ణ చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ ఎంతోమంది వీరులు, మ‌హానీయుల త్యాగ‌ఫ‌లిత‌మే 75 సంవ‌త్స‌రాల స్వ‌తంత్య్ర భార‌తావ‌నికి ప్ర‌ధాన కార‌ణ‌మన్నారు. నేటి త‌రం యువ‌త వారి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు. అవినీతి ర‌హిత స‌మాజం కోసం యూత్ ప‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ వినూత్న కార్య‌క్ర‌మాలు చేస్తుంద‌ని, అందులో భాగంగానే నిజాయితీప‌రుల‌కు అండ‌గా ఉండేందుకు ముంద‌డుగు ప్రారంభించింద‌న్నారు. మంచి స‌మాజం కోసం వినూత్న కార్య‌క్ర‌మాల‌తో యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ ముందడుగు వేస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సీనియ‌ర్ నాయ‌కులు కొన్నె దేవేంద‌ర్‌, కానుగంటి రాజు, కొమ‌టి ర‌మేష్‌బాబు, మూడావ‌త్ ర‌మేష్‌నాయ‌క్‌, జి. హ‌రిప్ర‌కాశ్‌, అంజుక‌ర్‌, సాయి, నాగేంద్ర‌, న‌రేష్‌, స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.



Sunday, 14 August 2022

హనుమాన్ దేవాలయంలో తీరంగా ర్యాలీ

 బ్రిటీష్ తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ వేడుకల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘ఆజాది కి అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, సనత్ నగర్ లోని స్థానిక హనుమాన్ దేవాలయంలో, అర్చకలు మరియు దేవాలయ సిబ్బంది తీరంగా ర్యాలీ ఏర్పాటు చేయటం జరిగింది.



Tuesday, 9 August 2022

 

                 పూర్వ విద్యార్థుల    ఆత్మీయ కలయిక

 


స్నేహమంటే విలువైనది,  అపురూపమైనది,  అమర మైనది. కానీ  ప్రతీ అంచుకు రెండు కోణాలు ఉన్నట్లే , మంచి,  చెడు అనే  గుణాలకి  స్నేహం కూడా ఏమీ అతీతం కాదు.  మంచి స్నేహం ఎప్పుడూ నీడలా వెన్నంటి ఉంటుంది..... ఆపదలో ఆసరా అవుతుంది...... సంతోషానికి సంబరం అవుతుంది.....బాధకు  భరోసా ఇస్తుంది..... ప్రతిభకు గుర్తింపు ఇస్తుంది...... పిలవకపోయినా నేనున్నా అంటుంది.  మంచి స్నేహానికి ఒక బలమైన,  విచిత్రమైన,  విపరీతమైన స్వార్థం ఉంటుంది.  ఆ స్వార్థం పేరు ఏంటంటే " సంతోషం " . సంతోషాన్ని స్నేహితులతో  పంచుకోవాలనే ఒక ఆరాటం.... అంతకుమించి స్వచ్ఛమైన మంచి  స్నేహం లో ఏ రకమైన స్వార్థం ఉండదు.• మంచి స్నేహం... ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా, సాటి స్నేహితుడి యొక్క ఉన్నత తత్వాన్ని, అభ్యున్నతిని  మాత్రమే కోరుకుంటుంది.  అదేవిధంగా స్నేహితుడి యొక్క నిమ్నతత్వాన్ని  సరి చేయడానికి ప్రయత్నిస్తుంది  స్నేహానికి   అర్థం చేసుకునే గుణం ,  సహాయపడే తత్వం భగవంతుడు సహజంగానే ప్రసాదిస్తాడు . మంచి..... వేగంగా నడవలేదు,  త్వరగా ఆకట్టుకోలేదు కానీ ఎప్పటికీ స్థిరత్వమే దాని గమ్యం.

 • స్నేహితులారా……మంచిని ప్రోత్సహిద్దాం....... మంచి స్నేహితులుగా ఉందాం.......... నిజం లో బ్రతుకుతూ ఆనందంగా ఉందాం. ఎందుకంటే మిగిలిన జీవితానికి కావలసింది ఆనందం. ఆనందంగా ఉంటేనే మనం బాగుంటాం......మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది...... మన కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది..... సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది.

 స్నేహితుల దినోత్సవ సందర్భంగా . 1996-97 పదవతరగతిలో గీతా విజ్ఞాన మందిర్ లో చదివిన మిత్రులు హైదరాబాద్ కొత్త పేట లో కలిసి వారి వారి అనుభూతులను, వారి జీవితాల్లో జరిగిన అపూర్వ సంఘటనలను పంచుకున్నారు , ఇందులో మురళి, నాగరాజ్ , వినీత్, రాజేష్, నరేష్ , ప్రదీప్,  శంకర్, పురేందర్, ఆజాద్ , నరేందర్(ఎస్ ఐ) రమేష్, శ్రీకాంత్, రంజిత్ పాల్గొన్నారు   

Monday, 8 August 2022

 

        స్వర్ణం సింధూ!

 


 

కామ‌న్వెల్త్ గేమ్స్- 2022లో భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు బంగారు ప‌త‌కం సొంతం చేసుకుంది. 

కెన‌డా షట్ల‌ర్ లీపై పీవీ సింధు విజ‌యం సాధించింది. మ‌హిళ‌ల బ్యాడ్మింట‌న్ సింగిల్స్ ఈవెంట్ లో పీవీ సింధు కామ‌న్వెల్త్ గేమ్స్ లో ఛాంపియ‌న్ గా నిల‌వ‌డం ఇదే తొలిసారి. కామ‌న్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింట‌న్ ఈవెంట్ లో భార‌త్ కు ఇదే తొలి బంగారు ప‌త‌కం కావ‌డం విశేషం.

బ‌ర్మింగ్ హామ్ వేదిక‌గా సోమ‌వారం జ‌రిగిన ఫైన‌ల్ కెన‌డా షట్ల‌ర్ మిచెల్లీ లీని సింధు మ‌ట్టిక‌రిపించింది. మొద‌టి నుండి అధిప‌త్యం క‌న‌బ‌రుత‌స్తూ (21-15, 21-13) ప్ర‌త్య‌ర్థిపై ఘ‌న‌విజ‌యం సాధించి విజేత‌గా నిలిచింది.

2014లో జ‌రిగిన కామ‌న్ వెల్త్ గేమ్స్ లో కాంస్యం, 2018లో ర‌జత ప‌త‌కాలు గెలిచిన చివ‌రికి ఈసారి స్వ‌ర్ణం గెలిచి త‌న ఖాతాలో స‌రికోత్త రికార్డ్ నెల‌కొల్పింది

 

 

 

తెలంగాణ‌లో ఓ రేంజ్‌లో రాజ‌కీయ వేడి ర‌గ‌ల‌నుంది.

 



ఉప ఎన్నిక‌కు టీఆర్ఎస్ సై అంటోంది. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఉప ఎన్నిక ఫ‌లితం ఏ మాత్రం వ్యతిరేకంగా ఉన్నా  ఉన్నా అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్రభావం  ప‌డ‌నుంది. ఇదే సంద‌ర్భంలో ఈ ఉప ఎన్నికను రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేలా మ‌లుచుకోవాల‌ని టీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా  అడుగులు వేస్తోంది. గ‌తంలో హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలు కావ‌డం టీఆర్ఎస్‌కు గుణ‌పాఠం నేర్పింది.

దీంతో ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి టీఆర్ఎస్ కావాల్సిన‌న్ని పాఠాలు నేర్చుకుంది. మునుగోడు ఉప ఎన్నిక‌లో మాత్రం ఓట‌మి పున‌రావృతం కాకూడ‌ద‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీని చావు దెబ్బ‌తీసి, రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌శంఖం పూరించ‌డానికి టీఆర్ఎస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డ‌నుంది.

ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డ‌మే ఆల‌స్యం, వెంట‌నే స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి ఆమోదించారు. ఇంత వేగంగా రాజీనామాను ఆమోదించ‌డం ద్వారా .... ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మ‌నే సంకేతాల్ని టీఆర్ఎస్ పంపింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామాపై కాల‌యాప‌న చేసి, అన‌వ‌స‌ర చ‌ర్చ‌కు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని టీఆర్ఎస్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌కు టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌త్య‌ర్థుల‌కు రాజీనామా ఆమోదంతో హెచ్చ‌రిక పంపింది. ఇక ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌నే ఆల‌స్యం. త‌ల‌ప‌డేందుకు టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు చివ‌రి ఉప ఎన్నిక కానుండ‌డంతో తెలంగాణ‌లో ఓ రేంజ్‌లో రాజ‌కీయ వేడి ర‌గ‌ల‌నుంది.

 

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...