Tuesday, 1 November 2022

 

సీనియ‌ర్ హీరోయిన్,  రంభ కారుకు ప్రమాదం



సీనియ‌ర్ హీరోయిన్, అంద‌గ‌త్తె రంభ కారుకు ప్ర‌మాదం జ‌రిగింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. రంభ కుటుంబం కెన‌డాలో వుంటోంది. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ చిత్రాల్లో రంభ న‌టించి ప్రేక్ష‌కుల్ని మెప్పించారు.

కెన‌డాలో స్థిర‌ప‌డిన ఇంద్ర‌కుమార్‌ను రంభ‌ పెళ్లి చేసుకున్నారు. రంభ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇదిలా వుండ‌గా త‌న కారుకు ప్ర‌మాదం జ‌రిగిన విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. పిల్ల‌ల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండ‌గా మ‌రో కారు వ‌చ్చి ఢీకొట్టిన‌ట్టు ఆమె తెలిపారు. ఆ స‌మ‌యంలో కారులో త‌న‌తో పాటు పిల్ల‌లు, ఆయా ఉన్నార‌ని ఆమె వెల్ల‌డించారు. చిన్న‌చిన్న గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డామ‌న్నారు.  ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవ‌డంతో ప్ర‌మాద తీవ్ర‌వ త‌గ్గింద‌ని స‌మాచారం.  

కూతురు సాషాకు స్వ‌ల్ప గాయాలు కావ‌డంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు రంభ వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించి ఫొటోల‌ను ఆమె షేర్ చేశారు. అలాగే దెబ్బ‌తిన్న కారు ఫొటోల‌ను కూడా అభిమానుల‌తో పంచుకున్నారామె. బ్యాడ్ టైమ్ న‌డుస్తోంద‌ని ఆమె వాపోయారు. త‌మ కోసం ప్రార్థ‌న‌లు చేయాల‌ని అభిమానుల్ని వేడుకున్నారు. 

 

Tuesday, 18 October 2022

 

హైదరాబాద్ లో దారుణం..4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి!




హైదరాబాద్ నగరంలో DAV  స్కూల్ లో ప్రిన్సిపాల్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న రజిని కుమార్ అనే దుర్మార్గుడు స్కూల్ లో ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్ లోకి వెళ్లి గత రెండునెలలుగా   ఎల్కేజీ చదువుతున్న విద్యార్థిని (4) పై లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు బాధితురాలి బంధువులు తెలిపారు. ఈ మధ్య కాలంలో పాపా ప్రవర్తన లో తేడా గమనించి తల్లి తండ్రులు ఆరా తీయగా దారుణం వెలుగు వెలుగుచూసింది. ఇలాంటి దుర్మార్గులను వెంటనే కఠినంగా శిక్షించాలని తల్లితండ్రులు కోరుతున్నారు

Friday, 14 October 2022

 

ప్రొ.​ సాయిబాబా నిర్దోషి!

యూఏపీఏ ను రద్దు చేయాలని డిమాండ్!

 


 

మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్  తీర్పు నిచ్చింది. 

ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయన్ను వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు.

తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జీఎన్ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచార‌ణ చేప్ప‌టి నిర్దోషిలుగా ప్ర‌క‌టించింది. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌లో ఉన్న జీఎన్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు?

దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు. 2017 మార్చిలో యూఏపీఏ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆయనను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో నిర్బంధించారు.

వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. 2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

 

దీనిపై డా తోట శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ..

సాయిబాబాపై మోపిన అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)ను రద్దు చేయాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీ ఎమ్మెల్యే సుప్రియా సూలే, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు గతంలో డిమాండ్ చేశారు.

''పౌర హక్కులు, ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిపై ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి''అని హేమంత్ సోరెన్ అప్పట్లో వ్యాఖ్యానించారు.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

Tuesday, 11 October 2022

 

తెలంగాణ తొలి గ్రూప్-1 పరీక్ష--

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ నెల 16న నిర్వహించనున్న మొదటి గ్రూప్ 1 పరీక్షకు అధికారులు అన్ని

 ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 503 ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న ఈ పరీక్షకు 3,80,202 లక్షల మంది

 అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇంత భారీనియామకాలు జరుగుతున్నఈ తరుణంలో ఎలాంటి

 అవకతవకలు జరగకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అనేక కొత్త

 నిబంధనలను సైతం తీసుకువచ్చారు. తొలిసారిగా గ్రూప్-1 నిర్వహణలో పరీక్షా కేంద్రాల్లో సీసీ

 కెమెరాలను ఏర్పాటు చేస్తోంది పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఈ సీసీ కెమెరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్

 ప్రధాన కార్యాలయానికి.. ఇంకా పోలీస్ కమాండ్ కంట్రోల్ కు సైతం అనుసంధానం చేయనున్నారు.

 బయో మెట్రిక్ విధానాన్ని సైతం తొలిసారిగా తీసుకువస్తోంది టీఎస్పీఎస్సీ

అభ్యర్థులు హాల్ టికెట్ ఉంటేనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడుతారు. ఇంకా హాల్ టికెట్ తో పాటు పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్ , ప్రభుత్వ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లో ఏదో ఒకటి గుర్తింపు కార్డుగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

-హాల్ టికెట్ మీద ఫొటో, సిగ్నేచర్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఇందుకోసం హాల్ టికెట్ ను A4 షీట్ పైన ప్రింట్ తీసుకోవాలి. లేజర్ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచించారు. కలర్ ప్రింట్ అయితే ఇంకా బెటర్.

-ఒకవేళ హాల్ టికెట్ పై ఫొటో/సిగ్నేచర్ స్పష్టంగా కనిపించకపోతే అభ్యర్థులు 3 పాస్ పోర్ట్ ఫొటోలు వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ఫొటోలను గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్ట్ చేయించాల్సి ఉంటుంది. వీటితో పాటు అండర్ టేకింగ్ ను సైతం ఇన్విజిలేటర్ కు అందించాల్సి ఉంటుంది. పరీక్ష 10.30 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అభ్యర్థులను రెండు గంటల ముందు నుంచే అంటే 8.30 గంటల నుంచే ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించనున్నారు. పరీక్షా కేంద్రం గేట్ ను 10.15 గంటల నుంచే మూయనున్నారు. ఒక్క సారి గేట్ మూస్తే పరీక్ష ముగిసే వరకు తెరిచేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు.

- క్యాలుకులేటర్స్, మాథ్స్ టేబుల్స్, లాగ్ బుక్స్, పేపర్స్, సెల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాంగ్స్, రైటింగ్ ప్యాడ్స్, చార్ట్స్ లాంటివి ఏవీ ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించరు

బూట్లు వేసుకుని ఎగ్జామ్ కు రావొద్దు. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని టీఎస్సీఎస్సీ స్పష్టం చేసింది.

- ఎగ్జామ్ సెంటర్ వద్ద మీ వస్తువులను దాచడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవు.

-ఎగ్జామ్ సెంటర్ వద్ద అభ్యర్థుల థంబ్ ప్రింట్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మెహందీ, ఇంక్, టాటూలు వేసుకోవద్దని టీఎస్పీఎస్సీ సూచించింది.

- హాజరైన అభ్యర్థితో అభ్యర్థి హాల్ టికెట్ పై ఉన్న ఫొటో తో వెంట తీసుకువచ్చిన ఐడెంటిటీ కార్డుపై ఉన్న ఫొటోను చెక్ చేస్తారు. తప్పు అని తేలితే చర్యలు ఉంటాయి.

- ఓఎంఆర్ షీట్ పై హాల్ టికెట్ నంబర్, టెస్ట్ బుక్ లెట్ నంబర్, వెన్యూ కోడ్ ను నమోదు చేయడానికి అభ్యర్థి బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇంక్ పెన్ ను వాడినా.. సూచించిన ప్రదేశాల్లో కాకుండా.. ఇతర చోట పెన్ తో ఏమైనా రాసినా ఓఎంఆర్ షీట్ ను ఇన్వాలిడ్ గా పరిగణిస్తారు.

 

 

Monday, 3 October 2022

 

ముదురుతున్న మునుగోడు రాజకీయం

 


రాజ‌కీయం తెలంగాణ కేంద్రంగా ప‌రిభ్ర‌మిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక‌, టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ (భార‌తీయ రాష్ట్ర స‌మితి) అనే జాతీయ పార్టీ ఆవిర్భావం త‌దిత‌ర కీల‌క ఘ‌ట్టాల‌న్నీ ఆ రాష్ట్రంలోనే చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 5న ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు. ఇందుకు చ‌క‌చ‌కా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

ఇదే సంద‌ర్భంలో మునుగోడు ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ వ‌చ్చింది. దీంతో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్క‌నుంది. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావ‌డంతో టీబీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌ను వాయిదా వేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌ను టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. అయితే పోటీ మాత్రం టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య భీక‌రంగా వుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వ‌చ్చే ఏడాదిలో తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బ‌హుశా తెలంగాణ‌లో ఇదే చివ‌రి ఉప ఎన్నిక కావ‌చ్చు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చేదిగా ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణ‌లో ఎలాగైనా అధికారాన్ని ద‌క్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో బీజేపీ వుంది. అందుకే ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని, ఆయ‌న‌తో రాజీనామా చేయించి, వ్యూహాత్మ‌కంగా ఉప ఎన్నిక వ‌చ్చేలా బీజేపీ చేసింది.

దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గెలుపును స్ఫూర్తిగా తీసుకుని మునుగోడులో టీఆర్ఎస్‌ను మ‌ట్టి క‌రిపించాల‌ని బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. మునుగోడులో విజ‌యం సాధించి తెలంగాణ‌లో అధికారం త‌మ‌దే అనే సంకేతాల్ని ఇవ్వాల‌ని బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. మ‌రోవైపు టీఆర్ఎస్ గెలిచి త‌న ప‌ట్టు నిలుపుకోవాల‌ని చూస్తోంది. అందుకే ఈ ఉప ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌ని చెప్ప‌డం.

కేసీఆర్ జాతీయ పార్టీ క‌ల‌లు కంటున్న త‌రుణంలో ఆదిలోనే దెబ్బ కొట్టాల‌ని బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక‌ను సీరియ‌స్‌గా తీసుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నిక‌, కేసీఆర్ జాతీయ పార్టీ చుట్టూ తెలంగాణ రాజ‌కీయాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా ఆస‌క్తిగా చూస్తోంది. 

 

Thursday, 29 September 2022

 

దేశ ఆర్థిక వ్యవస్థ రైతు పట్టుకునే నాగలి కర్రులోనే ఉంది---- యువ శక్తి యూత్



కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివాలయం దగ్గర దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా ఈరోజు అన్నపూర్ణ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు, అన్నపూర్ణ  అవతారం అంటేనే అందరికి అన్నం పెట్టె శక్తి,  . రైతే దేశానికి రాజు రైతే దేశానికి వెన్నుముక అని భావించి స్థానికంగా ఉన్న  యువ శక్తి యూత్. రైతులను సన్మానించిన  సన్మానించటం జరిగింది. యూత్ ప్రసిడెంట్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ రైతు పట్టుకునే నాగలి కర్రులోనే ఉందని... రైతు లేనిదే రాజ్యం లేదని యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపితే నూతన పద్ధతిలో వ్యవసాయం చేపట్టి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రంమలో గ్రామ పెద్దలు, భక్తులు మరియు కమిటీ సభ్యులు  గ్యారెపల్లి ఆనంద్పిట్టల కృష్ణ రైతులను మరియు ఇళ్ళంతకుంట మండలానికి చెందిన ఏ ఈ ఓ రాకేష్ ను సన్మానించారు. ఈ సందర్భంగా యువ శక్తి యూత్ రాజేష్, నాగేష్, సతీష్ లు మాట్లాడుతూ రైతులను గుర్తించి వారిని అభినందించడం చాలా సంతోషం గా వుంది అని అన్నారు

 

అసంబ్లీ రద్దు జాతీయ పార్టీ ముద్దు .... వ్యూహం మార్చిన గులాబీ దళపతి

 


పాతసీసాలో కొత్త సారాఅనేది చాలా పాపులర్ సామెత. ప్రస్తుతం కేసీఆర్ ప్లాన్ చేస్తున్న జాతీయ పార్టీ వ్యవహారం కూడా అచ్చంగా అలాగే కనిపిస్తోంది. ఆయన అచ్చంగా కొత్త పార్టీ పెట్టబోవడం లేదు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికే కొత్తగా జాతీయ పార్టీ రూపం ఇవ్వబోతున్నారు. కాకపోతే.. తెలంగాణఅనే పేరు తగిలించుకుని పుట్టిన పార్టీకి జాతీయ రూపం అంటే జనం నవ్వుతారు గనుక.. పార్టీ పేరు మార్చి.. కొత్తగా చెలామణీలోకి తేవాలనేది ఆయన ఆలోచనగా వినిపిస్తోంది. ఈ సంగతే ఆయన అంటున్నట్టుగా దసరా నాటికి ప్రకటిస్తారనేది సమాచారం. 

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం తథ్యం అని ప్రకటించిన తర్వాత.. భారత రాష్ట్ర సమితి పేరుతో ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని చాలా ప్రచారం జరిగింది. ఆ పార్టీ జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతుందని అన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ.. దేశంలోని బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీన్నిటినీ ఒక గొడుగు కిందకు తేవడమే లక్ష్యంగా తన అడుగులు ప్రారంభించిన కేసీఆర్.. ఆలోచనను జాతీయ పార్టీగా తన పార్టీనే దేశమంతా విస్తరించేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి అనేది తెరాసకే కొత్త పేరు కాబోతున్నదని సమాచారం. 

జాతీయ పార్టీగా రూపుదాలిస్తే.. తెలంగాణేతర ప్రాంతాల్లో కూడా పోటీచేయాలి. తెలంగాణ తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న కొన్ని ప్రాంతాల్లో పోటీకి కేసీఆర్ ఇప్పటికే ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఆ అడుగులు ఎలా పడబోతున్నాయి? ఇతర రాష్ట్రాల్లో ఆయన సొంతంగా పోటీచేయగల సీట్లు ఎన్ని? ఏ రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకుని.. అక్కడి పార్టీలనుంచి సీట్లు పొందగల స్థితిలో ఉన్నారు? ఇవన్నీ ప్రశ్నలే.

కేసీఆర్ కు ఇంకో పెద్ద సమస్య ఉంది. ఆయన ఇప్పటిదాకా కలిసిన పార్టీల వారందరూ కూడా.. కాంగ్రెస్ కూడా ఉండవలసిన కూటమినే ఇప్పుడు అభిలషిస్తున్నారు. తద్వారా బిజెపి వ్యతిరేక ఓటు ఏమాత్రం చీలకూడదని అంటున్నారు. మరి కాంగ్రెస్ తో జట్టుకట్టే రాజకీయాలు కేసీఆర్ కు లోకల్ గా రాష్ట్రంలో చేటు చేస్తాయి కదా అనేది ఒక సందేహం. అలాంటప్పుడు కేసీఆర్ చిన్న డ్రామా నడిపించాల్సి వస్తుంది. 

తన పాత పార్టీకి కొత్త పేరును తగిలించిన తర్వాత.. అసెంబ్లీని రద్దు చేసి.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి నెగ్గాలి. ఆ తర్వాత పార్లమెంటుకు జరిగే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ కూడా ఉండే కూటమితో.. దేశ ప్రయోజనాల దృష్ట్యాజట్టు కట్టవచ్చు! అయినా ఇన్ని డొంకతిరుగుడు ప్రయోగాలు ఆయనకు ఫలితమిస్తాయో లేదో వేచిచూడాలి.

దసరా రోజు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో సహా ఇప్పటికే కేసీఆర్ తో కలిసి పని చేయటానికి ముందుకొచ్చిన ఇతర పార్టీల ప్రతినిధులు హాజరవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ పేరుతో పాటుగా జెండా - అజెండా ఖరారు చేసారు. అదే రోజున తన జాతీయ పార్టీ నిర్వహణకు వీలుగా జాతీయ కో ఆర్డినేటర్లను కేసీఆర్ ప్రకటించనున్నారు. పార్టీ జెండా గులాబీ రంగులో ఉంటుందని, భారతదేశ మ్యాప్‌ కూడా ఉండేలా రూపొందించారని సమాచారం. సంక్షేమం, సహకార సమాఖ్య ప్రధాన అంశాలుగా తమ అజెండాను కేసీఆర్ ప్రకటించనున్నారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు, రైతుబంధు, పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు తదితర పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయడంపైన కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు.

అందుకే మునుగోడులో అందరికంటే ముందే సబ పెట్టినా, అభ్యర్థి ని ప్రకటించకుండా ఉన్నదనేది వాస్తవం, ఆయనకు సన్నిహితుహలకు అదే చెప్పినట్టు వినికిడి అయితే దేశవ్యాప్తంగా రైతులను ఆకర్షించే తన జాతీయ పార్టీ, అజెండా ఉండాలని భావిస్తున్న కేసీఆర్.. దీనికి భారత రైతు సమితి పేరును కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారని పలువురు అంచనా



 

 

 

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...