Monday, 11 July 2022

 

యాదాద్రిలో భారీ వర్షం... బయటపడుతున్న లీకులు

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రం భారీ వర్షం కారణంగా లీకేజీలు ఏర్పడ్డాయి. యాదాద్రిలో గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో లీకేజీలు ఏర్పడ్డాయి. ప్రధానాలయం అష్టభుజి, గోడ ప్రాకార మండపం, ప్రథమ ప్రాకార మండపాలతో పాటు ప్రధానాలయ ముఖ మండపంలోని ఏసీల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై వాటికి మరమ్మతులు చేస్తున్నారు.

 

 

తిరిగి ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.

ఆకస్మిక వరదల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ (Amarnath)యాత్ర మళ్లీ ప్రారంభమైంది. దీంతో జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి పహల్గామ్‌లోని నున్వాన్ బేస్ క్యాంప్‌నకు యాత్రికులు బయల్దేరారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రస్తుతం పహల్గామ్ మార్గంలో మాత్రమే యాత్రికులను అనుమతిస్తున్నారు. బల్తాల్ మార్గం నుంచి యాత్ర ఇంకా పునఃప్రారంభం కాలేదు. కానీ బల్తాల్, పహల్గాం రెండు మార్గాల నుంచి హెలికాప్టర్ సేవలను అందుబాటులో ఉంచారు. ఈ మేరకు 4,020 మంది భక్తులతో కూడిన 12వ బ్యాచ్‌ దర్శనానికి బయల్దేరించింది. జమ్మూలోని భగవతినగర్‌ యాత్రి నివాస్ నుంచి 110 వాహనాల్లో గట్టి బందోబస్తు మధ్య బేస్‌ క్యాంపులకు బయలుదేరినట్టు సైనిక వర్గాలు కూడా తెలిపాయి. అందులో 1016 మంది భక్తులు తెల్లవారుజామున 3:30 సమయంలో 35 వాహనాల్లో బల్తాల్ బేస్‌ క్యాంపునకు బయలుదేరాయి. ఇలా వెళ్లిన యాత్రికులంతా మంగళవారం అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించుకోనున్నారు.


కాగా అమర్‌నాథ్ గుహ సమీపంలో ఈ నెల 8న ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కనీసం 16 మంది మరణించారు. 40 మందికిపైగా తప్పిపోయారు. దీంతో ఆదివారం లోయలోని బేస్ క్యాంపులకు వెళ్లడానికి ఏ బ్యాచ్‌ను అనుమితంచ లేదు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. శిథిలాలను కొనసాగిస్తున్నారు. అయితే శుక్రవారం కొండచరియలు విరిగిపడటంతో గుహ మందిరానికి వెళ్లే మార్గం దెబ్బతింది. దాంతో పవిత్ర గుహ వెలుపల సైన్యం తాత్కాలిక మెట్లను నిర్మించింది. వరదల వల్ల అమర్ నాథ్ యాత్రికులు చాలామంది చనిపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి వెళ్లిన 84 మంది క్షేమంగా బయటపడ్డారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. అయితే వారిద్దరూ చనిపోయినట్టు తెలిసింది. రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారిని వారితో పాటు వెళ్లినవారు గుర్తించారు. దాంతో ఈ విషయాన్ని పోలీసులు ఖరారు చేశారు. చనిపోయిన వారు రాధ, పార్వతీలు గుర్తించగా.. వారిని ఆస్పత్రులకు తరలించినట్టు వెల్లడించారు.

  

కేసీఆర్ పాలన అంతమొందించే బాధ్యత నాదే… ఈటెల.


కేసీఆర్ దుర్మార్గమైన పాలనను అంతమొందించే బాధ్యత తనపై ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వాఖ్యలు చేశారు. కేసీఆర్  ను ఓడగొడితేనే  తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవుతుందన్నారు. ఉద్యమకారుడిగా తాను ప్రశ్నిస్తే.. పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు. కేసీఆర్ కు కావాల్సింది కేవలం బానిసలేనన్నారు. కేసీఆర్ బలం, బలహీనతలు అన్ని తనకు తెలుసన్నారు. సీఎం కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనంటూ మరోసారి సంచలన వాఖ్యలు చేశారు. డబ్బుతో తనను ఓడించాలని కేసీఆర్ కలలు కన్నారని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్. తనలాంటి వారు కేసీఆర్ నచ్చలేదన్నారు. ఆయనకు కావాల్సింది కేవలం బానిసలు మాత్రమేనన్నారు. అసెంబ్లీలో తన ముఖం కన్పించకుండా ఉంాలని కేసీఆర్ తనను ఓడించడానికి రూ.600 కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు ఈటల.

పోలీసులు లేకుండా రావాలన్న నా భార్య సవాల్‌కు..  కేసీఆర్ సచ్చిపోవాలన్నారు. 50 శాతమున్న బీసీలకు 3 మంత్రి పదవులా అని ప్రశ్నించారు ఈటల. గిరిజనులకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం గుప్పించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. సీఎం కేసీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు ఈటల రాజేందర్. కేసీఆర్‌కు అహంకారం పెరిగిపోయిందని ధ్వజమెత్తారు.

హుజురాబాద్‌లో ఓటుకు నోటు ఇచ్చింది కేసీఆరే అని ఆరోపించారు ఈటల. కేసీఆర్ వ్యుహాలు ఎంటో తనకు తెలుసన్నారు. దుర్మార్గమైన పాలన అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు. చరిత్ర నిర్మాతలు ఎప్పుడూ నాయకులు కాదని.. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమేనని మరో సారి తనదైన శైలిలో వాఖ్యానించారు ఈటల రాజేందర్.

  

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం --ఫొటో పోటీలు

వంద మాటలను ఒక్క ఫోటో లో చూడగలం. జీవిత సత్యాలను, మానవ జీవన విధానాన్ని ఒక్క ఛాయా చిత్రం సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. చూడగలిగితే ప్రకృతి లో ఉండెంత అందం మరెక్కడా ఉండదు... అలాంటి అందాలను బంధించేదే ఫోటోగ్రఫీ. ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 19న " ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం "ను  పురస్కరించుకుని   తెలంగాణ రాష్ట్ర సమాచార & ప్రజాసంబంధాల శాఖ ఫొటో పోటీలను నిర్వహిస్తుంది. స్థానిక ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించేందుకు 1992లో సమాచార శాఖ ఈ పోటీలను ప్రారంభించింది.  ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లో పాల్గొనే వారి సంఖ్య ప్రతీ సంవత్సరం గణనీయంగా పెరుగుతోంది. ఇందులో పాల్గొనడమే కాకుండా వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, పోటీల స్థాయి గురించి మరింత తెలుసుకోవడానికి అనేక మంది ఉత్సాహాన్ని చూపుతున్నారు.

సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించే ఈ ఫోటోగ్రఫీ పోటీలకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేయడానికి ఫోటోగ్రఫీ, జర్నలిజం రంగంలో పేరుగాంచిన ప్రముఖ వ్యక్తులను జ్యూరీ సభ్యులుగా నియమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విభాగాలను కవర్ చేయడానికి ప్రతి సంవత్సరం సరి కొత్త థీమ్లు ప్రకటిచడం జరుగుతోంది. ఈ పోటీలకు అందిన ఫొటోలను అవసరమైన చోట శాఖాపరమైన అవసరాలకు వినియోగిస్తారు. ఈ ఫొటో పోటీలకు వచ్చిన ప్రతి కాటగిరీకి 1వ 2వ, 3వ బహుమతులతోపాటు 5 కన్సోలేషన్ బహుమతులు అందచేస్తారు. విజేతలను నగదు పురస్కారం, జ్ఞాపికలతో ఘనంగా సత్కరిస్తారు. గత సంవత్సరం 2021 లో 104 మంది పాల్గొన్న వారి నుంచి దాదాపు 1,500 ఫోటోలు అందాయి. అందులో 32 మంది ఫోటోగ్రాఫర్లకు ప్రతీ అంశం నుంచి 5 కన్సోలేషన్ బహుమతులతో పాటు 1వ 2వ మరియు 3వ స్థానం బహుమతులను ఎంపిక చేశారు. బంగారు తెలంగాణ, తెలంగాణ పండుగలు, ఉత్తమ వార్తా చిత్రం, నగర అభివృద్ధి గత సంవత్సరం పోటీకి సంబంధించిన అంశాలు. అదేవిధంగా, ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం (I&PR శాఖ) ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2022 వేడుకల సందర్భంగా “ఫోటో పోటీ”ని నిర్వహిస్తోంది.

ఈ ఏడాది ఐదు కేటగిరీలు ఉన్నాయి

మొదటి అంశం -I: బంగారు తెలంగాణ

(మహిళా & శిశు సంక్షేమ IT పరిశ్రమ, ఆరోగ్యం, విద్యుత్, నీటిపారుదల, లా & ఆర్డర్)

రెండవ అంశం -II: పల్లె, పట్టణ ప్రగతి

(పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్లు, ట్యాంకర్లు, వైకుంట ధామములు, గ్రామ పంచాయతీలలో డంపింగ్ యార్డులు మొదలైనవి,)

మూడవ అంశం-III: ఉత్తమ వార్తా చిత్రం

(వార్తా పేపర్ / మ్యాగజైన్లో ప్రచురించబడిన చిత్రం, ఆగస్టు 2019 తర్వాత మాత్రమే)

నాలుగవ అంశం -IV: అర్బన్ & రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్

(సరస్సులు, ఉద్యానవనాలు, రోడ్లు, మన ఊరు మన బడి, గ్రంథాలయాలు మొదలైన వాటి అభివృద్ధి,)

ఐదవ అంశం - V: స్కైలైన్ ఆఫ్ హైదరాబాద్

ఈ ఫోటో కాంపిటీషన్ పాల్గొనేవారు (3) థీమ్ / కాన్సెప్ట్ కోసం ఒక్కొక్కరు మూడు ఫోటోలను పంపవచ్చు. దీని ప్రకారం ఉత్తమ 1వ, 2వ, 3వ ఎంట్రీలకు వరుసగా రూ.20,000/-, రూ.15,000/- మరియు రూ.10,000/- నగదు పురస్కారాలతో పాటు సర్టిఫికెట్లు, మెమెంటో లతో పాటు (5) కన్సోలేషన్ బహుమతులతో సత్కరించాలని నిర్ణయించడం జరిగింది.. ఐదు కేటగిరీలలో ఒక్కొక్కరికి రూ.5,000/- మొత్తం 40 బహుమతులుంటాయి

ఈ ఫోటో పోటీలలో పాల్గొనేవారు తమ ఎంట్రీలను 11-7-22 (సోమవారం) నుంచి 12-8-22 వరకు (అన్ని పని దినాలలో) సమర్పించవచ్చు. ఎంట్రీలను స్వీకరించడానికి చివరి తేదీ ఆగస్టు 12. ఆ రోజు సాయంత్రం 5.00 గంటల వరకు ఎంట్రీలను పంపించవచ్చు. ఎంట్రీలను అసిస్టెంట్ డైరెక్టర్ (ఫోటో ), సమాచార భవన్, సమాచార పౌర సంబంధాల శాఖ, మాసాబ్ ట్యాంక్ , హైదరాబాద్, 500028 అనే చిరునామా కు పంపించాల్సి ఉంటుంది. పోటీలకు పంపే ఫోటోలను adphoto.ts @gmail.com అనే మెయిల్ కు కూడా పంపాలి. అన్ని వర్గాల ఫోటోగ్రాఫర్లు మరియు ఫోటోగ్రఫీ ఔత్సాహికులందరూ పోటీలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ సమాచార, ప్రసార శాఖ కోరింది.

Saturday, 9 July 2022


తొలి ఏకాదశి ఉత్సవాలు...కామధేనువు సేవా సమితి సభ్యులు




ఆషాఢ శుద్ధ ఏకాదశిగానే తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు.


ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి. 


తొలి ఏకాదశి ప్రాశస్త్యం

ఆషాఢమాస శుక్ల పక్షంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.


తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.


తొలి ఏకాదశి జరుపుకొను విధానం,నియమాలు…ఉపవాస ఫలితాలు

ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా లేచి శుచిగా స్నానమాచరించి, శ్రీహరిని నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది.


ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి.


ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.


మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూదానం చేసినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది.


ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.


తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే.. ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు. 

స్థానిక సనత్ నగర్ లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు...

🙏జై శ్రీమన్నారాయణ


*హనుమాన్ దేవస్థానం  దేవాదాయ ధర్మాదాయ శాఖ సనత్ నగర్*


 శ్రీ పద్మావతి సమేత

కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు 10/7/22 తేదీ

ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ

 ఉదయం 5:30 గంటలకు   ఆదివారం రోజున ఆషాడ శుద్ధ ఏకాదశి అనగా *తొలి ఏకాదశి* పర్వదిన సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి  స్వామివారికి అష్టోత్తర

శత  క్షీరాభిషేకము(108 లీటర్ల పాలు తో)

 పంచామృత  సుగంధ ద్రవ్య అభిషేకము.

 పుష్పాలంకరణ ఐదు రకాల ప్రసాదలతో స్వామివారికి నైవేద్య సేవ సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ తో  

*లక్ష తులసి*

 కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి లక్ష తులసి అర్చనకాబట్టి 

అందరూ ఏకాదశి రోజున స్వామివారి దేవాలయంలో జరిగినటువంటి విశేష ఉత్సవాలలో పాల్గొని సేవించి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.


 కామధేనువు సేవా సమితి సబ్యులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు...

Friday, 8 July 2022

 

ప్రపంచ రాజకీయాలనే ప్రభావితం చేసిన నాయకుడు-- దారుణ హత్య


జపాన్‌ మాజీ ప్రధాని, భారత్ ఆత్మీయ మిత్రుడు షింజో అబె ఇకలేరు. ఎన్నికల ప్రచారంలో దారుణ హత్యకు గురయ్యారు. దుండగుడి కాల్పుల్లో గాయపడిన షింజో అబె.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎల్‌డీపీ వర్గాలు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ వార్త తెలియగానే ప్రపంచం దిగ్భ్రాంతికి గురవుతోంది. ఒక దేశ మాజీ ప్రధాని, దూరదృష్టి గల నేత, ప్రపంచ రాజకీయాలనే ప్రభావితం చేసిన నాయకుడు, రాజనీతిజ్ఞుడు, జనం మనసెరిగిన నేత ఇలా దారుణంగా హత్యకు గురవడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. షింజో అబె మృతిపై వివిధ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తు్న్నారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారుజపాన్‌ పార్లమెంట్‌ ఎగువసభకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిమిత్తం షింజో అబె విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం (జులై 8) ఉదయం నరా నగరంలోని ఓ కూడలి వద్ద లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన వేదికపైనే కుప్పకూలారు. దుండగుడు నాటు తుపాకీతో ఆయన వెనుక వైపు నుంచి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉండి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రెండు సార్లు కాల్పలు జరపడంతో షింజో అబె తీవ్రంగా గాయపడ్డారు

 

2022 ప్రపంచ ఉత్తమ జాతీయ గీతం మన దేశ జాతీయ గీతం




మన దేశ జాతీయ గీతం.'' జన గణ మన అధినాయక.''ను యునెస్కో ' ప్రపంచ ఉత్తమ జాతీయ గీతం 2022'గా ప్రకటించింది. భారతీయులమైన మనం ఇందుకు గర్వించాల్సి ఉంది. విశ్వ కవి రవీంద్ర నాథ్ ఠాగుర్ రాసిన ఆ గీతంలో ప్రతి పదానికి అర్థం. జన= ప్రజలు, గణ=సమూహం, మన:=మనస్సు, అధినాయక= నాయకుడు, జయహే= విజయం, భారత=ఇండియా, భాగ్య= సంపద, విధాత= ఇచ్చేది, పంజాబ= పంజాబ్, సింధు=సింధు, గుజరాత=గుజరాత్, మరాఠ= మరాఠి(మహారాష్ట్ర), ద్రవిడ=దక్షిణం, ఉత్కల=ఒరిస్సా, బంగా=బెంగాల్, వింధ్య= వింధ్యా పర్వతాలు, హిమాచల్=హిమాలయాలు, యమున=యమునా నది, గంగ=గంగా నది, ఉచ్ఛల=కదిలే, జలధి=సాగరం, తరంగ= తరంగాలు, తవ=మీ, శుభ=శుభకరం, నామే=పేరు, జాగే=జాగరుకం, తవ=మీ, శుభ=శుభకరం, ఆశిష=దీవెనలు, మాగే=కోరుతున్నా, గాహే=పాడు, తవ=నీ, జయ=విజయం, గాథ=పాట, జన=జనులు, గణ=సమూహం, మంగళ=మంగళకరం, దాయక=ఇచ్చే, జయహే=విజయం కలుగుగాక, భారత=ఇండియా, భాగ్య= భాగ్యం, విధాత=ఇచ్చేది. జయహే, జయ హే, జయ హే, జయజయజయ జయహే= విజయం,విజయం,విజయం జయజయజయ జయం ఎల్లప్పటికీ.

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...