యూత్ ఫర్ యాంటీ కరప్షన్ కేంద్ర కార్యాలయంలో స్వతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ పౌండర్ రాజేంద్ర జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది వీరులు, మహానీయుల త్యాగఫలితమే 75 సంవత్సరాల స్వతంత్య్ర భారతావనికి ప్రధాన కారణమన్నారు. నేటి తరం యువత వారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అవినీతి రహిత సమాజం కోసం యూత్ పర్ యాంటీ కరప్షన్ వినూత్న కార్యక్రమాలు చేస్తుందని, అందులో భాగంగానే నిజాయితీపరులకు అండగా ఉండేందుకు ముందడుగు ప్రారంభించిందన్నారు. మంచి సమాజం కోసం వినూత్న కార్యక్రమాలతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ముందడుగు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సీనియర్ నాయకులు కొన్నె దేవేందర్, కానుగంటి రాజు, కొమటి రమేష్‌బాబు, మూడావత్ రమేష్‌నాయక్, జి. హరిప్రకాశ్, అంజుకర్, సాయి, నాగేంద్ర, నరేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Monday, 15 August 2022
Sunday, 14 August 2022
హనుమాన్ దేవాలయంలో తీరంగా ర్యాలీ
బ్రిటీష్ తెల్లదొరల కబందహస్తాల నుంచి భరతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ వేడుకల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘ఆజాది కి అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, సనత్ నగర్ లోని స్థానిక హనుమాన్ దేవాలయంలో, అర్చకలు మరియు దేవాలయ సిబ్బంది తీరంగా ర్యాలీ ఏర్పాటు చేయటం జరిగింది.
Tuesday, 9 August 2022
పూర్వ
విద్యార్థుల ఆత్మీయ
కలయిక
స్నేహమంటే విలువైనది, అపురూపమైనది, అమర మైనది. కానీ ప్రతీ అంచుకు రెండు కోణాలు
ఉన్నట్లే , మంచి, చెడు అనే గుణాలకి స్నేహం కూడా ఏమీ అతీతం కాదు. మంచి స్నేహం ఎప్పుడూ నీడలా
వెన్నంటి ఉంటుంది..... ఆపదలో ఆసరా అవుతుంది...... సంతోషానికి సంబరం
అవుతుంది.....బాధకు భరోసా ఇస్తుంది..... ప్రతిభకు
గుర్తింపు ఇస్తుంది...... పిలవకపోయినా నేనున్నా అంటుంది. మంచి స్నేహానికి ఒక బలమైన, విచిత్రమైన, విపరీతమైన స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం పేరు ఏంటంటే
" సంతోషం " . సంతోషాన్ని స్నేహితులతో పంచుకోవాలనే ఒక ఆరాటం....
అంతకుమించి స్వచ్ఛమైన మంచి స్నేహం లో ఏ రకమైన స్వార్థం ఉండదు.• మంచి స్నేహం... ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా, సాటి స్నేహితుడి యొక్క ఉన్నత
తత్వాన్ని, అభ్యున్నతిని మాత్రమే కోరుకుంటుంది. అదేవిధంగా స్నేహితుడి యొక్క
నిమ్నతత్వాన్ని సరి చేయడానికి
ప్రయత్నిస్తుంది స్నేహానికి అర్థం చేసుకునే గుణం , సహాయపడే తత్వం భగవంతుడు సహజంగానే
ప్రసాదిస్తాడు . మంచి..... వేగంగా నడవలేదు, త్వరగా ఆకట్టుకోలేదు కానీ ఎప్పటికీ
స్థిరత్వమే దాని గమ్యం.
Monday, 8 August 2022
స్వర్ణం సింధూ!
కామన్వెల్త్ గేమ్స్- 2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్,
తెలుగు తేజం పీవీ సింధు బంగారు పతకం సొంతం చేసుకుంది.
కెనడా షట్లర్
లీపై పీవీ సింధు విజయం సాధించింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఈవెంట్ లో
పీవీ సింధు కామన్వెల్త్ గేమ్స్ లో ఛాంపియన్ గా నిలవడం ఇదే తొలిసారి. కామన్వెల్త్
గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ ఈవెంట్ లో భారత్ కు ఇదే తొలి బంగారు పతకం కావడం
విశేషం.
బర్మింగ్ హామ్
వేదికగా సోమవారం జరిగిన ఫైనల్ కెనడా షట్లర్ మిచెల్లీ లీని సింధు మట్టికరిపించింది.
మొదటి నుండి అధిపత్యం కనబరుతస్తూ (21-15, 21-13) ప్రత్యర్థిపై ఘనవిజయం
సాధించి విజేతగా నిలిచింది.
2014లో జరిగిన
కామన్ వెల్త్ గేమ్స్ లో కాంస్యం, 2018లో రజత పతకాలు
గెలిచిన చివరికి ఈసారి స్వర్ణం గెలిచి తన ఖాతాలో సరికోత్త రికార్డ్ నెలకొల్పింది
తెలంగాణలో ఓ రేంజ్‌లో రాజకీయ
వేడి రగలనుంది.
ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సై అంటోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న
తరుణంలో ఉప ఎన్నిక ఫలితం ఏ మాత్రం వ్యతిరేకంగా ఉన్నా ఉన్నా అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడనుంది. ఇదే సందర్భంలో ఈ ఉప ఎన్నికను రాజకీయంగా
లబ్ధి పొందేలా మలుచుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో హుజూరాబాద్, దుబ్బాక ఉప
ఎన్నికల్లో ఓటమిపాలు కావడం టీఆర్ఎస్‌కు గుణపాఠం నేర్పింది.
దీంతో ఉప ఎన్నికల్లో
ఓటమి నుంచి టీఆర్ఎస్ కావాల్సినన్ని పాఠాలు నేర్చుకుంది. మునుగోడు ఉప ఎన్నికలో
మాత్రం ఓటమి పునరావృతం కాకూడదని గట్టి పట్టుదలతో ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో
బీజేపీని చావు దెబ్బతీసి, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించడానికి
టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డనుంది.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి
రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే ఆలస్యం, వెంటనే
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఇంత వేగంగా రాజీనామాను ఆమోదించడం
ద్వారా .... ఉప ఎన్నికకు సిద్ధమనే సంకేతాల్ని టీఆర్ఎస్ పంపిందనే అభిప్రాయాలు
వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై కాలయాపన చేసి, అనవసర చర్చకు అవకాశం ఇవ్వకూడదని టీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టు
సమాచారం.
ఈ నేపథ్యంలో ఉప
ఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్టు ప్రత్యర్థులకు రాజీనామా ఆమోదంతో హెచ్చరిక
పంపింది. ఇక ఉప ఎన్నికకు నోటిఫికేషనే ఆలస్యం. తలపడేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్,
బీజేపీ సిద్ధంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు చివరి ఉప ఎన్నిక
కానుండడంతో తెలంగాణలో ఓ రేంజ్‌లో రాజకీయ వేడి రగలనుంది.
Wednesday, 27 July 2022
నాలుగేళ్లకోసారి
జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు రంగం సిద్దమైంది. ఇప్పటి వరకైతే కామన్వెల్త్
గేమ్స్‌లో భారత్ మంచి ప్రదర్శననే కనబర్చింది.
గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన గత ఎడిషన్‌లో భారత్ 26 బంగారు పతకాలతో సహా 66 మెడల్స్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఈ
సారి కూడా టాప్3లో నిలవడమే
లక్ష్యంగా రెండొందల పైచిలుకు అథ్లెట్లతో బరిలోకి దిగుతోంది.
ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాడ్మింటన్లో
పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్
సాయిరాజ్, సుమీత్
రెడ్డి, పుల్లెల గాయత్రి.. బాక్సింగ్‌లో
వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్, మహ్మద్ హుస్సాముద్దీన్
పోటీ పడుతున్నారు. టేబుల్ టెన్నిస్‌లో
ఆకుల శ్రీజ, అథ్లెటిక్స్‌లో
యెర్రాజి జ్యోతి అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. విమెన్స్
హాకీ టీమ్‌లో ఎతిమరపు రజని, క్రికెట్
జట్టు తరఫున సబ్బినేని మేఘన బరిలో ఉన్నారు. 2018 గోల్డ్
కోస్ట్ గేమ్స్‌లో తెలుగు ప్లేయర్లు మూడు గోల్డ్ సహా
8 పతకాలు సాధించారు. మరీ ఈసారి ఆ ప్రదర్శనను కొనసాగిస్తారో..
లేదో చూడాలి. గత ఎడిషన్లో భారత షట్లర్లు రెండు గోల్డ్ సహా ఆరు మెడల్స్తో సత్తా చాటారు. ఈ సారి అదే స్థాయి పెర్ఫామెన్స్ చేస్తారని అంతా ఆశిస్తున్నారు.
గోల్డ్కోస్ట్లో విమెన్స్, మెన్స్ సింగిల్స్లో సిల్వర్ మెడల్స్ నెగ్గిన పీవీ సింధు, కిడాంబి
శ్రీకాంత్ ఈసారి గోల్డ్పై గురి పెట్టారు. ఈ మధ్యే స్విస్ ఓపెన్ టోర్నీ నెగ్గిన సింధు ఫామ్లోకి వచ్చింది. థామస్ కప్లో ఇండియాకు తొలి గోల్డ్
అందించిన శ్రీకాంత్ అదే జోరును బర్మింగ్‌హామ్‌లోనూ
కొనసాగించాలని చూస్తున్నాడు.
భారత
డబుల్స్ టాప్
షట్లర్ సాత్విక్
సాయిరాజ్ తన పార్ట్‌నర్
చిరాగ్ షెట్టితో బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి
దిగుతున్నాడు. మిక్స్‌డ్
డబుల్స్‌లో సీనియర్
ప్లేయర్ సుమీత్ రెడ్డి.. అశ్విని పొన్నప్పతో
కలిసి ఎలాగైనా పతకం రాబట్టాలని ఆశిస్తున్నాడు. ఈ మధ్య విమెన్స్
డబుల్స్‌లో సత్తా చాటుతున్న గోపీచంద్
కూతురు పుల్లెల గాయత్రి తొలిసారి కామన్వెల్త్
బరిలో నిలిచింది. వీళ్లంతా టీమ్ ఈవెంట్‌లోనూ
సత్తా చాటితే భారత్‌కు గోల్డ్ మెడల్
నిలబెట్టుకోవడం ఖాయం
గత రెండేళ్ల నుంచి జోరు కనబరుస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరల్డ్
చాంపియన్‌షిప్ నెగ్గి స్టార్‌డమ్ తెచ్చుకున్న ఆమె... అదే జోరును ఇక్కడా కొనసాగించి తొలి ప్రయత్నంలోనే కామన్వెల్త్‌లో పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలిసారి 50 కేజీ కేటగిరీలో పోటీ పడుతున్న నిఖత్ ఈ గేమ్స్ కోసం పక్కాగా ప్రిపేర్ అయింది. ఇక, మహ్మద్ హుస్సాముద్దీన్ గత ఎడిషన్లో 56 కేజీ కేటగిరీలో బ్రాంజ్ నెగ్గాడు. ఈసారి 57 కేజీ కేటగిరీలో పోటీ పడుతున్న ఈ ఆర్మీ బాక్సర్ గతంలో కంటే మెరుగైన ప్రదర్శన
కనబర్చాలనుకుంటున్నాడు. ఇక మహిళల హాకీ టీమ్‌లో గోల్ కీపర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన
ఎతమరపు రజని ఎంపికైంది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు.. అదే జోరును కొనసాగిస్తే పతకం ఖాయం. కామన్వెల్త్‌లో తొలిసారి ప్రవేశ పెట్టిన విమెన్స్
క్రికెట్‌లో పోటీపడే జట్టులో సబ్బినేని మేఘన చోటు దక్కించుకుంది. కానీ, తను కరోనా బారిన
పడటంతో టోర్నీలో పాల్గొంటుందో లేదో చూడాలి. తొలి రెండు మ్యాచ్‌లకు అయితే ఆమె దూరంగా ఉండనుంది.
భారత టేబుల్ టెన్నిస్‌లో హైదరాబాద్ ప్లేయర్ ఆకుల శ్రీజ ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. ఈ మధ్యే నేషనల్ టీటీలో
విమెన్స్ సింగిల్స్‌తో పాటు డబుల్స్ టైటిల్ నెగ్గిన ఆమె తొలిసారి కామన్వెల్త్‌కు ఎంపికైంది. ప్రస్తుతం శ్రీజ మంచి
ఫామ్‌లో ఉంది. మెగా గేమ్స్‌లో సింగిల్స్, డబుల్స్‌తో పాటు టీమ్ ఈవెంట్‌లోనూ తను కీలక ప్లేయర్
కానుంది. మరోవైపు అథ్లెటిక్స్‌లో ఏపీకి చెందిన యెర్రాజి జ్యోతి 100 మీ. హర్డిల్స్‌లో వరుస
రికార్డులతో పేరు తెచ్చుకుంటోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన 22 ఏండ్ల జ్యోతి మేలో మూడు వారాల్లోనే మూడు సార్లు నేషనల్
రికార్డులు బ్రేక్ చేసింది.
Tuesday, 26 July 2022
నాటి సైనికుల పోరాట స్పూర్తి చిరస్మరణీయం
1999లో లడఖ్‌లోని కార్గిల్‌లోకి అక్రమంగా ప్రవేశించి దాన్ని ఆక్రమించుకోవాలకున్న పాక్ సైన్యం, ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీహడల్ పుట్టించింది. ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో సైనిక చర్య ప్రారంభించి పాకిస్థాన్ సైనికులు ఆక్రమించుకున్న అన్ని ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది. మే 8, 1999న ప్రారంభమైన ఈ యుద్ధంలో మన సైన్యం ధైర్యసాహసాలతో పాటు అద్భుతమైన యుద్ధ వ్యూహాలు ప్రదర్శించింది. ఈ సమయంలో 527 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందారు. కార్గిల్‌లో దాదాపు మూడు నెలల పాటు యుద్ధం జరిగిన తర్వాత జులై 26, 1999న భారత సైనికులు పాకిస్థాన్ సైన్యంపై తమ విజయాన్ని ప్రకటించారు. శత్రు సైనికులు వాస్తవాధీన రేఖ వెంబడి ఆక్రమించిన పర్వతాలన్నిటినీ మళ్లీ స్వాధీనం చేసుకుని అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జులై 26న విజయ్ దివస్ మనమందరం జరుపుకుంటున్నాం.
కాగా ఈ యుద్ధంలో పాక్‌పై విజయం సాధించి నేటికి 23 ఏళ్లు అయ్యింది. ఈ
సందర్భంగా భారతీయులందరూ ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకుంటూ.. యుద్ధంలో అసువులు
బాసిన వీరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. భారత సైనికుల పరాక్రమానికి సెల్యూట్
చెబుతున్నారు. తాజాగా రాష్ట్రపతి ముర్ము, రాజ్‌నాథ్ సింగ్,
త్రివిధ దళాధిపతులు కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు.
మంగళవారం అంటే ఈ రోజు ఉదయం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద కార్గిల్
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పించారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్
వార్ మెమోరియల్ వద్ద త్రివిధ దళాధిపతులు పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళులు
అర్పించారు. త్రివిధ దళాధిపతులైన ఆర్మీ చీఫ్
జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలోని
జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ప్రస్తుతం అప్పటి కార్గిల్
వార్‌కి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. మంగళవారం
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఈ
విజయ్ దివస్ మన సైనిక దళాల అసాధారణ పరాక్రమానికి, సంకల్పానికి ప్రతీక అని, భారతమాతను కాపాడేందుకు
ప్రాణత్యాగం చేసిన వీర సైనికులందరికీ నమస్కరిస్తున్నానని, దేశప్రజలందరూ వారికి, వారి కుటుంబ సభ్యులకు
ఎప్పుడూ రుణపడి ఉంటారని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి
భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము
పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం. విద్యార్థి , విద్యార్థినిలు కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...
-
మనం ఎన్నో దానాల గురించి వింటుంటాం. అందులో అన్నదానం ఎంతో విశిష్టిత కలిగింది. వాటిలో ముఖ్యంగా రక్తదానం, అవయవదానం, అన్నదానం గురించి ఎక్కువగా వ...
-
ముదురుతున్న మునుగోడు రాజకీయం రాజకీయం తెలంగాణ కేంద్రంగా పరిభ్రమిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక , టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ (భారతీయ...
-
రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు మెగాస్టార్ చిరంజీవి ఏం చేసినా సంచలనమే. సినిమాల్లో ఆయన విజయ...








