Tuesday, 26 July 2022

 నాటి సైనికుల పోరాట స్పూర్తి చిరస్మరణీయం

1999లో లడఖ్‌లోని కార్గిల్‌లోకి అక్రమంగా ప్రవేశించి దాన్ని ఆక్రమించుకోవాలకున్న పాక్ సైన్యం, ఉగ్రవాదులకు  ఇండియన్ ఆర్మీహడల్ పుట్టించింది. ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో సైనిక చర్య ప్రారంభించి పాకిస్థాన్ సైనికులు ఆక్రమించుకున్న అన్ని ప్రదేశాలను స్వాధీనం చేసుకుంది. మే 8, 1999న ప్రారంభమైన ఈ యుద్ధంలో మన సైన్యం ధైర్యసాహసాలతో పాటు అద్భుతమైన యుద్ధ వ్యూహాలు ప్రదర్శించింది. ఈ సమయంలో 527 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందారు. కార్గిల్‌లో దాదాపు మూడు నెలల పాటు యుద్ధం జరిగిన తర్వాత జులై 26, 1999న భారత సైనికులు పాకిస్థాన్ సైన్యంపై తమ విజయాన్ని ప్రకటించారు. శత్రు సైనికులు వాస్తవాధీన రేఖ వెంబడి ఆక్రమించిన పర్వతాలన్నిటినీ మళ్లీ స్వాధీనం చేసుకుని అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా జులై 26న విజయ్ దివస్ మనమందరం జరుపుకుంటున్నాం.

కాగా ఈ యుద్ధంలో పాక్‌పై విజయం సాధించి నేటికి 23 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా భారతీయులందరూ ఈ చారిత్రాత్మక విజయాన్ని జరుపుకుంటూ.. యుద్ధంలో అసువులు బాసిన వీరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. భారత సైనికుల పరాక్రమానికి సెల్యూట్ చెబుతున్నారు. తాజాగా రాష్ట్రపతి ముర్ము, రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు. మంగళవారం అంటే ఈ రోజు ఉదయం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పించారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద త్రివిధ దళాధిపతులు పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు. త్రివిధ దళాధిపతులైన  ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ప్రస్తుతం అప్పటి కార్గిల్ వార్‌కి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. మంగళవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఈ విజయ్ దివస్ మన సైనిక దళాల అసాధారణ పరాక్రమానికి, సంకల్పానికి ప్రతీక అని, భారతమాతను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన వీర సైనికులందరికీ నమస్కరిస్తున్నానని, దేశప్రజలందరూ వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడూ రుణపడి ఉంటారని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి

 భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము

 

Monday, 25 July 2022

 

పాకిస్తాన్‌లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ

 


పాకిస్తాన్‌లో తొలి హిందూ డీఎస్పీగా మనీషా రూపేటా రికార్డులకెక్కారు. అమ్మాయిలు మెడిసిన్ తప్ప మరే ఇతర కోర్సుల్లో కూడా చేరకూడదన్న నిబంధనలున్నా.. ఆమె తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారు పేరు మనీషా రూపేటా.  పాకిస్తాన్ లో తొలి హిందూ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్. సింధ్ దగ్గరున్న చిన్న పట్టణం జాకోబా బాద్ తన  ఊరు. స్కూలు చదువు అంతా అక్కడే సాగింది. అక్కడ అమ్మాయిలను చదివించే ట్రెండ్ లేదు. అమ్మాయిలను చదివించడానికి ఎవరూ ప్రాధాన్యత ఇవ్వరు.

ఎవరైనా ఉన్నత విద్య అభ్యసించినా కూడా వారికి ఎంబీబీఎస్ తప్ప వేరే కోర్సు చేసే అవకాశం లేదు. చేస్తే ఎంబీబీఎస్ చేయాలి, లేదా ఉద్యోగం మానేయాలి. ఎంబీబీఎస్ ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో ఫెయిల్ అయితే వారికి మరొక కోర్సులో చేరే అవకాశమే ఉండేది కాదు. అలాంటి వాళ్లంతా చదువును ఆపేయడం తప్ప మరో మార్గం లేదు.  రూపేటా ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష లో అర్హత సాధించలేదు. దాంతో, ఫిజికల్ థెరపీ కోర్సు ఎంపిక చేసుకున్నారు

మహిళలపై హింస జరిగే సమాజంలో వారికి రక్షణ కల్పించే స్థానాల్లో మహిళలు ఉండాలని తన  అభిప్రాయం. మహిళా రక్షకులు ఉండాల్సిన అవసరముంది. ఈ ఆలోచనే నేను పోలీసు ఉద్యోగం ఎంపిక చేసుకునేందుకు స్ఫూర్తినిచ్చిందని రూపేటా చెప్పారు

నేను ఒక్క మా సమాజానికి మాత్రమే ప్రతినిధిని కాదు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే ప్రతీ అమ్మాయికి ప్రతీకగా నిలుస్తూ, ప్రాతినిధ్యం వహిస్తాను. చిన్న చిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పెద్ద పెద్ద కలలు ఉంటాయి.

బలవంతంగా మత మార్పిడులు చేయడం, అమ్మాయిలను అపహరించడం లాంటి వ్యవహారాలను మతపరమైన అంశాలుగా చూడటాన్ని నేను అంగీకరించను. ఇదొక సాంఘిక సమస్య. ఒక అమ్మాయి ఒక ఇంటి నుంచి పారిపోతే, ఆ అంశం చుట్టుపక్కల ఉన్నవారందరినీ ప్రభావితం చేస్తుంది. ఇది మొత్తం సమాజంపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యను మరింత విస్తృతంగా చూస్తే, ఇది సామాజిక ఆర్ధిక సమస్యగా కనిపిస్తుంది.

ఇలాంటి కారణాల వల్లే, మేధో వలసలు జరుగుతున్నాయి. ఇక్కడున్న భద్రతా కారణాల వల్ల చాలా మంది వలస వెళ్లిపోతున్నారు.

అందరూ కలిసి పని చేయడమే దీనికి పరిష్కారం. నేరం నేరమే. తప్పు తప్పే. బాధితులు ఎవరైనప్పటికీ అది మొత్తం సమాజం పై ప్రభావం చూపిస్తుంది.

నాకు ఎనలేని స్పందన లభించింది. మా చుట్టుపక్కల వారు కూడా అందరూ నన్ను ప్రశంసించారు.

జాతి మొత్తం ప్రశంసించింది. ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తారు. కానీ మా బంధువుల్లో కొంత మంది మాత్రం నేనీ ఉద్యోగాన్ని ఎక్కువ కాలం చేయలేనని అంటున్నారు. నేను ఈ రంగంలో కొనసాగలేనని మాట్లాడుతున్నారు.

నా గురించి ప్రత్యేకంగా వారికి ఎలాంటి అభిప్రాయమూ లేదు. కానీ, అమ్మాయిలు పోలీసు అధికారులు కాలేరనే సమాజంలో నెలకొన్న సాధారణ అభిప్రాయం వారు అలా మాట్లాడేలా చేస్తోంది. ఆ భయంతోనే వారలా మాట్లాడుతున్నారు.

వారికున్న మూస అభిప్రాయాల వల్లే అమ్మాయి ఈ ఉద్యోగంలో కొనసాగలేదని అభిప్రాయపడుతున్నారు. వారు కూడా వారి పిల్లలను ఈ వృత్తిని ఎంచుకోవడానికి అంగీకరించి ఉండరు.

పితృస్వామ్య సమాజంలో పురుషులు మాత్రమే పోలీసు వృత్తిలో రాణించగలరని అనుకుంటారు. అది వారి అభిప్రాయం.

మరో ఒకటి, రెండేళ్లలో వాళ్ళ మాటలను వెనక్కి తీసుకుంటారని నేననుకుంటున్నాను. అప్పటికి వారింట్లో కూడా ఒక అమ్మాయి పోలీసు వృత్తిని ఎంచుకోవచ్చు.

నేనొక ప్రైవేటు అకాడెమీలో పాఠాలు చెబుతున్నాను. నేను టీచింగ్ మాత్రమే కాకుండా విద్యార్థులకు మార్గదర్శకత్వం కూడా వహిస్తాను. నా మార్గదర్శకత్వంలో చాలా మంది అమ్మాయిలు ముందుకు వెళతారనే ఆలోచన ఈ పని చేసేందుకు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. విద్యార్థులకు కూడా ప్రోత్సాహకరంగా ఉండొచ్చు.

 

 

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు  ప్రమాణస్వీకారం.



భారతదేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో వేడుకలా జరిగిన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. దేవుడి సాక్షిగా దేశ ప్రధమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆమె తొలి సందేశం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి ప్రసంగాన్ని.. మాజీ రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీకి నమస్కారాలతో మొదలుపెట్టి.. ‘ప్రియమైన దేశవాసులారా..’అంటూ కొనసాగించారు. ఇప్పటిదాకా పనిచేసిన రాష్ట్రపతుల్లో మోస్ట్ పాపులర్ గా నిలిచిన అబ్దుల్ కలాం కొటేషన్ ‘కలలు కనండి..’కి కొనసాగింపుగా ఇప్పుడు ద్రౌపది ముర్ము సందేశమిచ్చారు. దేశంలో అట్టడుగు పేదలు సైతం కేవలం కలలు కనడమేకాదు.. వాటిని సాకారం కూడా చేసుకోవచ్చని తన జీవిత గమనం రుజువు చేస్తుందని ముర్ము వ్యాఖ్యానించారు

‘‘భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత పదవిని చేపట్టిన సందర్భంగా దేశంలోని చట్టసభలు అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోట్ల మంది విశ్వాసం, నమ్మకాల ఆధారంగా నడిచే పవిత్రమైన పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు నా నమస్సులు తెలియజేస్తున్నాను. మీ ఆత్మీయత, సహయోగత వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ఆజాదీకా అమృత్ మహోత్సవం సమయంలో నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. మరికొద్ది రోజుల్లోనే మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్నాం. భారత్ 50వ స్వాతంత్ర్య వేడుకల ఏడాదే నా రాజకీయ జీవితం మొదలైంది. ఇప్పుడు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ నాకీ గొప్ప అవకాశం లభించింది.. ఒడిశాలోని మారుమూల ఆదివాసీ గ్రామంలో పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవాళ దేశ అత్యున్నత పదవి చేపట్టడం గర్వకారణంగా ఉంది. ఇది నా వ్యక్తిగత విజయం కాదు.. దేశ ప్రజలందరికీ దక్కిన విజయం. ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని, వాటిని సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు నా నామినేషన్ ఓ రుజువు. ప్రైమరీ స్కూల్ చదువు పూర్తి చేయడమే అప్పట్లో నాకు కలగా ఉండేది. అలాంటి స్థాయి నుంచి ఇక్కడికి రాగలిగాను..

75వ స్వాతంత్ర్య దినోత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం గౌరవంగా ఉంది. అంతేకాదు, స్వాతంత్ర్య

 భారతంలో పుట్టి రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి వ్యక్తిగానూ నాకు అదృష్టం దక్కింది.

 స్వాతంత్ర్యయోధులు కలలుకన్న సుస్వరాజ్య నిర్మాణం కోసం మరింత వేగంగా మనం పనిచేయాల్సిన

 అవసరం ఉంది. అందరి సహకారంతో ఉజ్వల యాత్రను కొనసాగించాల్సి ఉంది. ‘సబ్ కా సాథ్.. సబ్

 కా కర్తవ్య్..’ నినాదంతో ముందకు వెళదాం..’’ అని తొలి సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 పిలుపునిచ్చారు.

Sunday, 24 July 2022

 

తెలంగాణలో అధికారం కోసం బిజెపి మాస్టర్ ప్లాన్

టీఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను నియోజకవర్గ స్థాయిలో ఎండగట్టడానికి ఏది సరైన మార్గం..?

అసెంబ్లీలో తమకు సంపూర్ణ బలం ఉందని భావిస్తున్న కారు గుర్తు పార్టీ నేతలకు చెక్‌ పెట్టడం ఎలా

 ..? తమకున్న బలమైన నాయకత్వాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం ఎలా అనే అంశాలపై

 బీజేపీ హైకమాండ్ గ్రౌండ్‌ వర్క్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది

అందుకే గతంలో ఎంపీలుగా పోటీ చేసిన సీనియర్‌ నేతలను ..ఈసారి అసెంబ్లీ బరిలోకి దింపి తమ

 సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ పొలిటికల్ ఈక్వెషన్‌ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా అమలు చేసి టీఆర్ఎస్‌ను గట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కమలనాథులు. గ్రేటర్

  హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల రిజల్ట్స్

 చూసిన తర్వాత బీజేపీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ

 ఎన్నికల్లో రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ని గట్టి దెబ్బ కొట్టేందుకు ప్రస్తుతం బీజేపీలో ఎంపీలుగా

 ఉన్నవాళ్లు, ఓడిపోయిన వాళ్లు, సీనియర్‌ నేతలను రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి

 దింపాలని చూస్తోంది బీజేపీ అధిష్టానం. ఇందులో ఎవరూ అతీతులు కాదన్నట్లుగా వ్యూహరచన చేస్తోంది బీజేపీ. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ తరపున ఎంపీలుగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి

 కిషన్‌రెడ్డిని రాబోయే ఎన్నికల్లో గతంలో పోటీ చేసిన అంబర్‌పేట నుంచి రంగంలోకి దింపనుంది. అలాగే  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని వేములవాడ అసెంబ్లీ నుంచి,  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆర్మూర్‌ శాసనసభ నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నెక్స్ట్ బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపాలని పక్కా ప్రాణాళిక వేస్తోంది బీజేపీ. వీళ్లే కాదు ప్రస్తుతం

 బీజేపీలో ఫైర్ బ్రాండ్స్‌గా పేరు సంపాధించుకున్న విజయశాంతిని మెదక్ అసెంబ్లీ లేదంటే

 గ్రేటర్‌లోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట. బీజేపీ జాతయ

 ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనకు పట్టున్న గద్వాల నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని

 మహబూబ్‌నగర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని తాండూరు లేదంటే మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి

 బరిలోకి దింపాలని చూస్తోంది బీజేపీ హైకమాండ్. గతంలో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఓడిన వివేక్‌

 సైతం చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ఎంపీలు, ఓడిపోయిన ఎంపీలు, సీనియర్ నేతల సంగతి ఇలా ఉంటే ఉపఎన్నికల్లో హుజురాబాద్‌ నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ ఇలాఖ నుంచి పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈనేపధ్యంల ఆయన్ని గెలిపించిన హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి జమునను నిలబెట్టి డబుల్ విక్టరీ కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పబ్లిక్‌ ఫిగర్‌లుగా ఉన్న వాళ్లతో పాటు బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు

 గతంలో స్టేషన్‌ ఘనపూర్ నుంచి పోటీ చేసిన విజయరామారావును ఎంపీగా పోటీ చేయించాలనే

 ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈ మధ్యకాలంలో

 వినిపిస్తున్న మాట కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బిజెపి లో చేరిక దాదాపు కాయం లాగా ఉంది

 అయన కూడా తన స్వంత ఇలాకా మునుగోడు నుండి పోటీ చేపిస్తారని ఊహ గణాలు

Friday, 22 July 2022

 

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలలో బాలికలదే హవా!

 



విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న  సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌. శుక్రవారం మధ్యాహ్నం బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు https://cbseresults.nic.in, https://cbse.digitallocker.gov.in/, https://cbse.gov.in

 ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, స్కూల్‌ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. కాగా.. ఈ ఉదయమే సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

అయితే, సీబీఎస్‌ఈ ఒకేరోజు పది, 12 తరగతుల ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ ఏడాది 94.40శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు బోర్డు వెల్లడించింది. బాలికల ఉత్తీర్ణతా శాతం 95.21శాతంగా ఉండగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 93.80శాతంగా ఉన్నట్టు తెలిపింది. బాలురతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణతా 1.41శాతం అధికంగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, ట్రాన్స్‌జెండర్‌ల ఉత్తీర్ణతా శాతం 90శాతంగా ఉందని బోర్డు వెల్లడించింది.

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి మే 24 వరకు జరగాయి. దేశవ్యాప్తంగా 7,046 సెంటర్లలో జరిగిన సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు 21,16,209 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 8,94,993 మంది బాలికలు కాగా.. 12,21,195మంది బాలురు.

గత ఐదేళ్లలో ఉత్తీర్ణత ఇలా..

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో 2017 ఉత్తీర్ణతా శాతం 93.12% గా ఉండగా.. 2018లో 86.7%, 2019లో 91.10%, 2020లో 91.46%,  2021లో 99.04%గా నమోదైంది.

కాగా తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్టాలలో కూడా విద్యార్థి విద్యార్థినిలు మంచి ఫలితాలు వచ్చాయి అని తెలిపారు, హైదరాబాద్ నగరంలో కూడా చాల పాఠశాలలో మంచి ఫలితాలు వచ్చునట్టు తెలిపారు, సనత్ నగర్ లోని హిందూ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ మా పాఠశాలలోని పరీక్షకు హాజరైన అందరూ మంచి పలితాలు సాధించారని తెలిపారు, కొంత మంది  విద్యార్థులు మాట్లాడుతూ అనేకంటే గణిత పేపర్ కొంచం కష్టంగా ఉంది అని తెలిపారు... ఇందు సహస్ర, ఈషా, వర్ష, స్నేహ, తదితరులు మాట్లాడటం జరిగింది

 

హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన.



 

తెలంగాణ ను మరోసారి భారీ వర్ష సూచన భయపెడుతోంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గత మూడ్రోజులుగా అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిశాయి. వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చాడని ఊపిరిపీల్చుకునేలోపే వెదర్ అప్‌డేట్ ప్రజల్లో కొత్త టెన్షన్‌ పుట్టిస్తోంది. వర్షాలు, వరదలతో బురదలోంచి జనం బయటపడక ముందే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తునే ఉన్నాయి. కాస్త గ్యాప్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ భారీ వర్షాల రూపంలో విరుచుకుపడటంతో సాగు పనులు మొదలుపెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, నేడు, రేపు హైదరాబాద్ నగరానికి భారీ వర్ష  సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు  వాహనదారులకు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్ల మీదికి రాకుండా గంట తరువాత రావాలని సూచించారు. భారీ వర్షాలతో నగరంలోని రోడ్ మీదికి చేరిన నీరు బైటికి వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాధికారులు సూచిస్తున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు నీటి వరదను క్లీన్ చేస్తున్నారు

 

 

75 యేండ్ల దేశం

దేశ సంపద పెరుగుతోంది. నేడు మెూటార్ సైకిల్ లేని ఇల్లే కనపడదు.జాతీయెూధ్యమ కాలంలో సైకిళ్ళే లేవు. పరిశ్రమలు,ఆనకట్టలు,ఆస్పత్రులు, పార్మా కంపెనీలు, రహధారులు,ప్రభుత్వ రంగ సంస్ధలు, ఇంటింటికీ కరెంటు, నీరు,నాడు ఉండటానికి గూడు కావాలనే వారు,నేడు సౌకర్యవంతంగా జీవిస్తున్నారు.

లెక్కకు మించి విద్యా సంస్ధలు, కప్యూటర్ రంగం విజృంభన, ఆమెరికా ,ఆస్ట్రేలియా,కెనడా,ఇంగ్లండు దేశాలకు వలసలు.విద్యార్ధులకు నూటికి నూరు మార్కులు,ఐఐటిలు,ఐఐయంలు, నిట్లు, ప్రతిభా వంతులకు ఆన్నీ ఆవకాశాలే.నాడు జొన్నలు, రాగులు,సజ్జలు ,వరిగలే మన ఆహారం.ఏక్కడికి పోవాలన్నా నడవాల్సిందే. నాడు చిరిగిన చొక్కాలు, చిరిగిన నిక్కర్లు,కాళ్ళకూ చెప్పులే ఉండేవి కావు. సెల్ పోన్ లు పెరిగాయి.నాడు ఆయుః ప్రమాణం 57 సం. వత్సరాలు.నేడు 70 సంవత్సరాలు.ఇదంతా  ఓక వైపు.

వేరొకవైపు.ప్రభుత్వ ఆదుపు లేని ఆభివృద్ది, మితి మీరిన ఆర్ధిక వ్యత్యాసాలు, సంపద పెరిగినా వర్గాలు బలపడ్డాయి.సామ్యవాద వీడి పెట్టుబడిదారీ విధానం వైపు ఆడుగులు,ఆవే వర్గాలు, కోటీశ్వరులు,కూలీలు, పరిశ్రామిక వేత్తలూ, శ్రామికులు,భూస్వాములు, కూలీలు.దిశానిర్ధేశం లేని నాయకత్వం,ప్రజాస్వామ్యం పోయి ధనస్వామ్యం, నాయకులు పోయి రౌడీలు, గూండాలు,75 సంవత్సరాల తరువాత మత రాజ్యం వైపు పయనం,ధనికులు నాయకులు ఓటర్లు పేదలు, ఓటర్లనూ,శాసన సభ్యులను కొనటం, వృత్తి నాయకు లు లేరు,సిధ్ధాంతాలు లేవు, ఆంతా గెలుపు, ఓటమి.

గెలిస్తే కోటీశ్వరులు, శత కోటీశ్వరులు ఆవుతారు. ప్రతిభ లేదు, నిభద్ధత లేదు.ప్రభుత్వరంగ సంస్ధల మాయం, మత,కుల ,ఘర్షణలు తారా స్ధాయిలో, మనిషిని మనిషిగా చూసే ధోరణి లేదు.ప్రభుత్వ ఉధ్యోగాలు లేవు. ఆన్నీ ప్రవేటు ఉధ్యోగాలే,8 గంటల పని 12 గంట లైంది.యువత నిర్వీర్య మైంది.ధన మనస్తత్వం పెరిగింది,సామాజక సంభందాలు లేవు, నలుగులు కూర్చొని మాట్లాడే వారే లేరు,ప్రతివాడికీ సెల్ పోన్ కాలక్షేపాలే.  కార్లు,మెూటార్ సైకిళ్ళు, టాక్సీలు వచ్చి జనానికి వలసలు పెరిగాయి.ఏక్కడో ఏదో దేశంలో వారి పని. ఇక ముసలి వారు, పిల్లలు, చదువు లేని వారు నిలయమైంది గ్రామీణం.

సౌకర్యాలు పెరిగినా,జీవన ప్రమాణం పెరిగినా జీవన వ్యయం పెరిగింది.ప్రతిరోజూ పని చేస్తేనే తిండి. మనుషుల మధ్య సయెూధ్య లేదు.మనీ సంస్కృతి పెరిగి మనుషులు దూరమవుతున్నారు.సంపద పెరిగినా మనుషులు నేటికీ మత,కుల భావాలనే పాటిస్తున్నారు.మత సంఘాలు,కుల సంఘాలు,వృత్తి సంఘాలు పెరిగాయి. నేడు మనుషులు లేరు. కులాలు,మతాలు మాత్రమే జీవిస్తున్నాయి.రాజకీయ పదవులను కులాల ఆధారంగా పంపిణీ చేస్తున్నారు. కులాల ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తున్నాయి.

 శాస్త్రం పెరిగింది.సాంకేతికత పెరిగింది.పెరిగిన సాంకేతికతను వినియెూగిస్తున్నాడే గాని,దాని మూల తత్వం విలువగా మారలేదు.మెుదటి నుండి సామా జక సంభందాలు లేక వత్తిడి పెరిగి యువత ఆత్మ హత్యలకు దారితీస్తోంది.తన చుట్టూ తప్ప లోక జ్ణానమే లేదు పిల్లలకు. ఆదీ మన దేశ పరిస్ధితి.నాయకత్వం మనలను క్షాళన చేయాలి గాని వారే మనలను తప్పు దారిలో నడుపుతున్నారు. హేతు త్వం లేదు,వివేచన లేదు,వికాసం లేదు. చదువులు యాంత్రిక మయ్యాయి.ఇది కాదు మనం కోరే సమాజం.సామాజక సంభందాలు, ఆనురాగాలూ ఆప్యాయతలు,ఆనుభందాలు ,సోదర బావం, కలగలిచిన యువత పెరగాలి. కుల సంఘాలు,మత సంఘాలు,వర్గ సంఘాల ప్రాధాన్యత తగ్గాలి. ఆభివృద్ధి వాంచితంగా ఉండాలి. సమానత్వం పెరగాలి.ఆపుడే దేశం సరైన దిశలో నడుస్తుంది.

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...